గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మార్చి 2017, సోమవారం

శ్రీ వల్లభ వారి నూతన ఛందములో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత. నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము

 జైశ్రీరామ్.
నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము 
పలుకు తలికిఁ బ్రణతులు! పదమిత్తువ పట్టికింక! పడదనక యిడన్‌!( /పనిన్‌!)
పలుకిడుదులె, వగవకు! పదమీననఁ బాడరావు ! బవరములె మదిన్‌!
ఎలమి దెలియ నిలకును, నెదనూపుచు నిత్తు శక్తి, నెరిగినటులనే
బలుకువెడలుఁ బరుగునఁ , బదమాలగ వ్రాసి పంచఁ బ్రముదముగఁ దెరన్‌
గర్భితమైనవి ....
నెరుకలి వృత్తము
--------------------
పలుకు తలికిఁ బ్రణతులు!
పలుకిడుదులె, వగవకు!
ఎలమి దెలియ నిలకును,
బలుకు వెడలుఁ బరుగున
గతిమా వృత్తము
--------------------
పదమిత్తువ పట్టికింక!
పదమీననఁ బాడరావు !
ఎదనూపుచు నిత్తు శక్తిఁ
బదమాలగ వ్రాసి పంచ
తానన వృత్తము
-------------------
పదమిత్తువ పట్టికింక! పడదనక
పదమీననఁ బాడరావు ! బవరములె !
యెదనుండియె యిత్తు శక్తి, నెరిగినటు
పదమాలగ వ్రాసి పంచఁ బ్రముదముగ
కమనీయ వృత్తము
-----------------------
పలుకు తలికిఁ బ్రణతులు! పదమిత్తువ పట్టికింక!
పలుకిడుదులె, వగవకు! పదమీననఁ బాడరావు !
ఎలమి దెలియ నిలకును, నెదనూపుచు నిత్తు శక్తిఁ
బలుకు వెడలుఁ బరుగునఁ , బదమాలగ వ్రాసి పంచ
సుప్రభ
23-03-2017
వృత్తము ----గణములు----- యతి/యతులు ------ఛందము
----------------------------------------------------------------------
నెరుకలి ---న,న,నల -------------- 7 -------పంక్తి
గతిమా --- స,స,జ -----యతిలేదు --------బృహతీ
తానన -----స,స,జ,న,లల ------10 -------శక్వరీ
కమనీయ--న,న,న,న,భ,ర,ల ---10 -------అతిధృతి
నటకలిమెలికల ---న,న,న,న,భ,ర,న,న,లగ ------(7),11,16,20 ----ఉత్కృతి
చింతా రామకృష్ణారావు గారు ప్రచురించినది, వల్లభ వఝల వారు రచించినది, "నెరుకలి,గతిమా,తానన, కమనీయ గర్భ నటకలిమెలికల వృత్తము" స్ఫూర్తితో వ్రాయబడినది.
క్రొత్త వృత్తములను పరిచయము చేసిన చింతావారికి, వల్లభవఝల వారికి ధన్యవాదములు. ఏదో ఒక విధముగా శక్తినిచ్చి వ్రాయించినవారికి వందనాలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.