గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2015, సోమవారం

పాఠకాళికి రథసప్తమి శుభాకాంక్షలు మరియు యావద్భారతీయులకు రిపబ్లిక్డే శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆయులారా!రథసప్తమి శుభాకాంక్షలు మరియు  యావద్భారతీయులకు రిపబ్లిక్డే శుభాకాంక్షలు
ఈ రోజు రథసప్తమి పరమ పవిత్రమైన పర్వదినము.కర్మసాక్షియైన ఆ శ్రీమన్నారాయణుఁడు ఆదిత్యుఁడుగా ఈ జగత్తు సృష్టి, స్థితి లయలకు కారకుఁడై సకల కర్మ సాక్షియై ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు. అట్టి సూర్యుని జన్మదినముగా ఈ రోజు ప్రత్యేకత సంతరించుకుంది. 
ఈ పవిత్రమైన రోజున మనము ఆ సూర్యభగవానుని ఉపాసించినట్లైతే మనలనంటి యున్నచో సకల పాపపంకిలములు తొలగుటయే కాక, పరిపూర్ణమైన ఆరోగ్యము కూడా మనకు సిద్ధించును. 
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నారు మన పెద్దలి. అట్టి సూర్యుఁ మననుండి యేమియూ ఆశించడు. నమస్కార ప్రియో సూర్యః అన్న పెద్దల మాటలు మనకు తెలియనివి కావు. ఆ పరమాత్మకు మనం అభిముఖులమై మనసారా తలచుకొని నమస్కరించినట్లైతే ఆ పరమాత్మకు తృప్తి కలిగించినవారిమౌతాము.

కావున మనమందరం ఆ ఆదిత్యునికి నమస్కరించి, ఆదిత్యహృదయం పఠించి, ఆ పరమాత్మయొక్క కృపకు పాతృలమగుదుముగాక.
ఈ పర్వదిన సందర్భముగా మీ అందరికీ నా అభినందనలు. 
లోక స్తితి లయ కారక! 
శ్రీకర! ఓ సూర్య దేవ! చిత్ప్రభ నీవై
లోకులకండగనుండుము.
ప్రాకటముగ శుభములొసగి వరలింపుమయా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.