జైశ్రీరామ్.
శ్లో. అపరాధ సహస్రాణి, క్రియంతేஉహర్నిశం మయా |
దాసోஉయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
క. లెక్కకు మించిన తప్పుల
నక్కజముగ చేసి యుందు నహరహమును నేన్.
మక్కువతో నను దాసుని
చక్కగ కని, కొను క్షమించి, సర్వేశ్వరుఁడా!
క. లెక్కకు మించిన తప్పుల
నక్కజముగ చేసి యుందు నహరహమును నేన్.
మక్కువతో నను దాసుని
చక్కగ కని, కొను క్షమించి, సర్వేశ్వరుఁడా!
శ్లో. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
గీ. కర చరణముల చేసిన కర్మలందు,
మాటలను చేతలను చేయు మర్మములను,
శ్రవణ నయనములను చేయు చర్యలందు,
మనసు చేసెడి కర్మల, మసలవచ్చు
మరువ రానట్టి యపరాధ మలిన తతులు.
తెలిసి, తెలియక చేసెడి మలిన తతుల
నెల్ల మన్నించి కావుమో చల్లనయ్య.
కరుణఁజూడుమో పరమేశ! హర! మహేశ!
గీ. కర చరణముల చేసిన కర్మలందు,
మాటలను చేతలను చేయు మర్మములను,
శ్రవణ నయనములను చేయు చర్యలందు,
మనసు చేసెడి కర్మల, మసలవచ్చు
మరువ రానట్టి యపరాధ మలిన తతులు.
తెలిసి, తెలియక చేసెడి మలిన తతుల
నెల్ల మన్నించి కావుమో చల్లనయ్య.
కరుణఁజూడుమో పరమేశ! హర! మహేశ!
శ్లో. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
క. త్రికరణ ములచే, నాత్మను,
ప్రకృతి సహజ బుద్ధి చేత భ్రమచేతను నే
రక, నేర్చియు చేసిన
సకలము రామార్పణంబు సలుపుచునుంటిన్.
నారాయణాయేతి సమర్పయామి ||
క. త్రికరణ ములచే, నాత్మను,
ప్రకృతి సహజ బుద్ధి చేత భ్రమచేతను నే
రక, నేర్చియు చేసిన
సకలము రామార్పణంబు సలుపుచునుంటిన్.
జైహింద్.
2 comments:
జీవిత సాఫల్యానికి తొలిమెట్టును చూపించినందుకు ధన్యవాదములు.
చాలా చక్కగా ఆంధ్రీకరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.