గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2019, మంగళవారం

పిల్లల పెంపకం.

 జై శ్రీరామ్
పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులం మనమే..!!

పిల్లల్ని గరాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుడు తరం పిల్లలు.
వారి సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు.

లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు.

కనీసం లోదుస్తులు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు.

గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.

తిట్టితే వస్తువులను విసిరి కొడతారు.
ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఫైవ్ స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, కొనుగోలు చేస్తున్నారు.


ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.

అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు.

డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.

బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి,

కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు వారిస్తే వెర్రి పనులు.

ఎందుకంటే మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.
కానీ కారణం మనమే.
ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.
కష్టం గురించి తెలిసేలా పెంచండి అని.
కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే. వారికి జీవితం విలువ తెలియదు.

ప్రేమతో, గరాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.

అభినయాలు కనపడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ  చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, బాక్సు రైస్.

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి.
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు.
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు.
10 దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి.

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే తల్లిదండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?

ఒక్క సారి ఆలోచన చేయండి.

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి?

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే. అలా అనుకోవడం కొంత పొరపాటు.

పిల్లలకు.

బాధ్యత
బరువు
మర్యాద
గౌరవం
కష్టం
నష్టం
ఓర్పు
సహనం
దాతృత్వం
ప్రేమ
అనురాగం
సహాయం
సహకారం
నాయకత్వం
మానసిక ద్రృఢత్వం
కుటుంబ బంధాలు
అనుబంధాలు 
దైవం
దేశం

ఇవి సంప్రదాయాలు అంటే.

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం.

మనం కూడా మమేకమవుదాం.

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన ,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

సర్వేజనా సఖినో భవంతు.

బడిలో ఉన్నా అత్యాచారం
ఒడిలో ఉన్నా అత్యాచారం
నట్టింట్లో అత్యాచారం
నడిబజారులో అత్యాచారం
ఒంటరిగా ఉంటే అత్యాచారం
జంటగా ఉన్నా అత్యాచారం
బాలికపై అత్యాచారం
బాలింతపై అత్యాచారం
మత్తు ఎక్కితే అత్యాచారం
మగువ చిక్కితే అత్యాచారం
ప్రేమించకుంటే అత్యాచారం
ప్రేమించినా అత్యాచారం
పసిపిల్లపై అత్యాచారం
పండు ముసలిపై అత్యాచారం
పుట్టిన పిల్లపై అత్యాచారం
చచ్చిన శవంపై అత్యాచారం .
ఎవరిని మిగిల్చావురా చివరికి నీపై నీవే అత్యాచారం చేసుకోవడం తప్ప .
ఛీ ఏమిటీ సొసైటీ? మగవానిలో ఇలాంటి పైశాచికత్వం కాముకత్వం విచ్చలవిడితనం మొదలగునవి కలగటానికి కారణాలు ఏమైఉండవచ్చు అన్నప్పుడు, కొద్దిమంది చెప్పుచున్న జవాబులు ఏమిటంటే, సినిమాల్లో చుపెడుచున్న సెక్సీ మూమెంట్స్, అలాగే టివి లలో వచ్చుచున్న కొన్ని సీరియల్స్ సెల్ ఫోన్స్ లో ఫోర్నో గ్రఫీ కి సంబంధించిన వీడియోలు, దానికి తగ్గట్టుగా యువతులు అందాలను ఆరబోసి కున్నట్టుగా డ్ర స్సులు ఇలా ఎన్నో కారణాలు ఉండటం తో యువకులతో పాటు మద్యవయుస్కులలో కూడా మానసికముగ కోర్కెలు రగిలి, అది ఆడది అయ్యుంటేచాలు,ఒంటరిగా దొరికిందా పాపం ఆమెపై బలవంతంగా అత్యాచారం చేస్తమే కాక క్రూరంగా చంపేయ టానికి కూడా ఏమాత్రము వెనుకాడుటలేదు. దీ నికేదో మార్గం కనిపెట్టకపోతే మునుముందు ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు లేవంటారా?

నాచేత ఆ పరమాత్మ వ్రాయించిన బాలభావన శతకమును పెద్దలు కంఠస్థము చేయుటతోపాటు చిత్తశుద్ధితో సహనముతో సాధన చేస్తే కొంత మార్పు ఉండవచ్చేమో ఆలోచించండి.

2. మద్యపానాన్ని మన దేశంలో పూర్తిగా లేకుండి చేయాలి.
ఈ పని ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పూర్తిగా చేసినట్టున్నారు.
ఇది చెయ్యాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండిలి.

3. పౌరులందరూ బాధ్యతియుతంగి ప్రవర్తించిలి. ఈ సమాజంలో మనకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉన్నదంటే అది ఇతరుల హక్కుకు భంగం కలిగించకుండా, సమాజానికి ఎటువంటి కీడూ కలిగించకుండా మనం జీవించడానికి సమాజం ఎన్నో విధాల ప్రత్యక్షంగా పరౌక్షంగా కారణమగుచున్నందున అట్టి సమాజంయొక్క ఋణం కొంచెమయినా మనం తీర్చుకోడానికి ఏదో విధంగా సమాజ శ్రేయస్సుకు మనం చేతనైనట్టు తోడ్పడడం చేయఁగలిగితే మార్పు ఎలా రాకుండా ఉంటుందండీ.

4. పిల్లలను పాఠశాలలో వేసిన దగ్ఖరినుంచీ వారానికొక నీతి శ్లోకము అర్థ తాత్పర్యాలతో రోజూ చదివిస్తుంటే అవినీతి బీజాలెలా పడతాయండి వారిలో.

4. మానవుఁడు అనుకరణశీలి. అనుకరించకుండా పెరుగుట అసాధ్యం. కావున మన ప్రవర్తననే పిల్లలనుకరిస్తారన్న స్పృహను మనం కోల్పోకూడదు.
యద్యదా చరతి శ్రేష్టః.
అనేశ్లోకం తెలుసు కదా.
ముందుగా మనం తప్పుగా ప్రవర్తించకుండా ఉంటే  పిల్లలు ఎలా తప్పత్రోవపట్టగలరండీ.

5. పిల్లల మెదడును ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక మంచి మార్గంవైపు నిత్యం మళ్ళేలాగ ప్రేరేపించే సామర్ధ్యం మనకుండాలి. అప్పుడు వారికి తప్పుడుపని చేసే అవకాశమే ఉండదుకదా.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగా చెప్పారు ఇంతమంచి వ్యాసాన్ని కొందరైనా చదివి ఆచరించ గలిగితే ముదావహం.అనర్ధాలకి మూలకారణం ముఖ్యంగా {క్షమించాలి }తల్లులు .

శశి కుమార్ చెప్పారు...

చాలా చక్కగా చెప్పారు!! ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.