గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2016, బుధవారం

శ్రీరామ మంత్రమ్.

జైశ్రీరామ్.
శ్రీరామాఖ్య  అజాది యోగి ముని సత్సేవ్యంపు చిన్మంత్రమున్,
దారిద్ర్యంబను దుఃఖ రోగ హరణోద్దాత్తంపు మంత్రంబు, సం
సారాంభోధిని దాటఁ జేసి, శుభ తేజంబిచ్చు సన్మంత్రమున్,
పారంద్రోలు భయంబు నట్టి శుభ సన్ మంత్రంబు నన్నేలుతన్.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది " దారిద్ర్యాన్ని దు:ఖము,భయము,రొగ నివారిణి ఐనట్టిదీ ఈ సంసారము అనె సముద్రాన్ని దటిచగలదీ అగు శ్రీ రామ మంత్రమును అందించి నందులకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.