గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, మార్చి 2019, గురువారం

కే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 91వపద్యమునుండి 95వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

 91. ఉ. అల్పులమయ్య. నీ ప్రతిభనర్థముచేసుకొనంగలేము. నిన్
నిల్పగలేము మా మదుల నిత్యము నిర్మల భావముంచి. సం
కల్పబలంబు లేదు. గతి గానగ లేమయ. సత్య మార్గమున్
దెల్పుము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

92. ఉ. ఉల్లమునందు శాంతము, సమున్నత సద్గుణ సద్విభాసమున్, 
చల్లని మానసంబును, ప్రశస్త మనోజ్ఞ కవిత్వ ధారలన్.
కాళ్ళకు శక్తినీయుమయ కాదనకుండగ
గౌరవంబు సం
ధిల్లగ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

93. ఉ. సూక్తి సుధాస్మృతి వసుంధర నందరు నేర్చి సర్వదా
భక్తి ప్రపత్తులం గలిగి భావన చేసి పఠించుచుండినన్
సూక్తుల సంతచే మిగుల శోభిలుటన్ గని  మారు మ్రోగు నా
దిక్తటి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 94. ఉ. అర్చన చేయఁ జేయుము మహాత్మ త్వదీయపదాంబుజంబులన్.
కూర్చుము భక్తి తత్పరత కూరిమితోడ మదాత్మలో. కృపం
జేర్చుము మమ్మునీకడకు. శ్రీకర! బంధుర సందియంబులన్
తీర్చుమ. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

95. ఉ. యోగముచేతనైహికము, యోగము చేత పరంబు ప్రాప్తమౌ
నీగతి కొల్పు యోగముననేక ఫలంబుల మంచి చెడ్డలన్
సాగఁగ చేయుచుండు మము. సద్గురువర్యుఁడ!కొల్పుమయ్య స
ద్యోగము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.