గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, అక్టోబర్ 2015, శుక్రవారం

విజయ దశమిరా తమ్ముఁడ! విజయ దశమిరా!

జైశ్రీరామ్.
ఆర్యులారా!
ఈ క్రింది పాటను ఆలపించే ప్రయత్నం చెయ్యండి.
అదే విధంగా ఆలోచించండి ఈ పాటలో ఏవైనా ఛందో భరిత పద్యాలున్నాయేమోనని.
విజయ దశమిరా
తమ్ముఁడ! విజయ దశమిరా!
విమల కవిత లందించే
విజయ దశమిరా!

సుగుణ కవిజనాళి కొఱకు
సుమధుర విషయాన్వితమై

ప్రజల యిడుమలను తుడిచెడి
విజయ దశమిరా!
సుజనుల
విజయ దశమిరా!

విజయ పథము
లను నడుపుచు
విజయమొసగురా!
మనలకు
విజయ మొసగురా!


విజయ దశమిరా తమ్ముఁడ!
విజయ దశమిరా! విమల కవిత లందించే 
విజయ దశమిరా! సుగుణ క
విజనాళి కొఱకు సుమధుర విషయాన్వితమై

ప్రజల యిడుమలను తుడిచెడి 
విజయ దశమిరా! సుజనుల విజయ దశమిరా!
విజయ పథములను నడుపుచు
విజయమొసగురా! మనలకు విజయమొసగురా!
జైహింద్

Print this post

6 comments:

కంది శంకరయ్య చెప్పారు...

కం.
విజయ దశమిరా తమ్ముఁడ!
విజయ దశమిరా! విమల కవిత లందించే
విజయ దశమిరా! సుగుణ క
విజనాళి కొఱకు సుమధుర విషయాన్వితమై

ప్రజల యిడుమలను తుడిచెడి
విజయ దశమిరా! సుజనుల విజయ దశమిరా!
విజయ పథములను నడుపుచు
విజయమొసగురా! మనలకు విజయ మొసగురా!

subbarao చెప్పారు...

పాటయందునగలవార్య పద్యములట
చదువదెలిసెమీ ధీశక్తి చక్క గాను
సాటియెవరయ్య మీకిల సాటియెవరు
వందనంబులు సేతును వందలాది

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తేటగీతులె తీయని పాటలటుల
వ్రాయగలిగిన మీకున్న వాసిఁ గంటి
సుబ్బరావాఖ్య సూనృత సుకవి వర్య!
సన్నుతార్హము మీకున్న సహజ గుణము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరార్యా! నమోనమః.

మంద పీతాంబర్ చెప్పారు...

కందములు రెండు గేయపు
డెందమ్మునగానబడగ ఠీవిగ దసరా
సందేశము హాయిగొలిపె
వందనములు రామకృష్ణ వర్యునకివియే !!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఖ్యాతిగ కందము వ్రాసిరి.
ప్రీతిని కలిగించె మంద పీతాంబర! మీ
భాతికి నిదర్శనంబిది.
ఏ తీరున కనుగొనిరి? మహేశ్వర కృపయా?
మీకు నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.