గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జూన్ 2016, మంగళవారం

భౌమాశ్వని ప్రయాణంచ ప్రవేశే శని రోహిణి . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. భౌమాశ్వని ప్రయాణంచ ప్రవేశే శని రోహిణి । 
వివాహే గురు పుష్యేతు షాణ్మాసం మరణం ధృవమ్ ॥ 
గీ. అశ్వనీయుక్త భౌమనాడరుగ రాదు.
రోహిణీ స్థిరవారము గృహ ప్రవేశ
మొప్పదు గురు పుష్యమి పెండ్లి యొప్పదయ్య
ఒప్పనివి చేయ మృతి కల్గు. తప్పదయ్య.
భావము. అశ్వనీ మంగళవారము నందు ప్రయాణము, రోహిణి శనివారము నందు గృహ ప్రవేశము, పుష్యమీ గురువారము నందు వివాహమును ముఖ్యముగా చేయకూడదు. ఆయా తిది నక్షత్ర వారములతో కూడిన దుష్ట యోగములందు వాటి నాచరించిన మరణ ప్రదము కాగలదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు ఏఏ వారములందు ఏఏపనులు చేయకూడదో చక్కగా వివరించారు .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.