24, నవంబర్ 2023, శుక్రవారం
14, నవంబర్ 2023, మంగళవారం
శ్రీరాముని ఎంత చక్కగా ప్రశంసిస్తూ గానంచేన్నారో ఈ మహిళామణి. వీరికి రామానుగ్రహం పుష్కలంగా ఉంటుంది.
0 comments
13, నవంబర్ 2023, సోమవారం
కీ.శే.కాళ్ళూరి రామారావు గారి పద్యము గానము.
0 comments
జైశ్రీరామ్.
శ్రీరస్తు
బ్రహ్మశ్రీ కాళ్ళూరి శ్రీ సూర్య వేంకట రామారావు గారికి
అభినందన చందన చర్చ.
రచన. చిత్రకవితాసామ్రాట్ చింతా రామకృష్ణారావు. 8247384165
శా. శ్రీమద్వాణి దయాసుధార్ణవము. మీ చెంతన్ బ్రశాంతిన్ సదా
మీ మందస్మితపూర్వ భాషణమునన్, మీ గానతేజంబునన్,
ప్రేమన్ వాసము చేయుచుండెనొ? లసద్విజ్ఞాన! మీ కబ్బెనే
కామాక్షీకృప? రామరావు విభవా! కాళ్ళూరి వంశోద్భవా!
మ. ఘనమౌ దుందుభి సుస్వనంబు గళమున్, కాంతుల్ శరీరంబునన్,
మనమందున్ శుభ భావనాగరిమ, సమ్మాన్యత్వమున్ వృత్తిలో,
ప్రణవంబెన్నగ జ్ఞానతేజసమునన్, ప్రఖ్యాతిగా నిల్చె, స
ద్గుణపూర్ణా! శుభ సంతతుల్ పడయుఁడీ! కూర్మిన్ ననున్ గాంచుడీ!
శా. ప్రేమన్ మీరలు పంపినట్టి ఘనమౌ శ్రీ సాయి కర్ణామృతం
బే మాన్యత్వము నొప్పు రాగ సుధయౌన్. విఖ్యాతితోనొప్పెడున్.
శ్రీమాతా కరుణోపలబ్ధ ప్రతిభన్ శ్రీమన్మహా రాగముల్
సామర్ధ్యంబున వెల్వరించిరిగ శ్రీ సాయీశు మెప్పొందగన్.
ఉ. చేకొన నాకొసంగితిరి శ్రీకర నర్తన శాల నాటకం
బేకరణిన్ త్వదీయ కృపనెన్నఁగ జాలుదునయ్య నేను? మీ
రాకకు వేచియుందు. నటరాజు కృపన్, గననుంటి మిమ్ము. న
స్తోక శుభంబులన్ గనుచు శోభిలుఁడీరు సతంబు ధాత్రిపై.
ఉ. మంగళ కారకంబయిన మాన్య సురాగములాలపించుచున్,
నింగికిఁ బ్రాకఁ జేసి వరణీయ మహత్కళ కీర్తి తేజమున్,
పొంగఁగ భారతాంబ గుణ పూజ్యులుగా వెలుగొందుడయ్య! సన్
మంగళమూర్తి శ్రీహరి యమంద శుభాస్పదుఁడౌత మీయెడన్.
స్వస్తి.
తేదీ. 15 - 01 - 2018.
జైహింద్.
12, నవంబర్ 2023, ఆదివారం
మీకందరికీ దివ్వెలపండుగ శుభాకాంక్షలు.💐🍒🙏🏻
0 comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః🙏🏻
మీకందరికీ దివ్వెలపండుగ శుభాకాంక్షలు.💐🍒🙏🏻
చం. నరకచతుర్దశిన్ శుభమనంతముగా వరలించు సత్య, సు
స్థిర వరసంపదల్ కొలుపు, శ్రీహరితోడుగనుండి భక్తులన్
పరమదయార్ద్ర చిత్తుడయి పాపచయంబును బాపి యందరిన్
నరకము పాసి స్వర్గము కనంగను జేయును ధాత్రిపైననే.
🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
11, నవంబర్ 2023, శనివారం
కార్తిక మాస తిథుల వైశిష్యము.
0 comments
జైశ్రీరామ్.
కార్తీక శుద్ధపాడ్యమి:- తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయాని వెళ్ళి , నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ:- ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ:- అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.
చవితి:- కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి 'పుట్టకు' పూజ చేయాలి.
పంచమి:- దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్టి:- ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
సప్తమి:- ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది.
అష్టమి:- ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.
నవమి:-ఈ రోజు నుండి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి:- ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి:- ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.
ద్వాదశి:- ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.
త్రయోదశి:- ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.
చతుర్దశి:- పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.
కార్తీక పూర్ణిమ:- మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి:- ఈ రోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం. విదియ:- వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.
తదియ:- పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.
చవితి:- పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
పంచమి:- చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.
షష్ఠి:- గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది.
సప్తమి:- జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.
అష్టమి:- కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి ( కుక్కకు ) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి:- వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి:- ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరతాయి.
ఏకాదశి :- విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం.
ద్వాదశి :- అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి :- నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి :- ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.
అమావాస్య :- నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయం పాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది.
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు , ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.
జైహింద్.
న కార్తిక నమో మాసో ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. న కార్తిక సమో మాసో - న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం - న దేవః కేశవాత్పరః.
తే.గీ. కార్తికము మించు మాసము కనఁగ లేదు.
వేదమును మించు శాస్త్రము లేదు మనకు,
నరయనారోగ్యమును మించు హాయి లేదు,
హరిని మించినదైవంబు నరయ లేడు.
భావాము. కార్తిక మాసముతో సమానమయిన మాసము లేదు.
వేదముతో సమానమగు శాస్త్రము లేదు. రోగము లేకుండా ఉన్నదానికి మించిన
ఉత్సాహము మరొకటి లేదుకేశవునకు మించిన దైవము మరి లేడు.
జైహింద్.
10, నవంబర్ 2023, శుక్రవారం
ప్రముఖ సంస్కృత పండితులతో అద్భుతమైన ప్రసంగం ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగ...
0 comments
9, నవంబర్ 2023, గురువారం
ఆవిర్భావ,హోమాలంకార,నీమంబార,భీభత్స,హొయలెత్తు,పాటించు,ప్రియతమ,శోభాయతా,విందందు,శోభిలు,హుందాతన,ఓంకార,సర్వత్రా,మోక్షితగర్భ ... వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
0 comments
జైశ్రీరామ్.
"-నాగహార"-వృత్తము.
"-నాగహార,"- వృత్తము.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
హోమావిర్భావ శివా భవా!ఓ యాపన్న రక్షాత్మకా!ఓం ధీర నాగ హారా హరా!
హోమాలంకార హవిస్సుకున్!హొయలెత్తు నోంకారతన్!హుందా తనంబు
నీమంబారంగ హరా యనన్!నియమంబు నేపారగా!నెందెందు జూడ నీవే
భీమా!భీభత్సము లంటునే!ప్రియమౌను శోభాయతన్!వెందిర్గ కీవు శ్రీ
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10,18"అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-ఆవిర్భావ"-వృత్తము.
హోమావిర్భావ శివా హరా!
హోమాలంకృత హవిస్సు కున్!
నీమంబారంగ హరా యనన్!
భీమా!భీభత్సము లంటునే?
అభిజ్ఞాఛందము నందలి"బృహతి"ఛందము లోనది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "9" అక్షరము
లుండును.
2."గర్భగత"-హోమాలంకార"-వృత్తము.
ఓ యాపన్న రక్షా త్మకా!
హొయలెత్తు నోంకారతన్!
నియమంబు పాటింపగా!
ప్రియమౌను శోభాయతన్!
అభిజ్ఝాఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును
3.గర్భగత"-నీమంబార"-వృత్తము.
ఓం ధీర నాగ హారా హరా!
హుందా తనంబు పాటించితే!
నెందెందు జూడ నీవే గదా!
వెందిర్గ కీవు శ్రీ లీయగన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4, "గర్భగత"-భీభత్స"-వృత్తము.
హోమావిర్భావ శివా భవా!ఓ యాపన్న రక్షాత్మకా!
హోమాలంకార హవిస్సు కున్!హొయలెత్తు నోంకారతన్!
నీమంబారంగ హరా యనన్!నియమంబు పాటింగా!
భీమా!భీహత్సము లంటునే!ప్రియమౌను శోభాయతన్!
అణిమాఛందమునందలి "-అత్యష్టి"- ఛందములోనిది పాదమునకు17"అక్షరములుండును.ప్రా
యతి"10,వ యక్షరమునకై చెల్లును.
5.గర్భగత"-హొయలెత్తు "-వృత్తము
ఓ యాపన్న రక్షాత్మకా!ఓం ధీర నాగ హారా హరా!
హొయలెత్తు నోంకారతన్!హుందా తనంబు పాటించితే!
నియమంబు పాటింపగా!నెందెందు జూడ నీవే గదా!
ప్రియమౌ శోభాయతన్! వెందిర్గ కీవు శ్రీ లీయగన్!
అణిమా ఛందమునందలి"అత్యష్టి'-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి9,వయక్షరమునకు చెల్లును.
6.గర్భగత"-పాటించు"-వృత్తము.
ఓం ధీర నాగ హారా హరా!హోమావిర్భావ శివా హరా!
హుందా తనంబు పాటించితే!హోమాలంకార హవిస్సుకున్!
నెంధెంధు చూడ నీవే గదా!నీమంబారంగ హరా యనన్!
వెందిర్గ కీవు శ్రీ లీయగన్!భీమా!భీభత్సము లంటునే!
అణా ఛందమునందలి"-ధృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండు
యతి"10"వయక్షరమునకు చెల్లును.
7"గరభగత"-ప్రియతమ"-వృత్తము.
ఓంధీర నాగ హారా హరా!ఓ యాపన్న రక్షాత్మకా!
హుందాతనంబు పాటిచితే!హొయలెత్తు నోంకారతన్!
నెందెందు చూడ నీవే గదా!నియమంబు పాటింపగా!
వెందిర్గ కీవు శ్రీ లీయగన్!ప్రియమౌను శోభాయతన్!
"8గర్భగత"-శోభాయతా"-వృత్తము.
ఓ యాపన్న రక్షాత్మకా!హోమావిర్భావ శివా హరా!
హొయలెత్తు నోంకారతన్!హోమాలంకార హవిస్సు కున్!
నియమంబు పాటింపగా!నీమంబారంగ హరా యనన్!
ప్రియమౌను శోభాయతన్!భీమా!భీభత్సము లంటునే!
అణిమా ఛందమునందలె"-అత్యష్టి"-ఛందములో
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
యతి"9"వ య్క్షరమునకు చెల్లును.
9,గర్భగత"-విందందు"-వృత్తము.
హోమావిర్భావ శివా హరా!ఓంధీర నాగ హారా హరా!
హోమాలంకృత హవిస్సు కున్!హుందా తనంబు పాటించితే!
నీమంబారంగ హరా యనన్!నెందెందు చూడ నీవే గదా!
భీమా!భీభత్సవంము లంటునే! వెందిర్గ కీవు శ్రీ లీయగన్!
అణిమా ఛందమునందలి"-ధృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"18"అక్షరములుండును.
యతి"10"వయక్షరమునకు చెల్లును.
10,గర్భగత"శోభిలు"-వృత్తము.
ఓ యాపన్న రక్షాత్మకా!ఓం ధీర నాగ హారా హరా!హోమావిర్భావ శివా
హొయలెన్తు నోంకారతన్!హుందా తనంబు పాటించితే!హోమాలంకార
నియమంబు పాటించగా!నెందెందు జూడ నీవే గదా!నీమంబారంగ
ప్రియమౌను శోభాయతన్!వెందిర్గ కీవు శ్రీ లీయగన్!భీమా భీభత్సము
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరము లుండును.
యతులు"9",18,అక్షరములకు చెల్లును.
11.గర్భగత"-హుందాతనం"-వృత్తము.
ఓంధీర నాగా హారా హరా!హోమావిర్భావ శివా భవా!ఓయాపన్న
హుందాతనంబు పాటించితే!హోమాలంకార హవిస్సుకున్!హొయలెత్తు
నెందెందు జూడ నీవే గదా!నీమంబారంగ హరా యనన్!నియమంబు
వెందిర్గ కీవు శ్రీ లీయగన్!భీమా భీభత్సంబు లంటునే!ప్రియమౌచు
అనిర్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10"19,అక్షరములకు చెల్లును.
12.గర్భగత"-ఓంకార"-వృత్తము.
ఓంధీర నాగ హారా హరా!ఓయాపన్న రక్షాత్మకా3!హోమావిర్భావ
హుందా తనంబు పాటించితే!హొయలెత్తు నోంకారతన్!హోమాలంకార
నెందెందు జూడ నీవే గదా!నియమంబు పాటింపగా!నీమంబారంగ
వెందిర్గ కీవు శ్రీ లీయగన్!ప్రియమౌచు శోభాయతన్!భీమా!భీభత్సంబు
అనిరుద్ఛందాంతర్గత"-ఉతకృతి "ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10,18,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-సర్వత్రా"-వృత్తము.
ఓ యాపన్న రక్షాత్మకా!హోమావిర్భావ శివా భవా!ఓంధీర నాగ హారా
హొయలెత్తు నోంకారతన్!హోమాలంకార హవిస్సు కున్!హుందాతనంబు
నియమంబు పాటింపగా!నీమంబారంగ హరా యనన్!నెందెందు జూడ
ప్రియమౌచు శోభాయతన్!భీమా!భీభత్సంబు లంటునే!వెందిర్గ కీవు
అనిరద్ఛందమునందలె"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు.9",18,యక్షరములకు చెల్లును.
14"గర్భగత"-మోక్షిత"-వృత్తము.
హోమా విర్భావ శివా భవా!ఓం ధీర నాగ హారా హరా!ఓయానన్న
హోమాలంకార హవిస్సుకున్!హుందాతనంబు పాటించితే!హొయలెత్తు
నీమంబారంగ హరా యనన్!నెందెందు జూడ నీవే గదా!నియమంబు
భీభా!భీభత్సంబు లంటునే!వందిర్గ కీవు శ్రీలీయగన్!ప్రియమౌను
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాస నియమము కలదు.పాదమునకు"26",అక్షరములుండు
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
జైహింద్.
చన్దనం శీతలం లోకే, ... మేలిమి బంగారం మన సమ్స్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. చన్దనం శీతలం లోకే, - చందనాదపి చంద్రమా|
చంద్రచన్దనయోర్మధ్యే - శీతలా సాధుసంగతః||
తే.గీ. చందనము లోకులకునిచ్చు చల్లఁదనము,
శశియునట్టులే మనకిచ్చు చల్లఁదనము,
సాధుసాంగత్యమిచ్చెడి చల్లఁదనము
చంద్ర చందనముల కన్న చాల హెచ్చు.
భావము. లోకములో మంచిగంధము చల్లఁదనాన్ని కల్గఁజేస్తుంది.
చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగ జేస్తాడు.
చందనము చంద్రుడు రెంటికి కంటే సజ్జనుల సాంగత్యం
మరీ ఎక్కువ చల్లదనాన్ని కలుగ జేస్తుంది.అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని,
ప్రశాంతతని చేకూరుస్తుంది.
జైహింద్.
నష్టం ద్రవ్యం లభ్యతే కష్టసాధ్యం, ..... మేలిమిబంగారం మన సమ్స్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. నష్టం ద్రవ్యం లభ్యతే కష్టసాధ్యం,నష్టా
విద్యా లభ్యతే sభ్యాసాయుక్తా ౹
నష్టారోగ్యం సూపచారై: సుసాధ్యం
నష్టా వేలా యా గతా సా గతైవ ౹౹
తే.గీ. నష్ట ధనమది పొందనౌ కష్టపడిన,
చదువు మరచిన పొందనౌన్ జదివి మరల,
స్వాస్త్యమది చెడన్ వైద్యాన సరిగనగును,
గడుచు కాలము మరిరాదు కనుడు నిజము.
భావము.
పోయిన సంపద కష్టపడి మళ్ళీ సంపాదించ వచ్చు.
మరచి పోయిన విద్యను మళ్ళీ చదివితే పొందవచ్చు.
ఆరోగ్యం చెడిపోతే చికిత్సలు చేసి అది కూడా పొందవచ్చు.
అయితే,పోయిన సమయం తిరిగి మనకి దొరకదు.
జైహింద్.
7, నవంబర్ 2023, మంగళవారం
నా గురించి నేను .... నిర్వహణ భక్తిసాధనం.
0 comments
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీమన్మంగళ భక్తి సాధన సమూహ సభ్యులకు ప్రణామములు.
అంశము ... నాగురించి ....
సీ. నా యన్నదెవరని నన్ను నేనడుగ, తా నా తండ్రి నడుగంగ నన్నుఁ బంపె,
సన్యాసి రామాఖ్య సదయులౌ నాతండ్రి, నా తల్లి రత్నమ్ము నన్నుఁ జూచి
పాంచ భౌతిక దేహ బద్ధుఁడై పరమాత్మ నీ దేహమందున నిలిచియుండ,
తానె నీవైతివి, తాదాత్మ్యతంజెంది నిన్ను నీ వెఁఱిఁగుము నియతి ననిరి,
తే.గీ. అప్పు డేన్ గాంచి తాత్మలో ననుపమముగ
నున్న నా తల్లిదండ్రులే యుమయు శివుఁడు
నాదు ప్రాణమై నాలోన మోదమలర
యున్నవిషయంబు నా యన్న దున్నదదియె.
ఆత్మస్వరూపులయిన ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుచు
సంస్కృతం అంటే ఏమిటి? వివరణ బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.
0 comments
జైశ్రీరామ్.
సంస్కృతం అంటే ఏమిటి? వివరణ బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.
బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.శ్లో. "సంస్కృతం సంస్కృతం నామ - న పదం వ్యర్థ సంజ్ణికం
అన్వర్థాక్షర మేతద్ధి - సంస్కరోతీతి సంస్కృతమ్"
సంస్కృత భాషకుగల సంస్కృతమను నామము కేవలం సాంకేతికమూ నిరర్థకమూ గాదు. సార్థకము " సంస్కారోతీతి సంస్కృతం. " అను నిర్వచనము ఈ భాషయొక్క సార్థకతను దర్షింప జేయుచున్నది. సం + కరోతి - ఇట సమ్పరిభ్యాం కరోతౌ భూషణే ; సమవాయే చ " అను పాణిని సూత్రములచే 'సుట్ ' అను ఆగమము చేరి 'సంస్కారోతి ' అను రూపమేర్పడును. అని వ్యాకరణశాస్త్రము చెప్పుచున్నది. " పురుషుని అలంకరించునది. సంఘటిత పరుచునది. అని రెండర్థములు. అనగా ; ఈ భాష పురుషునకు అలంకారమై సంఘీభావమునకు దోహదము చేయునని ఈ నిర్వచనము వలన స్పష్టమగుచున్నది.
" వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే "
అనుచు భర్తృ హరియు సంస్కృత శబ్ద నిర్వచనమును తద్భాషా వైశిష్యమును తెలియజేయుచున్నాడు. ఎచట ' ఏకా 'అను శబ్దము మానవుల కలంకార ప్రాయమై భాష ఇది యెక్కటియె ; అని అనిస్పష్టము జేయుచున్నది.
" యా సంస్కృతా ధార్యతే "
ఈ సంస్కృతమును కేవలము ఇతర భాషలవంటి భాషగానే దర్శించకుడు. దీని యందుగల సంస్కృతత్త్వమును ధర్మమును దర్శించి ధరుంచినపుడే అలంకారమగును. అని అర్థము. నిగమ నిరుక్త వ్యాకరణాదులచే
సు సంస్కృత మైన చిత్తముతో దర్శించినప్పుడు ఈ భాష సువర్ణమయ దివ్య కాంతులను విరజిమ్ముచు దివ్య శోభల వెల్లివిరియజేయుచు దేవభాషయై అమరవాణియై సాక్షాత్కరించును. బాబూ దేవీ దాస్ రావు.
జైహింద్.
నా గురించి ... అని శీర్షికతో భక్తిసాధనం వేదిక నిర్వాహకులు వ్రాయమనగా నేను వ్రాసిన సీసము.
0 comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్రీమన్మంగళ భక్తి సాధనం సమూహ సభ్యులకు ప్రణామములు.
అంశము ... నాగురించి ....
సీ. నా యన్నదెవరని నన్ను నేనడుగ, తా నా తండ్రి నడుగంగ నన్నుఁ బంపె,
సన్యాసి రామాఖ్య సదయులౌ నాతండ్రి, నా తల్లి రత్నమ్ము నన్నుఁ జూచి
పాంచ భౌతిక దేహ బద్ధుఁడై పరమాత్మ నీ దేహమందున నిలిచియుండ,
తానె నీవైతివి, తాదాత్మ్యతంజెంది నిన్ను నీ వెఁఱుఁగుము నియతి ననిరి,
తే.గీ. అప్పు డేన్ గాంచి తాత్మలో ననుపమముగ
నున్న నా తల్లిదండ్రులే యుమయు శివుఁడు
నాదు ప్రాణమై నాలోన మోదమలర
యున్నవిషయంబు నా యన్న దున్నదదియె.
ఆత్మస్వరూపులయిన ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుచు
చింతా రామకృష్ణారావు.🙏🏼
జైహింద్.,
స్వాగతేనాగ్నయ స్తృప్తా, ... మేలిమి బంగారం మన సమ్స్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. స్వాగతేనాగ్నయ స్తృప్తా, ఆసనేన శతక్రతుః।
పాదశౌచేన పితరః, అర్ఘ్యాచ్ఛమ్భుస్తథాతిథేః॥
తే.గీ. స్వాగతము పల్క నగ్నులు సంతసింతు,
రాసమున నింద్రుఁ డానంద మం దతిథికి,
పాదపాద్యాన పితరులు పరవశింతు,
రర్ఘ్యమున శంభుఁడానందమందు, మహిత!
భావము.
అతిథికి స్వాగతము పలుకుటతో అగ్ని, ఆసనము వేయుటతో ఇంద్రుడు,
పాదములు కడుగుటతో పితృదేవతలు, అర్థ్య, ఫల, పుష్ప, నైవేద్యాదులు
సమర్పించుటతో పరమేశ్వరుడు, సంతోషము పొందుదురు.
జైహింద్.