గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2019, ఆదివారం

గీతా జయంతి సందర్భముగా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులకు వందనములు.
నేడు శ్రీమద్గీతాజయంతి 
ఆ శ్రీకృష్ణపరమాత్మునకు మనపై ఉన్న అపార కరుణకు సాక్ష్యమే ఆ పరమాత్మ మనకందించిన  భగవద్గీత.
ఆ గీతను అవగాహనచేసుకొనుట సాధన చేయుట అనునవి సుకృతవిశేషముననే లభించును కాని ఊరకనే లభించవు.
గీత సాధన చేసి అనుసరించి మానవులు తమ నుదుటి వ్రాతను అనుకూలముగా మార్చుకొందురుగాక.
మీ అందరికీ గీతాజయంతి సందర్భముగా ఆపరమాత్మ కృపామృతం లభించాలని కోరుకొంటూ శుభాకాంక్షలను తెలియఁ జేయుచున్నాను.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.