గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2016, శనివారం

ప్రియతమ ఆంధ్రామృత పాఠకాళికి నా ధన్యవాదములు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్రామృత పాఠకులైన మీ అందరి ప్రోత్సాహం నా చేత యాదాద్రి శ్రీనృసింహశతకరచనను చేయించిమ్ది. ఆ శతకమును చదివిన ప్రజాపత్రిక యాజమాన్యం వారి పత్రికలో ఈ శతకం విషయం ప్రస్తావించింది. 
ఈ విషయం మీముందుకు తేవడం, ప్రోత్సాహకులైన మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేయడం నా ధర్మంగా భావించి ఆ పత్రికా ప్రచురణ మీముందుంచుచున్నాను.
ప్రత్యక్షంగా పరోక్షంగా నా కవితాపాటవానికి మూలమైన 
మీ అందరికీ ఈ విధంగా నన్ను ప్రోత్సహించుచున్న ప్రజాపత్రిక వారపత్రిక యాజమాన్యమునకు, దూరవాణిద్వారా నన్నభినందించుచున్న మహనీయులందరికి, నా ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

9 comments:

సో మా ర్క చెప్పారు...

అభినందన సహస్రములు
రామకృష్ణ కవీంద్రా!
మీ మేధా పటిమ వర్ణనాతీతం!
అనన్యం!అపూర్వం!
శ్రీ యాదాద్రి నృసింహానుగ్రహప్రాప్తిరస్తు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్! సోమార్కగారూ! మీ అభిమాన పూర్వక అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

ఏ.వి.రమణరాజు చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,
మీరు చిత్రకవిత పై చేసే కృషికి
హృదయపూర్వక ధన్యవాదాలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్! ఏ.వీ.రమణరావుగారూ! నమస్తే. మీ అభిమానానికి నా కృతజ్ఞతలండి.

anantha krishna n.v. చెప్పారు...

అయ్యా
చాలా సంతోషం... మీ స్థాయికి మేమంతా ఎదగాలని ఆశీర్వదించండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అవ్యాజానురాగంతో నన్ను మీరు ఏ స్థాయిలో చూస్తున్నారో నాకు తెలియదు కాని, మీరు ఉన్న(త)స్థాయి అధిగమించి ఆదర్శ కవులకే మార్గదర్శి కావాలని మనసారా కోరుకొంటున్నాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రతిభా వంతులైన పండితునికి నేను సోదరిని కావడం నాపూర్వజన్మ సుకృతం. ఇలాగే దశదిశలా మీ పేరు ప్రఖ్యాతులు వెల్లివిరియాలని ఆశీర్వదించి అక్క.

Apparao చెప్పారు...

అభినందనలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అప్పారావు గారూ! ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.