గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2018, శనివారం

జైశ్రీరామ్.
సమాశ్రీ, గతికా,మత్తరజినీ,పొన్నొదవు,నీతిగా,జ్ఞానజీవి,రజోరంజిత, అమలకీర్తి,అంతఃకరణ,కీర్తిగిమీనీ,గర్భ"-శోధకా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                   జుత్తాడ.

       "-శోధకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మాటరాని జంతువైన!మనువు మార్చ నోపదాయె?మాటలందు వక్ర మేలరా?
చాటెజాతినీతి భూమి!చనువు బట్టి తప్పు మాని!సాటిజాతి నీతి పెంచుమా!
కోటియాగ ధన్యమందె!కొనకు కీర్తిగామి యాయె!కోట నెంచి తప్పు జేయకన్?
పూట గ్రాస భుక్తమంది!పుణికి పుచ్చె!గో వరామ!భూటకాల జన్మ గాకిలన్? 

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
మాటరాని జంతువైన!
చాటె జాతినీతి భూమి!
కోటి యాగ ధన్యమందె?
పూట గ్రాస భుక్తమంది!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
మనువు మార్చ నోపదాయె?
చనువు బట్టి తప్పు మాని!
కొనకు కీర్తిగామి యాయె!
పుణికి పుచ్చె గో వరామ!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృససం.171.ప్రాసగలదు.
మాటలందు వక్ర మేలరా?
సాటి జాతి నీతి పెంచుమా!
కోట నెంచి తప్పు జేయకన్?
భూటకాల జన్మ గాకిలన్?

4.గర్భగత"-పొన్నొదవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాటరాని జంతువైన? మనువు మార్చ నోపదాయె!
చాటె జాతి నీతి భూమి!చనువు బట్టి తప్పు మాని!
కోటి యాగ ధన్య మందె!కొనకు కీర్తి గామి యాయె!
పూట గ్రాస భుక్త మంది!పుణికి పుచ్చె గో వరామ!

5.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనువు మార్చ నోపదాయె?మాటలందు వక్ర మేలరా?
చనువుబట్టి తప్పు మాని!సాటి జాతినీతి పెంచుమా!
కొనకు కీర్తిగామి యాయె!కోటనెంచి తప్పు జేయకన్?
పుణికిపుచ్చె గో వరామ!భూటకాల జన్మ గాకిలన్?

6.గర్భగత"జ్ఞానజీవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మనువు మార్చ నోపదాయె?మాటలందు వక్ర మేలరా?మాటరాని జంతువైన!
చనువు బట్టి తప్పు మాని!సాటి జాతి నీతి పెంచుమా!చాటె జాతినీతి భూమి!
కొనకు కీర్తిగామి యాయె!కోటనెంచి తప్పు జేయకం?కోటియాగ ధన్యమందె?
పుణికి బుచ్చె గో వరామ!భూటకాల జన్మ గాకిలం?పూటగ్రాస భుక్తమంది!

7.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాటలందు వక్రమేలరా?మాటరాని జంతువైన?
సాటి జాతి నీతి పెంచుమా!చాటె జాతినీతి భూమి!
కోటనెంచి తప్పు జేయకం?కోటియాగ ధన్యమందె?
భూటకాల జన్మగాకిలనం?పూట గ్రాస భుక్త మంది!

8.గర్భగత"-అమలకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మాటలందు వక్ర మేలరా?మాటరాని జంతువైన,మనువుమార్చ నోపదాయె?
సాటిజాతి నీతిపెంచుమా!చాటె జాతినీతి భూమి!చనువుబట్టి తప్పుమాని!
కోటనెంచి తప్పు జేయకం?కోటియాగ ధన్యమందె?కొనకు కీర్తిగామి యాయె!
భూటకాలజన్మ గాకిలం?పూటగ్రాస భుక్తమంది!పుణికి బుచ్చె గో వరామ!

9,గర్భగత"-అంతఃకరణ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గలగుణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనువుమార్చ నోపదాయె?మాటరాని జంతువైన?
చనువుబట్టి తప్పుమాని!చాటె జాతి నీతి భూమి!
కొనకు కీర్తిగామి యాయె!కోటియాగ ధన్యమందె?
పుణికి బుచ్చె గో వరామ!పూటగ్రాస భుక్త మందె?

10,గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మనువు మార్చ నోపదాయె?మాటరాని జంతువైన!మాటలందు వక్ర మేలరా?
చనువుబట్టి తప్పుమాని!చాటె జాతినీతి భూమి!సాటిజాతి నీతి పెంచుమా?
కొనకు కిర్తిగామి యాయె!!కోటి యాగ ధన్యమందె?కోటనెంచి తప్పు జేయకన్!
పుణికి బుచ్చె గో వరామ!పూటగ్రాస భుక్త మందె?భూటకాల జన్మ గాకిలన్?
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సులభ గ్రాహ్యముగా అన్ని వృత్తములు అలరించు చున్నవి.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.