గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, డిసెంబర్ 2019, శుక్రవారం

6 సెప్టెం, 2016 3:18 AM ఏల్చూరి మురళీధరరావు గారికి.

జైశ్రీరామ్.
6 సెప్టెం, 2016 3:18 AM

శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి వందనములు.

శారద ముద్దు బిడ్డలు నసాదృశ  భావ కవీంద్రులైన యే
ల్చూరి కులాబ్ధి చంద్ర! విన సొంపుగ పద్య సుమార్చనంబునన్
భారతరాష్ట్రనాథుఁడగు పండితుఁ జూపుచు నాంధ్రభూమికే
పేరును పెంచినారు సుకవీ! మురళీధర! సన్నుతాత్ముఁడా!

అభినందనలతో
మీ
చింతా రామ కృష్ణా రావు.  

పూజ్యతములు, సత్కవీంద్రులు శ్రీ చింతా రామకృష్ణార్యులకు
నమస్కారములతో,

పదసౌభాగ్యము, వాక్యగౌరవము, భవ్యప్రౌఢిమై మంగళా
స్పదమై దివ్యమహాద్భుతాశుకవితాప్రావీణ్యసంశోభి సౌ
హృద మొప్పారెడి మీ శుభాశిషము నర్థిం గొన్న పుణ్యంబునన్    
హృదయం బెంతయుఁ బొంగె సంతసముతో శ్రీ రామకృష్ణాభిదా!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు .
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.