గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2019, గురువారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 21వపద్యమునుండి 25వ పద్యము వరకు.

0 comments

 జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

21. చ. ద్విజులను పేరుఁగన్న యిలవేల్పులు కాణ్వ మహత్వ శాఖజుల్.
ప్రజలకు మేలు చేయుచు, వరంబువనిచ్చెడి భవ్యమూర్తులున్.
నిజమగు నీదు శక్తిని గణించుటచేతనె గణ్యులైరయా.
ద్విజ నుత! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 22. చ. శరణుగురూత్తమా! మనసు చంచలమౌచు జగత్ప్రకాశకున్
హరిని కనంగనీదు. దురహంకృతి చీకటి క్రమ్మఁ జేయు. భా
సురమగు సత్యమున్ గనఁగ చూపుమయా మహనీయమైనదౌ
తెరవును, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 23. చ. పగలును రాత్రియున్ విడని పాపము గొల్పెడి దుష్ప్రవృత్తులే
జగతిని కన్నులం బడు. నిజంబిది దుర్మతిఁ పెంచు మాకు నే
ప్రగతియులేక చింతిలెడివారము. నీవిక
పాపుమయ్య మా
దిగులును. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 24. చ. దినపతి ధర్మ బద్ధుఁడయి తీరుగనాకసవీధిలోననే
యనిశము సంచరించు. మనయందు తదద్భుత శక్తిఁ గొల్పడే.
జనులును ధర్మబద్ధులయి చక్కఁగనుండఁగ చేయఁగల్గఁడే
దినమణి?  యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 25. ఉ. భూజనులందు సద్గుణ సుపూజ్యులు కణ్వ ప్రశంస శాఖజుల్.
రాజిలు శక్తి కోల్పడి పరాజయ మార్గము పట్టనీకుమా.
నీ జయ శీలమెన్ని పరిణీతులవన్ తగ నీవు కొల్పుము
త్తేజము. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.




27, ఫిబ్రవరి 2019, బుధవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 16వపద్యమునుండి 20వ పద్యము వరకు.

0 comments


  జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.

16. చ. వెతలు భరించ లేక ప్రభవించెడు దుర్గతులాప నేరమిన్
క్షితిని కృశించుచుండిరి విశిష్టమహాత్ములె. శక్తి హీనులై.
బ్రతుకఁగ దివ్య మార్గమును, బాధలఁ గెల్చెడి
శక్తినిమ్ము బా
ధితులకు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 17. చ. క్షణమున భంగురంబటుల కాలము గర్భము జొచ్చు పృథ్విపై
గుణగణులాదిశాఖజులు కూర్ముని తప్ప యిహంబు కోరరీ
ధనములు రత్నహారములు ధర్మపరిగ్రహులైన వీరికిన్
తృణమయ! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 18. ఉ. శ్రీవర తేజులౌ ప్రథమచిద్వర శాఖజులైనవారికిన్
దీవన లీయ వేడెదను. దీనులనెల్లెడ కావ వేడెదన్.
భావజ న్యూనతన్ దుడిచి భాస్కర తేజము గొల్పఁ గోరెదన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 19. ఉ. భావి తరంబులన్ సుగతి వర్ధిలఁ జేయు మహాత్ములెందరో
మీ వరణీయ తేజమును మీ మహనీయతలన్ స్మరించు. సం
సేవలఁ దేల్చు మిమ్ములను . చిత్తమునన్ స్మరియింతు వారలన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 20. చ. వలయునదేది దుర్గతిని బాయఁగ నెంచిన మానవాళికిన్?
ఫలములనెట్లు వీడనగు పాపము పుణ్యము చేయువారికిన్?
మెలకువ కొల్పు మాకు, గుణమేదుర. సత్పరివర్ధకంబు కాన్
దెలుపుము! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.

26, ఫిబ్రవరి 2019, మంగళవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 11వపద్యమునుండి 15వ పద్యము వరకు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

11. చ. కలియుగమందు పుట్టుటను కానిపనుల్ పచరించుచుంటిమే,
తెలియకపోవుటన్. కృపను తీరుగ మా మదులందు జ్ఞానమున్
బలముగ పొందఁగా వలయు. భవ్యుఁడ సన్నుత దివ్యమార్గమున్
దెలుపుము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 12. చ. పరిపరి వేడెదన్. సుగుణ వర్ధన చేసెడి సత్కవిత్వమున్
నిరుపమ మార్గమందు వరణీయముగా నెలకొల్పుమయ్య. నన్
గరుణను చూడుమయ్య. గురుగౌరవ తేజములిమ్ము నాకు సు
స్థిరముగ, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 13. చ. అతులిత తేజసంబు పరమాద్భుత రీతిని నిన్ను చేర, సం
స్తుతులను ముంచెనీజగతి శోభిలుచుండెడి నిన్నుఁగాంచి, యే
గతిని వహించె నిన్ ప్రభలు? కాంచఁగ మాకును చూపుమయ్య. వం
దిత పద! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 14. చ. క్షితిని మహాత్ములెల్లరును శిక్షణనిచ్చెడి సద్గురూత్తముల్.
సతతము వారి వర్తనము చక్కఁగనెంచి గ్రహించువారు స
న్నుతమతులై రహించెదరనూనగతిన్. మరి నాకు కూడ యా
ధృతినిడు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 15. చ. సుజనులె నీదు మార్గమున శోభిల వర్తిలనేర్తురయ్య స
ద్విజయము కాంచగా వలచి. విజ్ఞులు వారలు. నన్ను నీవు నీ
విజయ పథమ్మునన్ నడిపి విజ్ఞతతోడ వశింపఁ జేయుమా.
ద్విజవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

(సశేషమ్)
జైహింద్.

25, ఫిబ్రవరి 2019, సోమవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 6వపద్యమునుండి 10వ పద్యము వరకు.

1 comments

6. చ. అవనిని కాణ్వ శాఖను మహాత్ములనేకులు జ్ఞాన తేజులై
ప్రవిమలకీర్తిఁ గొల్పిరి. పరాత్పర సన్నిభులెల్లరున్ గనన్.
భువిననురాగయుక్తులగు పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  7. చ. శ్రవణ కుతూహలమ్ముగ, ప్రశంసలనందెడు రీతి వేదమున్
సువిదిత రీతి చెప్పఁగల శోభనమూర్తులు వేద పండితుల్
భువిని వశించు భాస్కరులు. పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  8. ఉ. భావన చేత , మాటలను, పట్టుగ చేసెడి చేతలన్ సదా
ధీవరులెన్న నొక్కటిగ తీరుగ చేసెడి దివ్యమూర్తులన్
సేవలు నీకు చేయు శుభ చిత్తులకేను నమస్కరింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  9. ఉ. భావిని చూచి చెప్పెడి ప్రభావము కల్గిన కాణ్వశాఖ రా
జీవ మహాత్ములన్ దలచి చేసెద వారికి వందనంబులన్.
శ్రీవరణీయులై చెలఁగు చిన్మయమూర్తులకీవె తోడుగా.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 10. చ. శ్రవణ కుతూహలమ్మయిన చక్కని కావ్యములల్లు సత్కవుల్
భువిని వసింతురందుఁ గల పూజ్యులలోపల కాణ్వ శాఖజుల్
ప్రవరులుగా గణింపఁబడు వారిని కల్గెడి దివ్యమైన భా


తివి కన యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

24, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 1వపద్యమునుండి 5వ పద్యము వరకు.

1 comments

జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

  1.ఉ. శ్రీ వనజాప్త లబ్ధ వర చిన్మయ వేద నిధాన! నిత్యమున్
దేవ సుపూజితాద్యుఁడగు దివ్య వినాయకునాత్మనెంచి, నిన్ 
భావన చేసి యీ శతక భర్తగ, నే విరచింతు నీపయిన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  2.  ఉ. భూవలయంబులో సుజన పూజిత దివ్య పదారవిందయౌ,
భావనలోన మెల్గు వరవాణికి, పుస్తక రమ్యపాణికిన్,
శ్రీవనజాత సంభవుని చిన్ముఖ వాసినికంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  3. ఉ. జీవనమిచ్చినట్టి రఘు చిన్మయ వేంకట వీర సద్గురున్,
భావన చేసి నా మదిని, భక్తిసమన్వితునై భజించుచున్ 
దీవనలీయఁ గోరుదును దివ్యముగా విరచింపదీనినో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  4. ఉ. దేవులకెల్ల దేవుఁడును, దీనజనావన దీక్షితుండు, స
జ్జీవన మార్గదర్శకుఁడు, శ్రీకర కృష్ణుడు, వానినెన్నుచున్
బ్రోవఁగ గోరుచున్ మదిని పూజ్య పదంబుల కంజలింతు నో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  5. ఉ. జీవన భాగ్య హేతువయి, సృష్టికి మూలమునై యహర్నిశల్
భావనకైన చిక్కని ప్రభా నిలయుండగు భాస్కరుండు సం
భావితమూర్తియై పగలు వర్ధిలు. వానికినంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషమ్)
జైహింద్.

23, ఫిబ్రవరి 2019, శనివారం

ద్విపాది

1 comments

జైశ్రీరామ్
ద్విపాది 

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె

ఇందులో ఒకటి, రెండు పాదాలు ఒకేలాగా ,మూడు,నాలుగు పాదాలు ఒకే లాగా వున్నాయి.
కానీ అర్థం మాత్రం వేరు.ప్రకాశించే పర్వత శిఖరాగ్రాన వేడుకగా తిరిగే ఈశ్వరుని గొప్పతనం
కంటె అని ఒకటి,రెండు పాదాల అర్థం. విరాజిల్లుచున్న చెట్టు చివర సంచరించే నెమళ్ళఅతిశయం చూశావా? అని మూడు,నాలుగు పాదాల అర్థం.ఈశ్వరుని కంటె కూడా నెమళ్ళు ఒప్పారుచున్నవి అని వర్ణించిన భావం ఎంతో రమణీయంగా వుంది కదా! ఇది కాశీపత్యవధానుల గారి వర్ణన.
 జైహింద్.

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఏకపాది.శ్రీకాశీ పత్యావధానులు

1 comments

జైశ్రీరామ్.
ఏకపాది.శ్రీకాశీ పత్యావధానులు
ఉత్సాహా వృత్తము :-
నాడు దాని గాననేర నా తుటారి జోడుగా
నాడుదాని గాననేర నా తుటారి జోడుగా
నాడుదాని గాననేర నా తుటారి జోడుగా
నాడు దాని గాననేర నా తుటారి జోడుగా
(హరిశ్చంద్రోపాఖ్యానము -ద్వితీయాశ్వాసము -59 వ పద్యం )
(కాశీపత్యవధానులు)
ఇందులోని నాలుగు పాదాలూ ఒకే విధంగా వున్నాయి. కానీ అర్థాలు మాత్రం వేరుగా
వున్నాయి. చమత్కారంగా వచ్చే విధంగా విరిచి చదవాలి. ఇందుకు తెలుగు భాషలో
అభినివేశ౦  వుండాలి.దాన్ని యిలా చదివితే ఆ వింత బోధపడుతుంది.
నాఁడు దాని గాన నేరనా?=పూర్వము దీన్ని ఎప్పుడూ చూడలేక పోయానా? అని ఆశ్చర్యం
వెల్లడించడం ఒక అర్థం. ఈ ప్రదేశం లో ఉంటున్నప్పటికీ తెలుసుకో లేక పోతినే
అని తెలివితక్కువ తనాన్ని వెల్లడించడము.రెండవ అర్థము. కాననేరన్ +ఆ +తుటారి
జోడుగా నాఁడు దాని విడదీస్తే కాన నేరను అని మొదటి అర్థానికి చెల్లగా ఆ తుటారి
అని ముందు పదానికి అన్వయించడానికి వీలు వుంది.అప్పుడు ఆ గడుసు దానితో
సమానంగా ఆడేదాన్నికాన నేరను అని అన్వయం కుదురుతుంది
 జైహింద్.

21, ఫిబ్రవరి 2019, గురువారం

మాతృభాషాదినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
నేడు అంతర్ జాతీయ మాతృ భాషా దినోత్సవము.
ఈ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
మానవ్వులకు మాతృమూర్తి నిత్యమూ ఆరాధ్యదైవమే అటులనే మాతృమూర్తిద్వారా మనకు లభించిన మాతృభాష కూడా నురంతరమూ ఆరాధించవలసిన దేవత. ఐనప్పటికీ ఒక తిథిని నిర్ణయించి మనలో ఉన్న మాతృభాషాభిమానమును ప్రేరేపించుట జరుగుచున్నందున మనమందరము స్పందించి మాతృ భాషాభిమానమును ద్వుగుణీకృతము చేసుకొని మనవంతు ఋణము తీర్చుకొనవలసియున్నది. 
మనము మాతృభాషలోనే మనవారితో మాటాడుట, మాతృభాషాలిపిలోనే వ్రాయుట, చేయుట మూలమున మాతృభాషను జీవభాషగా మనతో పాటు నిలుపుకొన వచ్చును.
మీ అందరికీ మరొక్క పర్యాయము అభినందనలు తెలుపుచున్నాను.
జైహింద్.

20, ఫిబ్రవరి 2019, బుధవారం

అన్నీ యేత్వాలు గల పద్యం కాశీ పత్యవధానులు గారి రచన

1 comments

జైశ్రీరామ్
అన్నీ యేత్వాలు గల పద్యం   కాశీ పత్యవధానులు గారి రచన
కేలే దే తేతేలే
వే లేవే మెట్లె దేబేవే యెల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చే దేవే మేలే

టీక:- కేలు= హస్తం, యేదే=ఎచ్చటనే, తేతేవే =తెమ్ము తెమ్ము, లే= శీఘ్రముగా
లేవే మెట్లే =లేవలేమి యెట్లనే, దేబేవే = దీనురాలవా, ఏల్చేడెన్= రక్షించు వనితను,
నేలేనే=నేనుండ లేదా, వేరే= వేరుగా, ఎగ్గే లేనే లేదే =కీడు,లేక దోషము లేనే లేదే
ఏడ్చేదేవే=యేడ్చెదవెందుకే, మేలే =శుభమే లే.
ఈ పద్యమంతా ఎత్వాలతో రచింప బడింది.(అచ్చ తెలుగులో)
 జైహింద్.

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

శుద్ధనిరోష్ట్య కందము. శ్రీ కాశీ సత్యవధానులు.

1 comments

జైశ్రీరామ్.
శుద్ధనిరోష్ట్య కందము. శ్రీ కాశీ సత్యవధానులు.  

అలికాంచి తా శ్రాయాశా
ఖల దైత్యానీక నాశ కలితాంత్యాశా
లలితాంత రిక్ష కేశా
సలిల జనయ నేశ యీశ శశి నీకాశా

టీక:---నాలిక= నొసటి యందున, అంచిత= ఒప్పుచుండిన, ఆశ్రయాశా=అగ్నిహోత్రుడు గలవాడా, ఖల= దుర్మార్గులగు,దైత్యానీక =రాక్షస సైన్యముల, నాశ= హతము చేసినవాడా, కలిత=ఒప్పుచున్న, అంత్య= చివరిదియగు
ఆశా =దిక్కు గలవాడా,(ఈశాన్య మూల యనుట)లలిత-మనోజ్ఞమైన,
అంతరిక్ష= ఆకాశమునే, కేశా=వెంట్రుకలుకల వాడా, సలీలజ నయన =కమలాక్షుడగు
విష్ణునకు,ఈశ= ఈశ నామము గలవాడా, శశి= చంద్రుని వంటి, నీకాశా=కాంతి గలవాడా.
ఈ పద్యం పెదవులకు తగలకుండా చదవడానికి వీఎలుగా రచింప బడినది. అందుచేత
దీనిని 'శుద్ధ నిరోష్ట్యం' అంటారు.
జైహింద్.

18, ఫిబ్రవరి 2019, సోమవారం

శ్రీ కందుల వరప్రసాద్ చిత్రకవి వ్రాసిన (ఇకార} గుడికందము

2 comments

జైశ్రీరామ్.
బ్రహ్మ శ్రీ పోకూరి కాశీపత్యవధాని గారి గుడుల పద్య ప్రేరణతో శ్రీ కందుల వరప్రసాద్ చిత్రకవి వ్రాసిన (ఇకార} గుడికందము 

కందము 
తిరిగి తిరిగి దివిని క్షితిని 
సిరిని కినిసి నీలిగించి చిక్కి గిరిని ని
ల్చిరి ప్రీతిని విధి బిగినీ 
విరించి కీరితి నిధి నిడి బిలిబిలి  గ్రీష్మీ! 

అర్థం :- బిలిబిలి  గ్రీష్మీ! = ముద్దు లొలుకు నవ మల్లిక, దివిని క్షితిని = దేవలోకము, భూలోకములలో, తిరిగి తిరిగి= వెదకి, నీలిగించి= తిండి లేక మాడి, సిరిని కినిసి= లక్ష్మీదేవి ని సమీపించి, చిక్కి= కదలలేక, గిరిని నిల్చిరి = కొండపై నిలచి, 
విధి బిగిని = విధి శాపముచే, 
ప్రీతిని= ఇచ్ఛ తో, విరించి= విష్ణువు, కీరితి =  యశస్సు 
నిధి నిడి = స్థానం ఇచ్చెను. 

భావము :- ముద్దు లొలుకు నవ మల్లిక,
లక్ష్మీ దేవి కొరకు దేవలోకము, భూలోకములలో వెదుకు విష్ణువు శుష్కించి , లక్ష్మీదేవిని సమీపించి తిరుమల గిరిపై నిలచి, ఆ కొండకు ఇంతటి పేరుప్రఖ్యాతులు కలుగ జేసెను.
 జైహింద్.

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

అన్నీ గుడులు వుండే చిత్ర కవిత శ్రీకాశీ పత్యవధానులు.

1 comments

జైశ్రీరామ్.
అన్నీ గుడులు వుండే పద్యం శ్రీకాశీ పత్యావధానులు.

కినిసి సిరి దీసి నీలిగి
తిని సిగ్గిడి కింగిరి కిని దిగి తీరితికి గి
త్తిని జీరినించి చిక్కిడి
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ

హరిశ్చంద్రుని పై కోపంతో అతని ఐశ్వర్య మంతా పోయేటట్లు చేశాను. సిగ్గులేక నీచ కార్యానికి (కింగిరిసి) దిగాను.అగ్ని (కిత్తి) వంటి హరిశ్చంద్రుని పిల్చి,నిందించి, ఎన్నో
కష్టాలకు గురి చేశాను. అయినా ఈ రాజు,రాణి (జియ్యా యింతి) కీర్తిని గెల్చుకున్నారు.
అని పైన పేర్కొన్న పద్య భావం. విశ్వామిత్రుడు తనను తాను నిందించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని. అన్నీ గుడులతోనే పద్యం వ్రాయడం ఎంతో
ఔచిత్యవంతంగావుంది.
జైహింద్..

16, ఫిబ్రవరి 2019, శనివారం

తుని పట్టణంలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థ కేఆర్జేశర్మ ఆధ్వర్యవంలో నిర్వహించిన వేటూరి నవమ పురస్కార మహోత్సవము

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తుని పట్టణంలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థ కేఆర్జేశర్మ ఆధ్వర్యవంలో నిర్వహించిన వేటూరి నవమ పురస్కార మహోత్సవమును తిలకించండి.

నిర్వాహకులకు అభినందనలు.
జైహింద్.

15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఆత్మ...........బుద్ధి.

1 comments

జైశ్రీరామ్.
శ్రీమాత్రేనమః
ఆత్మకూ బుద్ధికీ చాలాపోలికవుంది
రెండూ ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనవే. రేండూ స్వచ్ఛమైనవే
( ఆత్మకు అజ్ఞానంలేదు కనుక స్వచ్ఛమైనది బుద్ది ఆఆత్మానుప్రతిఫలించగలదుకనుక ,
ఇదీస్వచ్ఛమైనదే ) రెండూ అవయవాలు లేనివే. అందుచేత ఈ రెండింటికీ చాలాపోలిక వుంది - అని భావించే అవకాశం వుంది.
కానీ భేదం కూడా వుంది.
ఆత్మ శుద్ధ స్వయం ప్రకాశము
బుద్ధికి స్వయం ప్రకాశత్వములేదు. అది స్పటిక శిలలాగా శుద్దమైనది అందుచేత దీని ప్రక్కన స్వయం ప్రకాశకమైన ఆత్మచేరె సరికి యిది తానుగూడా ప్రకాశించడం మొదలుపెడుతుంది.
ఇది గమనించి అజ్ఞులు ఆత్మ బుద్దీ కలిసాయి అనివ్యవహారిస్తుంటారు ఇలాంటి కలయికను అధ్యాసిక సంయోగము అంటారు.
జైహింద్.

14, ఫిబ్రవరి 2019, గురువారం

త్యాగయ్య లఘుచిత్రము.

2 comments

 జైశ్రీరామ్.
ఆర్యులకు జయము.
త్యాగయ్య లఘ్గుచిత్రము భక్తి తత్పరతతో చూడఁదగినది.
జైహింద్.

13, ఫిబ్రవరి 2019, బుధవారం

వేదాశ్రి,రామకా,అభయాశ్రి,సత్వర,సుమనీ,కాంక్షిలు,నాజిక,నిమురక,మరకత,డాంబిక,గర్భ"-అమృతవాణి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
వేదాశ్రి,రామకా,అభయాశ్రి,సత్వర,సుమనీ,కాంక్షిలు,నాజిక,నిమురక,మరకత,డాంబిక,గర్భ"-అమృతవాణి"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

అమృతవాణి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.మ.ర.త.న.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సమ సామాన్యంబు నెంచకం!సర్వంబుందాము గొప్పంచుం!సముచితబుద్ధి లేదాయెన్!                                    
కమనీయంబౌ!హరే డనం?గర్వంబౌనూహ!మేలౌనే?గమిగన నేర వేమయ్యా?
నిమిషంబీదౌనె?కానవే!నేర్వంన్రా మంచి నిద్ధాత్రిం?నిముర కశాంతి దేశానన్?
భములాకాంక్షల్మాను శోభిల్లం?పర్వంబౌ బోధ లాలింపం?ప్రముఖత నందువేవేగన్!
                                                                                             
1.గర్భగత"-వేదాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.స.త.ర.గణములు.వృ.సం.184.ప్రాసగలదు.
సమ సామ్యంబు నెంచకన్?
కమనీయంబౌ?హరేడనన్?
నిమిషం బీ దౌనె?  కానవే!
భము లాకాంక్ష ల్మాను శోభిల్లన్?

2.గర్భగత"-రామకా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.గగ.గణములు.వృ.సం.17.ప్రాసగలదు.
సర్వంబుం దాము గొప్పంచున్?
గర్వంబౌ నూహ మేలౌనే?
నేర్వంన్రా మంచి నిద్ధాత్రిన్!
పర్వంబౌ!బోధ లాలింపన్?

3.గర్భగత"-అభయా"-వృత్తము.
బృహతీఛందము.న.జ.మ.గణములు.వృ.సం.48.ప్రాసగలదు.
సముచిత బుద్ధి లేదాయెన్?
గమి గన నేర వేమయ్యా?
నిముర కశాంతి దేశానన్?
ప్రముఖత నందు వేవేగన్!

4.గర్భగత"-సత్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.ర.మ.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సమ సామాన్యంబు నెంచకం!సర్వంబుం దాము గొప్పంచున్?
కమ నీయం బౌ! హరే డనం?గర్వంబౌ నూహ మేలౌనే?
నిమిషం బీదౌనె? కానవే !  నేర్వం రా ! మంచి ! నిద్ధాత్రిన్!
భము లాకాంక్ష ల్మాను! శోభిలం?పర్వంబౌ! బోధ లాలింపన్?

5.గర్భగత"-సుమనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.త.న.ర.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సముచిత బుద్ధి లేదాయెన్?
గర్వంబౌ! నూహ మేలౌనే? గమి గన నేర వేమయ్యా?
నేర్వం రా! మంచి నిద్ధాత్రిం!నిముర కశాంతి దేశానన్?
పర్వంబౌ! బోధ లాలింపం?ప్రముఖత నందు వేవేగన్!

6.గర్భగత"-కాంక్షిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.త.న.ర.త.య.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబునెంచకన్?                                      
గర్వంబౌ!నూహ,మేలౌనే?గమి గన, నేర, వేమయ్యా ? కమనీయంబౌ!హరేడనన్?                                              
నేర్వం రా! మంచి నిద్ధాత్రిం! నిముర కశాంతి దేశానం?నిమిషంబీదౌనె?కానవే?
పర్వంబౌ!బోధ లాలింపం!ప్రముఖత నందు వేవేగం?భము లాకాంక్ష ల్మానుశోభిలన్?
                                                                                           

7.గర్భగత"-నాజిక"-వృత్తము.
ధృతిఛందము.న.జ.మ.స.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబు నెంచకన్?
గమి గన నేర వేమయ్యా?కమనీయంబౌ!హరే డనన్?
నిముర కశాంతి దేశానం?నిమిషం బీదౌనె?కానవే!
ప్రముఖత నందు వే వేగం?భము లాకాంక్ష ల్మాను శోభిలన్?

8.గర్భగత"-నిమురక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.మ.స.త.ర.మ.ర.గగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబు నెంచకం?సర్వంబుం దాముగొప్పంచున్?                                        
గమి గన నేర వేమయ్యా? కమ నీయంబౌ! హరే డనం? గర్వంబౌ! నూహ మేలౌన్.                                            
నిముర కశాంతి దేశానం?నిమిషంబీదౌనె?కానవే!నేర్వంరా!మంచి నిద్ధాత్రిన్?
ప్రముఖత నందు వేవేగం?భము లాకాంక్షల్మాను!శోభిల్లం!పర్వంబౌ! బోధ లాలింపన్?
                                                                                     
9,గర్భగత"-మరకత"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.త.య.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సమ సామ్యంబు నెంచకన్?
గర్వంబౌ!నూహ మేలౌనే?కమనీయంబౌ! హరే డనన్?
నేర్వం రా!మంచి నిద్ధాత్రిం?నిమిషంబీదౌనె? కానవే!
పర్వంబౌ! బోధ లాలింపం?భము లాకాంక్షల్మాను శోభిల్లన్?

10,గర్భగత"-డాంబిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.త.య.ర.జ.న.ర.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సర్వంబు దాము గొప్పంచుం!సమ సామ్యంబు నెంచకం?సముచిత బుద్ధి లేదాయెన్?                                          
గర్వంబౌ!నూహ మేలౌనే?కమనీయంబౌ!హరే డనం?గమి గన నేర వేమయ్యా?                                                  
నేర్వం రా!మంచి నిద్ధాత్రిం?నిమిషం బీదౌనె? కానవే!నిముర కశాంతిదేశానన్?                                                  
పర్వంబౌ!బోధ లాలింపం?భము లాకాంక్షల్మాను శోభిల్లన్ప్రముఖత నందు వే వేగన్?
                                                                                 
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

రథ సప్తమి సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు రథసప్తమి శుభసందర్భంగా శుభాకాంక్షలు.

శ్రీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజి గారు
మారన కవి కృత మార్కండేయపురాణముననున్న పద్యమును ఉదహరించి
ఈ రథసప్తమీ ప్రాశస్త్యమును చక్కగా వివరించారు. మీరూ గమనింపుడు.

ఆది తెలుగు ఉగాది---మన్వాది--రథసప్తమి


అనుపమ వేగసత్వ సముదంచిత వాహన నాహ్యమానకాం
చన రథచక్ర సంకషణ చారు సుమేరు నగేంద్ర సాను సం
జనిత సువర్ణరేణుచయ సంతత భూషిత దీప్తియైన ఈ
దినమణికిన్ నభోమణి దేవశిరోమణికేను మ్రొక్కెదన్.
    -మారన మహాకవి   మార్కండేయ పురాణం నుంచి

తన రథచక్రం గమనపు రాపిడి వల్ల రేగే మేరునగపు బంగారు రేణువులచే దినదినము దినమణి,నభోమణి,దేవశిరోమణి భూషితుడౌతున్న సూర్యునికి నమస్కరిస్తున్నాడట మారన మహాకవి.ప్రత్యక్ష దైవంగా ప్రపంచం అంతటి చేతా కొలవబడే సూర్యుని జయంతి ఈ రథసప్తమి. మనకు ప్రత్యక్ష సాక్ష్యం కనబరిచే దేవుడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని పుట్టినరోజు మాఘశుద్ద సప్తమి. ఈ సప్తమి ప్రస్తుత వైవస్వత మన్వాదిగా పిలవబడుతోంది.
రథసప్తమి ని పంచాంగ కర్తలు సూర్యజయంతి అంటారు. ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగే పండుగ. దీనిని రాజపుత్రులు సౌర్యసప్తమి గానూ,బెంగాల్ లో భాస్కర సప్తమి అని,కొందరు జయంతి సప్తమి అని,కొందరు మహాసప్తమి అని పిలుస్తారు. తెలుగు వారు మాత్రం రథసప్తమి గా ఈ పండుగను పిలుస్తారు. ఈ మాఘసప్తమి సూర్యసంబంధమైన సప్తమి.ఈశ్వరుడు ఈ రోజున సూర్యుని సృష్టించినట్లు చెబుతారు.అందుకే ఈరోజు సూర్యజయంతి అయ్యింది. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని కూడ అర్థముంది. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయని నమ్మకం.స్త్రీలు చేసే చాల వ్రతాలు ఈనాడే ప్రారంభమవుతాయి..అందుకే పంచాంగ వివరణలో 'నిఖిల వ్రతాని కర్తవ్యాని'అని ఉంటుంది. ఫలతాంబూలం,దంపతి తాంబూలం, మాఘగౌరి,కాటుక గౌరి,సౌభాగ్య తదియ,చిత్రగుప్తుని వ్రతం మొదలైన ఎన్నో వ్రతాలు, నోములు ఈ రథసప్తమి నాడే ప్రారంభమౌతాయి.ఈ వ్రతాలలో చాల వాటికి ఏ విధమైన మంత్రాలు ఉండవు.మామూలు మాటలతో కథ చెప్పుకోవడంతో పూర్తవుతాయి.అనాది కాలంలో ఈ రథసప్తమి తెలుగు వారి ఉగాదిగా ఉండేదని అందువలననే ఈ రథసప్తమి అనేక వ్రతాలకు ఆరంభదినమై ఉండి ఉండాలని,తరువాతి రోజుల్లో రథసప్తమి సంవత్సరాదిగా ఉండటం మారిపోయి ఉంటుందని ప్రముఖ పండితులు టేకుమళ్ళ రాజగోపాలరావు గారు 'సౌత్ ఇండియన్ రీసెర్చ్'అనే పత్రికలో ప్రకటించారు. చతుర్వర్గ చింతామణి ప్రకారం రథసప్తమి నాడు ప్రారంభించే ఎన్నో వ్రతాలు ఉన్నాయి. అవన్నీ సూర్యునికి తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి.ప్రాచీన కాలంలో ఈ రథసప్తమి ఉగాది అయినా కాకపోయినా, మనకు ప్రాచీన పండుగలలో ఇది చాల ముఖ్యమైనది.

ముఖ్యంగా ఆరోగ్యం కోసం జరుపుకునే అపురూపమైన పండుగ ఈ రథసప్తమి.'ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్'అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చెయ్యాలి.

ఈ రథసప్తమి నాడు ఉదయాన్నే లేచి ఏడు జిల్లేడు ఆకులలో రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తారు.కొంచెం ప్రొద్దెక్కి సూర్యుడు ఉదయించిన తరువాత పాలు పొంగిస్తారు.చిక్కుడు కాయలను వెదురు పుల్లలతో చదరంగా చేసి ఆ చిక్కుడు ఆకులలో పొంగలిని పెట్టి సూర్యునికి నివేదన చేసి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ చిక్కుడు కాయల చదరాన్ని 'సూర్యనాథం'అని పిలుస్తారు. ఈ సందర్భంగా చేసే జిల్లేడు ఆకుల స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది.జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక.ఈ ఆకులపైన నునుపు గానూ,క్రింది భాగంలో నూగుతోనూ ఉంటాయి. సంవత్సరం పొడుగునా ఈ జిల్లేడు పుష్పిస్తూనే ఉంటుంది. వీటి ఆకులు తుంచినా,కొమ్మలు వంచినా తెల్లటి పాలు కారతాయి.ఈ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు తగ్గుతుంది. జిల్లేడు చిగుళ్ళ రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. ఈ ఆకులను వెచ్చజేసి ఆముదం రాసి కడుపు పైన రాస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇన్ని రకాలుగా జిల్లేళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. అందుకే ఈ జిల్లేడు ఆకులను శిరస్సు పై ఉంచుకుని స్నానం చేస్తారు. ఏడు ఆకులను తలపై ఉంచుకోవాలి. మనలోని అంతఃశత్రువులైన కామ,క్రోధ,మోహ,మద,మాత్సర్యాలకు,వాటికి లొంగే మన బలహీనతకు ప్రతీకగా ఈ ఏడు ఆకులను చెబుతారు. వీటి విసర్జనకు దీనిని సూచికగా శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ రథసప్తమి కి ఏడు సంఖ్యతో ఎంతో సంబంధం ఉంది.సూర్యుని రథానికి ఏడు అశ్వాలు.సూర్యకిరణాలలో గల ఏడు రంగాలకు అవి చిహ్నాలు. ఈ పర్వం జరిగే రోజు ఏడవ తిధి.ఈ నాడు చేసే చిక్కుడు రథాలు ఏడు. ఈపూజ సూర్యుడ్ని పూజించడానికి ఏర్పడింది. ఈ సూర్యుని స్తుతించే మంత్రాలలో కూడ సూర్యునికి'సప్తలోక ప్రదీపన'అనే బిరుదు ఉ
రథసప్తమి నాడు చేసే స్నానం రెండు విధాలుగా చేయాలని 'భవిష్యోత్తర పురాణం'చెబుతోంది. ముందుగా ఒక లోహపు ప్రమిదలో చమురు పోసి వత్తి వేసి దీపం వెలిగించి దానిని నెత్తిన పెట్టుకొని.....

'నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయేనమః
అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే'

అనే మంత్రం పఠిస్తూ దీపం నీళ్ళమీద తేలేటట్టు మెలకువగా దీపాన్ని నీటిలో వదలాలి.తరువాత రెండవ స్నానంలో చెరకు గడతో నీళ్ళను కలియబెట్టి జిల్లేడు ఆకులు రేగుపళ్ళతో స్నానం చెయ్యాలి.

'ఇతి సప్తవిధం పాపం స్నానాన్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయక్తం హరమాకిరి!సప్తమి!

అనే మంత్రాన్ని పఠించి స్నానం చేసినట్లయితే ఏడు జన్మాంతరాలలో ఆర్జించిన పాపాలన్నీ హరించబడతాయని జనుల విశ్వాసం.
ఈ మాసంలో అంటే మాఘమాసం లో అన్ని ఆదివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి.ఈ ఆదివారాల్లో తప్పనిసరి గా నదీస్నానం చేయాలి. వీటినే మాఘస్నానాలు అని పిలుస్తారు.
'నేను లోకానికంతకూ వెలుగునిచ్చే సూర్యుడ్ని దేవునిగా ఎంచుకోవడానికుంటాను'అన్నాడు నెపోలియన్.దీన్నిబట్టి భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సూర్యారాధన ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు చంద్రభాగా నదీతీరంలో(నేటి చీనాబ్ నది)మిత్రవనం ఏర్పరిచి అందులో ఒక సూర్యాలయం నిర్మించాడని భవిష్యపురాణం చెబుతోంది. పారశీక దేశంలో సూర్యుని విగ్రహ రూపంలో మిత్రపూజ చేసేవారు. ఈ మిత్రపూజలో అనుభవజ్ఞులైన వారిని మగి(తెలివైన వారు)అని పిలుస్తారు. వీరు మిత్రపూజ ఆద్యులై ఆ పూజారుల సంతతి వారు 'మగి'తెగగా రూపొందారు.ఈ మగి ద్విజులు అజర్ బైజాన్ లోని మగి ప్రాంతం నుండి మనదేశానికి తరలి వచ్చారు. బృహత్సంహిత సంధాత అయిన వరాహమిహిరుడు ఈ మగి తెగవాడే!!వీరు సూర్య విగ్రహారాధన చేసేవారు. అంతకుమునుపు మన దేశంలో ప్రత్యక్ష సూర్యపూజ మాత్రమే జరిగేది. ఈ మగి ద్విజుల మూలంగానే మన దేశంలో కూడ సూర్యవిగ్రహారాధన ప్రారంభమయ్యింది. ఒరిస్సా లోని కోణార్క్ దేవాలయం ఈ మగి సంప్రదాయం లోనే కట్టబడింది.మిత్రదేవత రౌతుగా ఇనప కవచంతో ఆ దేవాలయం లో కనబడుతోంది. అక్కడి నుండి ఈ మగి ద్విజులు ఆంధ్రదేశానికి వలస వచ్చారు. ఆంధ్రదేశంలో కూడ అరసవల్లి,ఆకిరిపల్లిలలో ప్రసిద్ధమైన సూర్యదేవాలయాలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడలో కూడ ప్రసిద్ధమైన సూర్యదేవాలయం ఉంది.తమిళనాడు లోని తంజావూరు దగ్గర 'సూర్యనాయర్ కోయిల్'అనే పేరుతో ఒక ఊరు ఉంది.అక్కడ రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తిరుమల లో కూడ రథసప్తమి నాడు ఉదయం నుండి రాత్రి వరకూ ఏడు వాహనాలపైన ఊరేగుతూ దర్శనమిస్తాడు.

భాగవత కథ ప్రకారం ఈ తిధి మన్వాదిగా చెప్పబడింది. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది.వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు ఒక మనువు.మనకు మొత్తం 14మంది మనువులు ఉన్నారు. ఈ మనువుల పరిపాలనా కాలాన్ని మన్వంతరము అని పిలుస్తారు. వీరిలో ఏడవ మనువు వైవస్వతుడు.అతని మన్వంతరం వైవస్వత మన్వంతరం.ప్రస్తుతం జరుగుతున్నది ఈ వైవస్వత మన్వంతరమే!!!

ఈ మన్వంతరానికి రథసప్తమి మొదటి తిధి.అందుకే దీనిని మన్వాదిగా భాగవతం వర్ణించింది.ఇన్నివిధాలుగా రథసప్తమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున కొన్ని నిషేధాలు కూడ ఉన్నాయి. రథసప్తమి నాడు వేదాధ్యయనం మానివేస్తారు.రథసప్తమి నాడు పుస్తకపఠనం కూడ చెయ్యరు.రథసప్తమి నాడు తరిగిన కూరలు తినకూడదు. ఈ మూడు రధసప్తమి నాడు ఆచరించవలసిన విధులు.
ఇంతటి మహాపర్వం రథసప్తమి నాడు స్నానం చేసి.......

'సప్త సప్తివహ!ప్రీత!సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ!గృహాణార్ఘ్యం దివాకర!'

అంటూ ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి అర్ఘ్యమిద్దాం.

-చక్రావధానుల రెడ్డప్ప ధవేజి.

శ్రీమాన్ రెడ్డప్పగారికి ధన్యవాదములు.
జైహింద్.

11, ఫిబ్రవరి 2019, సోమవారం

బృహతీ,కలివర,దోషహారి,వెలచెడు,మనుగడ,వెన్నంటు,వరదూర,వికారిత,సంతాపినీ,ములుకుల గర్భ"-నిరర్ధక"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నదసింహమూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
బృహతీ,కలివర,దోషహారి,వెలచెడు,మనుగడ,వెన్నంటు,వరదూర,వికారిత,సంతాపినీ,ములుకుల గర్భ"-నిరర్ధక"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నదసింహమూర్తి. జుత్తాడ.
                 
"-నిరర్ధక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.స.త.భ.జ.య.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముగలదు.
పలుకే!ములుకై దనరన్!బ్రతుకే!శూన్యంబు గాదె?పరపీడిత వికారంబున్!
వలనౌనె?మనుంగడకున్!ప్రతిమానూనుండు నైన!వరదంబుల్సుదూరంబౌ!
కలనైజమునౌ!బ్రతుకున్!గతి దూరుండౌ!నిజంబు!కర మార్భటియె!నెంచంగన్.                                                  
వెలతగ్గు సుభూషితముల్!వెతలే!వెన్నంటు నెల్ల!వెరవన్సుఖమె?జీవార్తిన్!

1.గర్భగత"-బృహతీ"-వృత్తము.
బృహతీఛందము.స.స.స.గణములు.వృ.సం.220.ప్రాసగలదు.
పలుకే!ములుకై దనరన్?
వలనౌనె?మనుంగడకున్!
కలనైజమునౌ!బ్రతుకున్!
వెల తగ్గు సుభూషితముల్!

2.గర్భగత"-కలివర వృత్తము.
అనుష్టుప్ఛందము.స.త.గల.గణములు.వృ.సం.164.ప్రాసగలదు.
బ్రతుకే!శూన్యంబు గాదె?
ప్రతిమానూనుండు నైన!
గతిదూరుండౌ?నిజంబు!
వెతలే!వెన్నంటు నెల్ల?

3.గర్భగత"-దోషహారి"-వృత్త్తము.
బృహతీఛందము.స.న.మ.గణములు.వృ.సం.60,ప్రాసగలదు.
పరపీడిత వికారంబున్?
వరదంబులు సుదూరంబౌ!
కర మార్భటియె?నెంచంగన్!
వెరవన్సుఖమె?జీవార్తిన్!

4.గర్భగత"-వెలచెడు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.స.స.త.గల.గణములు.యతి.10,వ యక్షరము.
ప్రాసనియమముగలదు.
పలుకే!ములుకై దనరన్?బ్రతుకే?శూన్యంబు గాదె!
వలనౌనె?మనుంగడకున్!ప్రతిమా నూనుండు నైన!
కల నైజమునౌ?బ్రతుకున్!గతి దూరుండౌ! నిజంబు!
వెల తగ్గు సుభూషితముల్! వెతలే!వెన్నంటు నెల్ల?

5.గర్భగత"-మనుగడ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.భ.జ.య.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
బ్రతుకే!శూన్యంబు గాదె?పరపీడిత వికారంబున్?
ప్రతిమా నూనుండు నైన!వరదంబుల్సుదూరంబౌ?
గతిదూరుండౌ?నిజంబు!కర మార్భటియె?నెంచంగన్!
వెతలే!వెన్నంటు నెల్ల?వెరవన్సుఖమె? జీవార్తిన్!

6.గర్భగత"-వెన్నంటు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.భ.జ.య.త.జ.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముగలదు.
బ్రతుకే!శూన్యంబుగాదె?పరపీడిత వికారంబున్?పలుకే!ములుకై దనరన్?
ప్రతిమా నూనుండు నైన!వరదంబుల్సుదూరంబౌ?వలనౌనె?మనుంగడకున్!
గతి దూరుండౌ?నిజంబు!కరమార్భటియె?నెంచంగన్!కలనైజమునౌ?నెంచంగన్!                                                
వెతలే!వెన్నంటు నెల్ల?వెరవన్సుఖమె?జీవార్తిన్!వెల తగ్గు సుభూషితముల్!

7.గర్భగత"వరదదూర"-వృత్తము.
ధృతిఛందము.స.స.మ.స.స.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
పర పీడిత వికారుబున్?పలుకే!ములుకై దనరన్?
వరదంబుల్సుదూరంబౌ?వలనౌనె?మనుంగడకున్!
కర మార్భటియె?నెంచంగన్!కల నైజము నౌ?బ్రతుకున్!
వెరవన్సుఖమె? జీవార్తిన్!వెల తగ్గు సు భూషితంబుల్!

8.గర్భగత"-వికారిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.మ.స.స.స.స.త.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముగలదు.
పర పీడిత వికారంబున్?పలుకే!ములుకై దనరన్?బ్రతుకే!శూన్యంబు గాదె?
వరదంబుల్సుదూరంబౌ?వలనౌనె?మనుంగడకున్!ప్రతిమా నూనుండు నైన?
కర మార్భటియె?నెంచంగన్!కల నైజమునౌ?బ్రతుకున్!గతిదూరుండౌ?నిజంబు!                                                   వెరవన్సుఖమె?జీవార్తిన్!వెల తగ్గును భూషితంబుల్!వెతలే!వెన్నంటు నెల్ల?

9.గర్భగత"-సంతాపినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.భ.జ.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
బ్రతుకే!శూన్యంబుగాదె?పలుకే!ములుకై దనరన్?
ప్రతిమా నూనుండునైన?వలనౌనె?మనుగడకున్!
గతి దూరుండౌ?నిజంబు!కలనైజమునౌ?బ్రతుకున్!
వెతలే!వెన్నంటు నెల్ల?వెల తగ్గును భూషితంబుల్!

10,గర్భగత"-ములుకుల "-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.భ.జ.జ.జ.జ.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముగలదు.
బ్రతుకే!శూన్యంబు గాదె?పలుకే!ములుకై దనరన్?పర పీడిత వికారంబున్?
ప్రతిమా నూనుండు నైన?వలనౌనె?మనుగడకున్!వరదంబుల్సుదూరంబౌ?
గతిదూరుండౌ?నిజంబు!కల నైజమునౌ?బ్రతుకున్!కర మార్భటియె?నెంచంగన్!
వెతలే!వెన్నంటు నెల్ల?వెల తగ్గును భూషితంబుల్!వెరవన్సుఖమె?జీవార్తిన్!

స్వస్తి
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

శ్రీపంచమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ రాయబారము. శ్రీ గుమ్మడి గోపల కృష్ణ. దీక్షితులు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీపంచమి సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు.

జైహింద్.

9, ఫిబ్రవరి 2019, శనివారం

పద్య సౌరభం. శ్రీ రాపోలు వేంకటేశం. . . . వికారాబాద్.

1 comments

జైశ్రీరామ్
ఆర్యులారా! శ్రీ రాపోలు వేంకటేశం గారి పద్య సౌరభాన్ని ఆఘ్రాణించండి.
జైహింద్.

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కావ్యకంఠ గణపతి ముని (1878-1936)వివరణ. శ్రీ కొప్పరపు మా. శర్మ.

2 comments

జైశ్రీరామ్.
*కావ్యకంఠ గణపతి ముని* (1878-1936)

అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.

ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.

శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం – దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.

ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.

అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది. బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:

సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః

అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు. అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే:
గణపతి రితి కవికులపతిరతి దక్షో దాక్షిణాత్యోహం
ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా కవికులపతి అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా – భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, నేను ఔరస పుత్రుడిని) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడుకూడా. సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు. ఆ నాలుగు సమస్యలు:
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి (కింత్యనవద్యచరితా)
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా)
పిపీలికా చుంబతి చంద్రమండలమ్
ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు. ఆ పూరణలేమిటంటే:

హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి
(భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తనమామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం. ఇక్కడ, ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు – మెదటిది ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు)
చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయా
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
(భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూడవలసి వస్తుందేమోననే శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు)
రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయే
కళత్ర భావే చ ధరా తనూజః
లగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్
సూర్య శశాంకేన సమం వినష్టః
(పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు – లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును)
సతీ వియోగేన విషణ్ణ చేతసః
ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్ర మండలమ్
(దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను)
కావ్యకంఠ గణపతి ముని
యువ గణపతి ముని
దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే. ఇక వ్యాఖ్యాన పటిమని పరీక్షించాలి. ఇందుకోసం అంబికాదత్తుడు, రఘువంశంలోంచి ఒక శ్లోకము, కావ్య ప్రకాశమనే గ్రంథంలోంచి మరొక శ్లోకము ఇచ్చి – వీటిపై గణపతిని వ్యాఖ్యానించమన్నాడు. అనర్గళంగా, సుమారుగా ఒక గంటసేపు, ఈ రెండు శ్లోకాలపై తన కవిత్వ పటుత్వాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, యుక్తిని, విమర్శనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ, సభాసదులందర్నీ మంత్రముగ్ధులని కావిస్తూ గణపతి ప్రసంగం కొనసాగుతోంది – ఇంతలో, ఒకచోట – సర్వాసాం అనుటకు బదులు సర్వేషాం అని గణపతి వాణి తొట్రుబడింది. తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న అంబికా దత్తుడు – వెంటనే ‘విరామాతావత్‘ అన హూంకరించి:

అనవద్యే నను పద్యే గద్యే హృద్యేపి తే స్ఖలతి వాణీ
తత్కింత్రిభువన సారా తారా నారాధితా భవతా

నిర్దుష్టమగు పద్యములో మనోహరమగు వచనమందు నీ వాణి స్ఖలించెను. నీవు త్రిభువన శ్రేష్టురాలగు సరస్వతినారాధించలేదా? అంటూ ఆక్షేపించాడు. స్త్రీలింగ శబ్దం వాడాల్సిన చోట పుల్లింగం వాడేడని ఇందులో చమత్కారం.సుమారొక గంటసేపు గంగాప్రవాహంలా పరవళ్ళు తొక్కుతూ, రసికజన హృదయాలని రసపూరితమొనర్చిన వాణి, అంత సేపు నిర్దోషంగా ఉన్నందుకు అభినందించడానికి పోయి, ఆక్షేపించిన అంబికాదత్తుడు కూడా పాపం పప్పులో కాలేసాడు. సారస్తారా అని పుల్లింగ శబ్దాన్ని ప్రయోగించడానికి బదులు, సారాతారా అంటూ ప్రాసకోసం పాకులాడేడు. గణపతి వెంటనే ఈ దోషాన్ని సభాసదులకెత్తి చూపి:

సుధాం హసంతీ మధు చాక్షిపంతీ
యశోహరంతీ దయితాధరస్య
న తే ల మాస్యం కవితా కరోతి
నోపాస్యతే కిం దయితార్ధ దేహః

(అమృతమును పరిహసించునట్టి, మధువునాక్షేపించునట్టి, ప్రియురాలి యధరోష్ఠ కీర్తిని హరించునట్టి కవిత్వము నీ ముఖమునలంకరించ లేదెందువలన? నీవు కాంతార్ధ విగ్రహుడగు నీశ్వరు నుపాసించలేదా?)ఈ ఆక్షేపణతో అంబికాదత్తుడు పరాభవాన్ని తట్టుకోలేక గణపతిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ వ్యక్తిగత సంవాదం ఆరంభమైంది. ఇద్దరూ తమ తమ ఆశుకవితా శక్తినే కొరడాలుగా మలచి ఒకరినొకరు చావబాదుకోవడం మొదలెట్టారు.

అంబి:
జ్యోతిరింగణ న కిం ను మన్యసే
యత్త్వమేవ తిమిరేషు లక్షసే
(ఓ మిణుగురు పురుగా, నీవు చీకటిలోనే కాని వెలుతురులో ప్రకాశించవు – అంటే, ఎదుటి వాళ్ళ దోషాలు ఎత్తి చూపించటమే నీ ప్రతిభ అని శ్లేష)

దీనికి దీటుగా గణపతి:
కిం ను దీప భవనే విభాససే
వాయునా బహిరహో విధూయసే

(ఓ దీపమా, నీవు గృహములోపలనే ప్రకాశించగలవు, వెలుపలకు వచ్చినచో గాలిచే కదల్పబడుదువు – అనగా సభలలో నీ పాండిత్యము నిలువ జాలదని పరిహాసం)

అంబికాదత్తుడు:
ఉచ్చైః కుంజర మాకార్షీః బృంహితాని మదోద్ధత
కుంభికుంభామిషాహారీ శేతే సంప్రతి కేసరీ

(ఓ కుంజరమా, మదముచే గర్వించి బృంహిత ధ్వనులను చేయుచుంటివి. ఏనుగుల కుంభస్థలములందుండు మాంసమును హరించు సింహమిచ్చటనే కలదు సుమా)

గణపతి:
మరల దోషమే. కర్మధారయ సమాసముపై హరీ యను మత్వర్ధీయము చెల్లదు. కుంభికుంభామిషాహారః అని బహువ్రీహి సమాసమును మాని ప్రాసకొరకే పాకులాడుతూ దోష ప్రదర్శన చేసుకొనుచున్నావు.
సమాసీనో రసాలే చేత్ మౌనమావహ మౌకలే
లోకః కరోతు సత్కారం మత్వాత్వా మపి కోకిలం
(ఓ కాకమా, నీవు మామిడి చెట్టు నెక్కి కూర్చుండ దలచితివేని మౌనముగా నుండుట మంచిది. లోకులు నిన్నుకూడా కోకిల అనుకొని సత్కరించుదురు)

ఇంతటితో ఊరుకోకుండా, గణపతి మరొక పరిహాసం కూడా అంబికాదత్తుడిపై ప్రయోగించాడు:
అపుష్పా చూత లతికా విపన్నా సా సరోజినీ
హేమంతే హంత రోలంబ నిరాలంబః క్వమోదసే
(మామిడి గున్న పుష్పించలేదు – శిశిర ఋతుకాలము రానందువల్ల, తామర పుష్పము నశించెను – హేమంత ఋతువైనందున, అక్కటా – తుమ్మెదా – హేమంత కాలమంతయూ నాశ్రయము లేనిదానివై నీవెక్కడ సంతోషింప గల్గుదువు?)
గణపతికి అంబికాదత్తుడెవరో, అతని వ్యక్తిగత జీవితమేమిటో అస్సలు తెలియదు. కాని, అంబికాదత్తుడి మొదటి భార్య సరోజిని చనిపోగా, అతను రెండో పెళ్ళి చేసుకొన్నాడు, కాని ఆవిడ అప్పటికింకా పుష్పవతి కానందువల్ల, సంసార సుఖానికి నోచుకోలేదు. ఈ విషయం, తెలియకుండానే ధ్వనింప చేసిన గణపతి సిద్ధకవి అని గ్రహించి, అంబికాదత్తుడు, వాదం చాలించి, గణపతిని ఒక ఆసనముపై కూర్చుండబెట్టి, మొహం చిన్నపుచ్చుకొని మౌనంగా ఉండిపోయాట్ట.
ఇది కనిపెట్టిన శితికంఠ వాచస్పతి – మీరిద్దరూ సంసారవిషయములను, వ్యక్తిగత దూషణలను విడిచిపెట్టి, గౌడ దాక్షిణాత్యులగుటచే, పరస్పరాంతర్జాతి పరముగా పరిహసించుకొని, సాహిత్య వృత్తాంతములచే వాదముపసంహరించండి అని ఇద్దరినీ ఆజ్ఞాపించాడు.

వెంటనే – అంబికాదత్తుడు:
భటోఖిలోట్టో పరివారవధ్వానిపీయ మధ్వారభతే విహారం
(భట్టులందరు – అనగా దక్షిణాత్యులు – మేడలపై వేశ్యలతోగూడి మద్యపానమును చేసి విహరింతురు)
గణపతి:

అసువ్యయో వాస్తువ్యయో వాప్య మీ న మీన వ్యసనం త్యజంతి
(ప్రాణము పోయిననూ సరే, డబ్బుపోయిననూ సరే మీ మీన వ్యసనమును మాత్రము విడువరు) గణపతి ఇలా శ్లోకం పూరించగానే, ఆనందం పట్టలేక అంబికాదత్తుడు ఆసనం మీంచి లేచివచ్చి గణపతిని కౌగలించుకొని, అతని నిరర్గళ కవితాపటుత్వానికి మెచ్చుకొని సంతోషం వెలిబుచ్చాడు. గణపతి – తాను వాదధోరణియందు చూపిన దూషణాపరాధమును మన్నించమని సవినయంగా వేడుకొన్నాడు. దానికి అంబికాదత్తుడు నవ్వుతూ – నీ మీనద్వయమే నీ అపరాధాన్ని తుడిచిపెట్టిందని పరిహసించాడు (మీనద్వయమనగా అ+మీన+మీన అని రెండు మీనములను బహూకరించుట. నిజానికీ పద విభాగం అమీ+న+మీన.. అనుంటుంది)
అప్పుడు మిగిలిన పరీక్షావర్గం వారు, గణపతినింకా పరీక్షించగోరి, భారతమందు పదునెనిమిది పర్వముల సారమునూ పర్వమునొక్కొక్క శ్లోకము చొప్పున 18 శ్లోకములను చే, అపి, హి, తు, చ అను పదములను ప్రయోగించకుండా చెప్పమని అడిగారు. అడిగిన వెంటనే, ఆశువుగా గణపతి పదునెనిమిది శ్లోకములతో భారతకథా సారమంతా మనోహరంగా చెప్పి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేడు.

నవద్వీపచరిత్రలో ఒక ఆంధ్రుడు గెలుపొందడం ఆకాలంలో అదే మొదటిసారి. పరీక్షావర్గం గణపతికి ‘కావ్యకంఠ’ అనే బిరుదుతో పాటుగా ఒక శ్లోకం బహుమానంగా ఇచ్చి సత్కరించారు.

ప్రాచీనై స్తైః కవికులవరైః కాళిదాసాదిభిర్యా
లబ్ధా కీర్తి దను గతా సైవ భూయ దిదానాం
సద్భిర్దత్తోయ ఇహ రుచిరః కావ్యకంఠోపహారః
తేవ శ్రీమానిహ భువి భవానుజ్జ్వల శ్చాపి భూయాత్
(ప్రాచీనులగు కాళిదాసాది కవివర్యులెట్టి కీర్తిని పొందిరో, వారి ననుసరించిన నీచే నట్టి కీర్తి యిప్పుడు పొందబడెను. ఇక్కడ సత్పురుషులచే మనోహరమగు కావ్యకంఠ బిరుదమేది యొసగబడెనో, ఆ బిరుదమువలన నీవీ భూలోకమందు శ్రీమంతుడవై ప్రకాశింతువు గాక !)అప్పటినుండి, గణపతి శాస్త్రి కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధి కెక్కారు. ఈయన రమణమహర్షి అంతేవాసులలో అగ్రగణ్యుడు. సుమారు వందకు పైగా, సంస్కృత రచనలు చేసారు గణపతిముని స్పృశించని అంశమంటూ లేదు — వేదాంతసారం, యోగం, తంత్రశాస్త్రం, మీమాంస, జ్యోతిష్యం, ఆయుర్వేదం, విమర్శ, ఛందోదర్శనం – లాటి ఎన్నో విషయాలపై గణపతిముని రచనలు – పండితుల ప్రశంసలందుకొన్నాయి. తత్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని కపాళిశాస్త్రిలాటి పండితులభిప్రాయ పడ్డారు.
సద్దర్శనం, రమణగీత, ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమా శతకం, దశమహావిద్యలు వంటి వేదాంత, తాంత్రిక గ్రంధాలు, విశ్వమీమాంస, తత్వఘంటాశతకం, భారత చరిత్ర పరీక్ష వంటి విమర్శనాత్మక గ్రంథాలు, అంబికాగీతం, యోగసార గీతం, గురుగీతం, రేణుకాగీతం, గణపతిగీతం వంటి స్తోత్ర సాహిత్యం, సంస్కృతంలో *పూర్ణ* అనే ఆంధ్రవిష్ణువుకాలం నాటి చారిత్రాత్మక నవల ఇలా గణపతిముని సాహిత్య సృష్టి అపారం. అంతే కాకుండా, గణపతిముని భారతదేశ స్వాతంత్రపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు, అస్పృశ్యతా నివారణోద్యమాల్లో కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

బొబ్బిలి దగ్గర కలవరాయి అనే అగ్రహారంలో 1878 సంవత్సరం కార్తీక బహుళ అష్టమి నాడు జన్మించిన గణపతిముని 58 సంవత్సరాలు మాత్రమే జీవించి, 1936 లో ఖరగ్‌పూరులో పరమపదించారు.
వివరణ. శ్రీ కొప్పరపు మా. శర్మ 
గారికి అభినందన పూర్వక 
ధన్యవాదములు.
జైహింద్.

7, ఫిబ్రవరి 2019, గురువారం

మహిరావణ కన్నడ హరికథ. కథకులు. శ్రీ ఆర్.గురురాజులునాయుఁడు. .

1 comments

జైశ్రీరామ్
మహిరావణ కన్నడ హరికథ.
కథకులు. శ్రీ ఆర్.గురురాజులునాయుఁడు. .

జైహింద్ .

6, ఫిబ్రవరి 2019, బుధవారం

మల్లికార్జున పండితుడు పాల్కురికి సోమన్న శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో అక్షరాంక గద్యలో చేసిన స్తుతి.

1 comments

జైశ్రీరామ్.
మల్లికార్జున పండితుడు పాల్కురికి సోమన్న శ్రీశైల మల్లన్నను
అచ్చులు, హల్లులతో అక్షరాంక గద్యలో చేసిన స్తుతి.

ఖిల లోకాధార
నంద పూర
న చంద్ర శిఖి నేత్ర
డితామల గాత్ర
రు లింగ నిజరూప
ర్జితా జలచాప
లిత తాండవకాండ
నికృతా జాండ
కైక వర్యేశ
క్య సౌఖ్యా వేశ
ఓం కార దివ్యాంగ
న్నత్య గుణ సంగ
అంబికా హృదయేశ
అఃస్తోక కలనాశ
నద హీనాభరణ
ల జలంధర హరణ
ల నాయక విధేయ
న భక్తి విజేయ
శ్చూల కాలధర
రిత త్రిశూల ధర
ర్మ యాధ్వస్త
న గుణ ధళ ధీర
త్రయాది విదూర
ప్రభావాకార
మరుకాది విహార
వ్రాత పరిహార
ప్రవాగార
త్త్వ జోనేత
వి దూర జవ పక్ష
వన పాలన దీక్ష
రణీ థవోల్లీడ
నంది కేశారూఢ
ర్వతీశ్వర లింగ
హుళ భూత విలాస
క్త్వ హృద్వ నహన
మంత్రస్తుతోధార
క్ష రుద్రాకార
తిరాజ బిన హంస
లిత గంగోత్తంస
మా విదవ్రంశ
రద శైల విహార
ర సంభ వాస్ఫార
ట్తింశ తత్త్వగత
కల సురముని వినుత
రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
క్షర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.
జైహింద్.

5, ఫిబ్రవరి 2019, మంగళవారం

దేవతలలో కొందరి వాహనములు

1 comments

జైశ్రీరామ్.
దేవతలలో కొందరి వాహనములు
ఇంద్రుఁడు --- ఐరావతము
వాయుదేవుడు --- లేడి
శివుఁడు ----- వృషభము
సూర్యుఁడు --- 7 గుర్రాల రధం
శని ----- కాకి
లక్ష్మి దేవి ---- గుడ్లగూబ
రతీ మన్మదులు ---- చిలుక
బ్రహ్మ సరస్వతి ----- హంస
పార్వతీ దేవి ---- సింహం
దుర్గా దేవి -- పెద్ద పులి
హనుమంతుఁడు --- ఒంటె
కుమారస్వామి --- నెమలి
విఘ్నేశ్వరుఁడు --- ఎలుక
విష్ణుమూర్తి --- గరుడుఁడు
కుబేరుఁడు --- నరుఁడు
చంద్రుఁడు --- 10 గుర్రాల తెల్ల రధం
గంగాదేవి --- మొసలి
యమునాదేవి --- తాబేలు
జైహింద్.

4, ఫిబ్రవరి 2019, సోమవారం

నాసికా సాముద్రిక. శతావధాని సి.వి.సుబ్బన్న గారు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శతావధాని సి.వి. సుబ్బన్న గారు అమ్మాయిల నాసికా సాముద్రికాన్ని ఇలా చెప్పారు. 
దీనికి సంబంధించి శాస్త్రప్రామాణికత చూపఁ గలిగినవారున్న ఇది ఒక అనుభవోక్తి మాత్రమే అని చెప్పకుండా నమ్మదగినదే ఆనుకొనవచ్చును.
సీ. నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు.
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
తే.గీ. ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.
భావము.
పొడుగైన ముక్కున్న అమ్మాయి తను కోరుకున్న వాడిని పొందుతుంది. వట్రువు అంటే గుండ్రని ముక్కు ఉంటే వ్యవహారాలు బాగా చక్కబెడతారు. చిలుక ముక్కు ఉన్న అమ్మాయి సుఖ సౌఖ్యాలను పొందుతుంది.చప్పిడి ముక్కున్న అమ్మాయి హాస్య స్వభావంతో అందరితో స్నేహంగా ఉంటుంది.
సౌభాగ్యవతి అయిన స్త్రీ ముక్కు, సంపెంగ పువ్వులా ఉంటుందట. అలాగని శస్త్ర చికిత్స చేయించుకొని తాము కోరుకొను విధముగా ముక్కు రూపము మార్పించుకుంటే చూడడానికి బాగుంటుందేమో గాని ఫలితాలు మారవు.
రసజ్ఙభారతి సౌజన్యంతో.
జైహింద్.

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

భ్రమక,సమాశ్రీ,మత్తరజనీ,పంతులేని,యతిర్నవసుగంధి,మేనిఛాయ,గర్భగత,భ్రష్టఖ్యాతి,శ్రీరమ్య,నిగ్గుతగ్గు,గర్భ"-గుణావరీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తా

1 comments

జైశ్రీరామ్.
భ్రమక,సమాశ్రీ,మత్తరజనీ,పంతులేని,యతిర్నవసుగంధి,మేనిఛాయ,గర్భగత,భ్రష్టఖ్యాతి,శ్రీరమ్య,నిగ్గుతగ్గు,గర్భ"-గుణావరీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
గుణావరీ
ఉత్కృతిఛందము. ర.న.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముగలదు.
మూడుకాళ్ళ ముసలి జీవి!ముద్దు మోము నిగ్గుతముష్టష్టిఘాత మందజేయుచున్?                                            
పాడువడ్డ నొడలుగాంచి!పద్దులేని వాడనంగ!భ్రష్టు పట్ట ఖ్యాతి జేతురే?
చీడ వీడు మనకటంచు!సిద్ద చేత పట్టమంచు!శిష్టులట్ల భ్రాంతి నేర్తురే?
పాడు బుద్ధి నడతురేల?వద్దుమాకు వీడనంగ!పౌష్టికంపు తిండి పెట్టకన్?

1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.ప్రాసగలదు.
మూడుకాళ్ళ ముసలి జీవి!
పాడువడ్డ నొడలు గాంచి!
చీడవీడు మనకటంచు!
పాడు బుద్ధి నడతు రేల?

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ముద్దుమోము నిగ్గు తగ్గె!
పద్దు లేని  వాడనంగ?
సిద్ద చేత పట్టమంచు!
వద్దు మాకు వీడనంగ!

3.గర్భగత"-మత్తరజనీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ముష్టిఘాత మందజేయుచున్?
భ్ర ష్టు పట్ట ఖ్యాతి  జేతురే?
శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?
పౌష్టికంపు తిండి పెట్టకన్?

4.గర్భగత"-పంతులేని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
మూడుకాళ్ళ ముసలి జీవి! ముద్దుమోము  నిగ్గు తగ్గె!
పాడువడ్డ నొడలు గాంచి!పద్దులేని వాడనంగ!
చీడ వీడు మనకటంచు!సిద్ద బేత పట్ట మంచు!
పాడు బుద్ధి నడతురేల?వద్దుమాకు వీడనంగ?

5.గర్భగత"యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
ముద్దుమోము నిగ్గు తగ్గె!ముష్టి ఘాత మందజేయుచున్?
పద్దు లేని వాడ నంగ? భ్రష్టు పట్ట ఖ్యాతి జేతురే?
సిద్ద చేత పట్టమంచు!శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?
వద్దుమాకు వీ డనంగ?పౌష్టికంపు తిండి పెట్టకన్?

6.గర్భగత"-మేనిఛాయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.న.గల.గణములు.
యతులు.9,18. ప్రాసనియమముగలదు.
ముద్దుమోము నిగ్గు తగ్గె!ముష్టి ఘాత మంద జేయుచున్న్మూడుకాళ్ళ ముసలి జీవి!                                          
పద్దులేని వాడనంగ?భ్రష్టు పట్ట ఖ్యాతి జేతురే?పాడు వడ్డ నొడలుగాంచి!                                                              
సిద్ద చేత పట్టమంచు!శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?చీడ వీడు మన కటంచు?                                                              
వద్దు మాకు వీడనంగ?పౌష్టికంపు తిండి పెట్టకన్?పాడు బుద్ధినడతురేల?
                                                                         

7.గర్భగత"-గర్భగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
ముష్టిఘాత మంద జేయుచున్?!మూడుకాళ్ళ ముసలి జీవి!
పట్టి ఖ్యాతి భగ్న మేర్తురే?పాడు వడ్డ నొడలు గాంచి!
శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?చీడ వీడు మన కటంచు!
పౌష్టికంపు తిండి పెట్టకన్!పాడు బుద్ధి నడుతు రేల?

8.గర్భగత"-భ్రష్టఖ్యాతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.ర.జ.గల.గణములు.
యతులు.10,19.ప్రాసనియమముగలదు.
ముష్టి ఘాత మందజేయుచున్?మూడుకాళ్ళ ముసలి జీవి!ముద్దుమోము నిగ్గు తగ్గె?                                                                                    
పట్టి ఖ్యాతి భగ్నమేర్తురే,పాడువడ్డ నొడలుగాంచి!పద్దులేని వాడనంగ?
శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?చీడవీడు మనకటంచు!సిద్ద చేతపట్టమంచు!
పౌష్టికంపు తిండి పెట్టకన్?పాడుబుద్ధి నడుతురేల?వద్దుమాకు వీడనంగ?

9.గర్భగత"-శ్రీరమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.న.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
ముద్దుమోము నిగ్గుతగ్గె!మూడుకాళ్ళ ముసలి జీవి!
పద్దులేనివా డనంగ?పాడుపడ్డ నొడలు గాంచి
సిద్ద చేత పట్టమంచు!చీడ వీడు మనకటంచు?
వద్దు మాకు వీడనంగ?పాడు బుద్ధి నడుతురేల?

10,గర్భగత"-నిగ్గుతగ్గు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జర.జ.న.ర.జ.మ.లగ.గణములు.
యతులు.9,18.ప్రాసనియమముగలదు.
ముద్దమోము నిగ్గు తగ్గె!మూడుకాళ్ళ ముసలి జీవి!ముష్టిఘాత మంద జేయుచున్?
                                                                             
పద్దులేని వాడనంగ?పాడుపడ్డ నొడలుగాంచి!పట్టి ఖ్యాతి భగ్నమేర్తురే?
సిద్ద చేతపట్టమంచు!చీడవీడు మనకటంచు?శిష్టు లట్ల భ్రాంతి నేర్తురే?
వద్దుమాకు వీడనంగ?పాడుబుద్ధి నడతురేల?పౌష్టికంపు తిండి పెట్టకన్?ఇట్ట్లు,
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

2, ఫిబ్రవరి 2019, శనివారం

చరణశృఙ్గరహిత-నటరాజస్తోత్రమ్ ... (పతఞ్జలి)

1 comments

జైశ్రీరామ్.
పతంజలి యోగశాస్త్రమును రచించిన మహాముని. అతనికి ఒకనాడు పరమేశ్వరుని సందర్శించవలెనని అభిలాష కలిగినది. కైలాస ద్వారమునకు వెళ్ళెను.నంది పతంజలికి శివుని దర్శనమునకు అనుమతి నీయలేదు. పతంజలి అప్పుడు ఆశువుగా ఈశ్వరుని రూపమైన నటరాజును ఉద్దేశించి కొన్ని పద్యములను చదివెను. మొత్తము పది పద్యములు ఉన్నవి. ఇది విన్న శివునికి సంతృప్తి గలిగి పతంజలికి దర్శనము నిచ్చెను.
నటరాజస్తోత్ర ,చరణ శృఙ్గ రహిత (పతఞ్జలి) ॥
This hymn is by Sage Patanjali, the author and compiler of the famous
yogasUtra . Once upon a time, as the story of the origin of
the hymn goes, Nandi, Shiva's carrier would not allow Patanjali Muni to have
Darshan of the Lord Shiva (Nataraja of Chidambaram).  In order to reach Lord
Shiva, Patanjali, with his mastery over grammatical forms,
spontaneously composed this prayer in praise of the
Lord without using any extended (`dIrgham') syllable,
(without `charaNa' and `shRi~Nga' i.e . leg and horn) to tease Nandi.
Shiva was quickly pleased, gave Darshan to the  devotee, and danced to the
lilting tune of this song .
The place where this incidence is said to have happened is
Chidambaram (also known as Thillai), located about a  hundred miles
from Madras, Tamilnadu, India . It is considered to be  one of the
holiest places in India . In this temple, which has a gold covered roof,
Lord Nataraja is present in a cosmic-dancing form . Many books have been
written on the greatness of the temple and its deity and can also be inferred
from various hymns composed in praise of the Lord by the Shaiva
Siddhanta Saints.
Please refer to http://www.geocities.com/Athens/2583
for more information and detailed description of Shaiva Siddhanta.
The translation of the hymn is based on Smt . Usha Bhise's and is taken from
the book `caranasrngarahitam natarajastotram.' This book also contains a sanskrit
commentary on this stotra by Chandrakala . The book was published by Bharati
Samskrta Vidya Niketanam in 1992-
                 ॥ అథ-చరణశృఙ్గరహిత-నటరాజస్తోత్రమ్ ॥

శంభునటన వృత్తము. ఇది చిత్రకవిత్వపు కోవకు చెందినది.
ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు లేవు. 
అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను కలిగిస్తాయి. 
ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. దీనిని 
చరణశృంగరహిత నటరాజ స్తోత్రము అని పిలుతురు.. 
అనగా కాలు కొమ్ము లేని నటరాజ స్తోత్రము అని అర్థము. 
కాళ్లతో నడిచే కొమ్ములుండే జంతువు వృషభము గదా! 
అనగా 
పతంజలి నందిని అవహేళన చేస్తూ ఈ స్తోత్రమును రచించినాడు. 
ఈ వృత్తపు ఛందస్సును పరిశీలిస్తే, ఇందులో ఆఱు జ-ల (IUII) గణములు, చివర ఒక లగము ఉన్నాయి. అనగా ప్రతి పాదములో 26 అక్షరములు. ఇది ఉత్కృతి ఛందములోని 31317470వ వృత్తము.
సదఞ్చిత ముదఞ్చిత నికుఞ్చిత పదం ఝలఝలఞ్చలిత మఞ్జు కటకమ్
పతఞ్జలి దృగఞ్జన మనఞ్జన మచఞ్చలపదం జనన భఞ్జన కరమ్ ।
కదమ్బరుచిమమ్బరవసం పరమమ్బుద కదమ్బ కవిడమ్బక కగలమ్
చిదమ్బుధి మణిం బుధ హృదమ్బుజ రవిం పర చిదమ్బర నటం హృది భజ ॥ ౧॥
Heartily resort to the great dancer Shiva, residing in the holy place,
Chidambaram . He is called Hara (the destroyer) who smashed the three cities
(of demon tripura). He is worshipped by good people . While dancing he has
lifted one foot which is bent . His lovely bracelets are set in motion of
dance movements and hence are making a jingling sound . He is like
ointment to the eyes of Patanjali by whose application the vision gets
clear for receiving knowledge . However, he is free from contamination of
any kind . He destroys the cycle of birth (and death). He possesses the
loveliness of Kadamba tree; wears the sky as garment . His throat is dark
like the multitude of rainy clouds . He is the jewel in the ocean of
consciousness . He is the the Sun blossoming  the lotus- heart
of wise persons.

హరం త్రిపుర భఞ్జనం అనన్తకృతకఙ్కణం అఖణ్డదయ మన్తరహితం
విరిఞ్చిసురసంహతిపురన్ధర విచిన్తితపదం తరుణచన్ద్రమకుటమ్ ।
పరం పద విఖణ్డితయమం భసిత మణ్డితతనుం మదనవఞ్చన పరం
చిరన్తనమముం ప్రణవసఞ్చితనిధిం పర చిదమ్బర నటం హృది భజ ॥ ౨॥
Heartily resort to the great dancer, Shiva, residing in the holy
place, Chidambaram . He is the destroyer of the world, who destroys sin and
grants emancipation . He has destroyed the three cities of demon tripura,
representing the three types of sorrows . He is wearing the great serpent,
ananta, like a bracelet . He is incessantly showering compassion and is
endless . God Brahma, Indra and the other devatas meditate upon his feet.
The crescent moon adorns his crown.
The great one has crushed yama by his feet . His body is decorated with ash.
He is inclined to brush aside cupid . His preciousness is saturated in
the syllable - OM.

అవన్తమఖిలం జగదభఙ్గ గుణతుఙ్గమమతం ధృతవిధుం సురసరిత్-
తరఙ్గ నికురమ్బ ధృతి లమ్పట జటం శమనదమ్భసుహరం భవహరమ్ ।
శివం దశదిగన్తర విజృమ్భితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనఞ్జయపతఙ్గనయనం పరచిదమ్బర నటం హృది భజ ॥ ౩॥
Heartily resort to the great dancer, Lord Shiva, residing in the holy
place, Chidambaram, who protects all the world . His lofty place is due
to the indestructible good qualities . It is difficult to grasp his nature.
He has held crescent moon in his forehead . His matted hair is covetous
of holding the multitude of waves of the divine river, Ganga . He has dispelled
the vanity of Yama and is capable of delivering men from the pangs of
worldly life . The Lord of creatures, the auspicious God, in whose
hand a young deer is dancing, has spread his hands in all ten quarters.
The great destroyer has moon, fire and sun as his eyes.

అనన్తనవరత్నవిలసత్కటకకిఙ్కిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకున్దవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ ।
శకున్తరథ బర్హిరథ నన్దిముఖ శృఙ్గిరిటిభృఙ్గిగణసఙ్ఘనికటమ్
సనన్దసనక ప్రముఖ వన్దిత పదం పరచిదమ్బర నటం హృది భజ ॥ ౪॥
Heartily resort to the great dancer, Shiva residing in the holy place,
Chidambaram . The tiny bells attached to his bracelets which are shining
with innumerable gems of nine kinds are making a sweet jingling sound.
The dancing movements of his feet are accompanied by the drum
in the hands of Mukunda (vishnu) and vidhi (brahma). He is closely surrounded
by Vishnu, riding a chariot to which a bird (Garuda) is yoked, by kartikeya,
riding a charior to which a peacock is yoked, by a troupe of Gana-s
consisting of Srngi, Riti, Bhrngi etc headed by Nandi . Prominent sages
like Sananda and Sanaka are saluting his feet.

అనన్తమహసం త్రిదశవన్ద్య చరణం ముని హృదన్తర వసన్తమమలమ్
కబన్ధ వియదిన్ద్వవని గన్ధవహ వహ్నిమఖ బన్ధురవిమఞ్జు వపుషమ్ ।
అనన్తవిభవం త్రిజగన్తర మణిం త్రినయనం త్రిపుర ఖణ్డన పరమ్
సనన్ద ముని వన్దిత పదం సకరుణం పర చిదమ్బర నటం హృది భజ ॥ ౫॥
Heartily resort to the great dancer, Lord Shiva, residing in the holy
place called Chidambaram . His lustre is beginningless and endless . His feet
are revered by the gods . The pure one who is free from all blemishes
resides in the interior of sages hearts . He wields a lovely body made
up of the following components - water, sky, moon, earth, wind, fire,
sacrificer (atman) and Sun . His riches are infinite; he is the jewel of
the three worlds having three eyes, he is incline to smash the three cities
of Tripura . The god who takes pity (on the distressed) is saluted by Sage
Sananda.

అచిన్త్యమలివృన్ద రుచి బన్ధురగలం కురిత కున్ద నికురమ్బ ధవలమ్
ముకున్ద సుర వృన్ద బల హన్తృ కృత వన్దన లసన్తమహికుణ్డల ధరమ్ ।
అకమ్పమనుకమ్పిత రతిం సుజన మఙ్గలనిధిం గజహరం పశుపతిమ్
ధనఞ్జయ నుతం ప్రణత రఞ్జనపరం పర చిదమ్బర నటం హృది భజ ॥ ౬॥
Heartily resort to the great dancer, Shiva, residing in the holy place,
Chidambaram . He is not capable of being understood by the faculty of thinking.
His dark colored throat is attractive with its resemblance to the colour of
a multitude of bees . His complexion is white like a bunch of blooming
Kunda flowers . He wears a glittering appearance when saluted by Vishnu,
gods, and Indra, the killer of balasyre . His ear ornament consists of
serpent . He is free from fear and hence unmoved . However, he took pity
on Rati . He is a reservoir of all auspicious things for good persons.
The destroyer of Gajasure is the Lord of creatures, praised by Arjuna.
He is inclined to be delightful to persons who bow down to Him.

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దన్తిముఖ షణ్ముఖమముం
మృడం కనక పిఙ్గల జటం సనకపఙ్కజ రవిం సుమనసం హిమరుచిమ్ ।
అసఙ్ఘమనసం జలధి జన్మకరలం కవలయన్త మతులం గుణనిధిమ్
సనన్ద వరదం శమితమిన్దు వదనం పర చిదమ్బర నటం హృది భజ ॥ ౭॥
Heartily resort to the great dancer Shiva residing in the
holy place Chidambaram . He is the best among gods, destroyer of the three
cities for the benefit of the world . That Lord of creatures has given
birth to elephant-headed Ganesha for warding off obstacles and to
six-faced Kartikeya for leading divine army . The benevolent god
has hair that is brownish like gold . He is like Sun who causes the blooming
of the lotus in the form of sage Sanaka . Having a mind kind to all, he
weilds the lustre of snow . His mind is not attached to anything, even to
Parvati . He has swallowed poison arising out of ocean in order to save
the world from its adverse effects . He is a store-house
of quailities, not comparable to anyone else . He has given boons to sage,
Sananda . Having a face which is delightful like the moon, he has attained
the blissful state.

అజం క్షితిరథం భుజగపుఙ్గవగుణం కనక శృఙ్గి ధనుషం కరలసత్
కురఙ్గ పృథు టఙ్క పరశుం రుచిర కుఙ్కుమ రుచిం డమరుకం చ దధతమం ।
ముకున్ద విశిఖం నమదవన్ధ్య ఫలదం నిగమ వృన్ద తురగం నిరుపమం
సచణ్డికమముం ఝటితి సంహృతపురం పరచిదమ్బర నటం హృది భజ ॥ ౮॥
Heartily resort to the great dancer, Lord Shiva, who resides in the
holy place, Chidambaram, and He is without birth . The earth itself
is his chariot . The great serpent, Vasuki is his bowstring.
The golden peaked Meru is His bow . In His hands shines a deer, a big
sword and an aze . He weilds a damaru (drum) which has the color of
lovely kumkuma . Mukunda himself is his arrow . He effectively grants the
desire to those who salute him . The multitude of Vedic texts are
his horses (or mind). The incomparable God accompanied by Chandika has
quickly destroyed the cities of demon tripura.

అనఙ్గపరిపన్థినమజం క్షితి ధురన్ధరమలం కరుణయన్తమఖిలం
జ్వలన్తమనలం దధతమన్తకరిపుం సతతమిన్ద్రముఖవన్దితపదమ్ ।
ఉదఞ్చదరవిన్దకుల బన్ధుశత బిమ్బరుచి సంహతి సుగన్ధి వపుషం
పతఞ్జలినుతం ప్రణవపఞ్చర శుకంపర చిదమ్బర నటం హృది భజ ॥ ౯॥
Heartily resort to the great dancer, Lord Shiva, who resides in the
holy place, Chidambaram . Birthless, he is an enemy of Cupid . He bears the
burden of the earth, He is intensely compassionate to all . The killer
of demon Andhaka is capable of holding buring fire . Gods headed by
Indra are constantly falling at His feet . He is having a body
which has got the lustre of a group of hundred rising suns and is fragrant.
He is praised by Patanjali and is like a parrot in the cage of the syllable
Omkara.

ఇతి స్తవమముం భుజగపుఙ్గవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృఙ్గ రహితమ్ ।
సరఃప్రభవ సమ్భవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శఙ్కరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ॥ ౧౦॥
Here ends the praise song composed by Patanjali who is an incarnation of
the great serpent Shesha . One who learns it by heart and recites it will
find a seat in the assembly of Gods . The praise song is charming . The
words in it lead to the perception of the   the Lord's pair of feet.
It flows on, being beginningless and endless (composed of the meter
charaNashri.ngarahita). It contains the description of Shankara praised
by the divine beings headed by Brahmadeva, Lords of the Quarters and Vishnu.
One who recites this hymn,quickly reaches the highest goal and does not steep
into the ocean of worldly existence which causes great sorrow and sinfulness.

          ॥ ఇతి శ్రీపతఞ్జలిమునిప్రణీతం చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
జైహింద్.