గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, అక్టోబర్ 2015, బుధవారం

సుగుణోద్భాసులైన మీ అందరికీ విజయ దశమి శుభాకాం‍క్షలు.

జైశ్రీరామ్
ఓం శ్రీమాత్రేనమః.
సుగుణోద్భాసులైన మీ అందరికీ విజయ దశమి శుభాకాం‍క్షలు.
ఓంకారాశ్రిత సృష్టినంతటను జ్ఞానోద్భాసయై యుండు నా
ఐంకారోజ్వల శాంభవీ జనని మోహాంధంబు పొకార్పుతన్,
 హ్రీంకారాద్భుత మాతృ కృష్ణ ఛవి సంప్రీతిన్ మదిం గొల్పుతన్
   శ్రీంకారాక్షర ధామయౌచు సుగుణ శ్రీమంతులన్ గాచుతన్..
జైహింద్.
Print this post

1 comments:

మిస్సన్న చెప్పారు...

రామకృష్ణసుకవి రమ్యమౌ పద్యాన
సర్వ మిత్రతతికి సంతసమున
ప్రీతి గూర్చు మాత బీజాక్ష రములుంచి
శుభముగోరినారు విభవమలర.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.