గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2012, సోమవారం

మాయింటికి వచ్చిన పండిత నేమాని దంపతులు. వారి అభిమానులు.

జైశ్రీరామ్.
మాయింటికి విచ్చేసిన పండిత నేమాని. వారి సతీమణి రూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరులు.
ఈ పుణ్య దంపతులను దర్శించుటకు వచ్చిన అభిమానులు, మన ప్రియ మిత్రులు.
౨౦౧౨ ఫిబ్రవరి ౧౨వ తేదీన మా యింటికి వచ్చిన పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారిని వారి అర్థాంగి శ్రీమతి త్రిపుర సూదరి గారిని కలవాలని అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోదావరి శ్రీరామ కృష్ణ గారు, సతీ సమేతంగా వచ్చిన మన ప్రియ మిత్రులు  చక్రవర్తిగారు, సమీప ప్రాంతాలనుండి వచ్చిన మహిళామణులు, లహరి బ్లాగ్ నిర్వాహకురాలు చిరంజీవి యస్.శ్రీవైష్ణవి. పైచిత్రంలో మనకు కనిపిస్తారు.
ఇంకా ఎందరో వారి దర్శనార్థం వచ్చి వారితో కాస్త సమయం ముచ్చటించి వెళ్ళారు. శ్రీ కంది శంకరయ్యగారు దూరవాణి ద్వారా వారిని పలుకరించి వరంగల్లు నుండి తాను బయల్దేరుతున్నానని, రేపు ఎక్కడున్నా కలుస్తానని తెలియ జేసారు. అనేకమంది దూరవాణిద్వారా వారితో ముచ్చటించారు. 
పండిత నేమాని వారు రచించిన అధ్యాత్మ రామాయణం లోని కొన్ని ఘట్టాలలోని నిగూఢ భావాన్ని అద్భుతంగా ఉపన్యసించి తెలియ జేసారు. ఆ ఉపన్యాసానికి సంబంధించిన ఆడియో చక్రవర్తిగారు పంపగానే బ్లాగుద్వారా వినిపించే ప్రయత్నం చ్జేయగలను.
వారి రాక ఎందరికో ఆనందం కలిగించింది.
చక్రవర్తి మున్నగువారు ఈ పుణ్య దంపతులను నూతన వస్త్రములతో సన్మానించారు.
జయప్రకాష్ నారాయణ్ నగర్ దేవస్థానం కార్య దర్శి శ్రీ గంగా రామారావుగారు శ్రీ నేమాని దంపతులను వారి బంధువుల యింటికి తమ కారులో దీపెట్టారు. అందుకు వారికి నా ధన్యవాదములు.
మాయింటికి అభిమానంతో విచ్చేసిన పండిత నేమానివారికీ, వారి సతీమణి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
వారి రాకను తెలుసుకొని, వచ్చినవారందరికీ, దూరవాణి ద్వారా తమ అభిమానాన్ని తెలియజేసినవారందరికీ, బ్లాగు ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరచినవారందరికీ, పేరు పేరునా నేను కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

శ్రీ రామకృష్ణ సఖు గృహ
మే రాజిలు పుణ్యసీమ మేలగు మతి స
త్కారములు మాకొనర్చిరి
వారికి నాశిషము గూర్తు వాగమృతముతో

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ చెప్పారు...

thaatha gaariki...
maammagariki
manumadu

rambhatla parvatheeswara sarma
namaskaaramulu


dhanyavaadamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.