గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2017, సోమవారం

రాజమహేంద్రి ప్రియ పుత్రిక అయిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము విశేషాలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! రాజమహేంద్రి ప్రియ పుత్రిక అయిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవము మొన్న, నిన్న  చాలా వైభవంగా జరిగింది. మహామహులు గుర్తింపబడి గౌరవింపబడటమే అత్యంత వాంఛనీయము. ఇక్కడ అది జరిగినందుననే ఈ కార్యక్రమం ప్రశంసార్హమైంది.నిరాఘాటంగా ఇటువంటి కార్యక్రమాల్ని కులమత ప్రాంతముల కతీతంగా నిర్వహిస్తున్న ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈ బాద్ధ్యతలను తమ భుజములపై వేసుకొని కఠోర దీక్షతో అత్యంత శ్లాఘ్యంగా నిర్వహిస్తున్న . 
సుదర్శన్, దేవీ సుదర్శన్ దంపతులు 
అభినందనీయులు. 
 మహనీయునకు ఘన సత్కారమ్.
 సత్కరింపబడుచున్న పద్మశ్రీ హల్డర్ నాగ్.
సత్కరిస్తున్న డాుధాకర్. సత్కరింపబడుచున్న డోలేంద్రప్రసాద్.
సత్క్రుతులైన మహనీయులందరికీ హార్దిక శుభాకాంక్షలు.
ఇటువంటి నిస్వార్థ సేవా దృక్పథం కలిగిన ఆది దంపతులను పోలిన దేవి సుదర్శన్ దంపతులను, 
ప్రజాపత్రిక కుటుంబాన్ని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.