గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2016, గురువారం

చిత్ర కవితాభిలాషి శ్రీ కైపు నాగ సుబ్రహ్మణ్యంగారు మా యింటికి అతిథిగా వచ్చిన శుభ తరుణం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! బెంగుళూరు నివాసి యైన శ్రీ కైపు నాగ సుబ్రహ్మణ్యం గారు చిత్ర కవితానురక్తితో నిన్న మాయింటికి విచ్చేసారు. వీరు తెలుగు కన్నడ భాషలలో చిత్రకవితలు వెలయుంచిన దిట్ట. వీరిని మా ఇంటిలో సత్కరించుకొనే భాగ్యం కలగడం నా అదృష్టం. అట్టి మంచి సమయంలో ఆత్మీయతతో శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ రామ మోహన రావుగారు కూడా మాయింటికి విచ్చేసారు. అభిమానంతో వచ్చిన వీరందరికి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులకు ఆతిధ్య మీయగలిగిన మీరు అదృష్ట వంతులు. కనీసం వారిచిత్రములను దర్శించ గలిగిన భాగ్యం మాకు లభింప జేసినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.