పాఠక మాన్యా! బ్రహ్మశ్రీ వల్లభవఝ నరసింహమూర్తి కవి పుంగవుల రచనలైన షడ్లఘు సీసముతో పాటు సర్వ లఘు సీసము కూడా ఇక్కడ మీరు చూచి మీ అమూల్యమై అభిప్రాయాన్ని వ్రాయండి.
చూచారు కదా! మరి మహనీయమైన మీ సూచనలన్తో పాటు మీరు మీచే రచింపడిన సర్వ లఘు సీసమును పంపించగలరని పాఠక లోకానికి అది అందివ్వాలనీ ఆశిస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post
3 comments:
ఇలా ఐదులఘువులు, ఆరులఘువుల గణాలతో కూడా పద్యాలు కూర్చవచ్చని కొత్తవిషయం తెలిపారు. ఇదివరకు ఎప్పుడో పోతన పద్యం (ఇలాంటిదే అనుకుంటాను) ఆంధ్రామృతంలో మీరు ఉటంకించినట్టు నాకు గుర్తు.
ఇలా సర్వలఘు సీసము ,[ ఇదివరకె హెప్పారు ] షడ్ లఘు సీసము కొత్త కొత్త పద్యాలను తెలుపుతున్నందుకు చాలా ఆనందం గా ఉంది. అసలివి ఇలా ఉంటాయన్న సంగతె నాకు తెలియదు.గురువులు శ్రీ వల్లభ వఝు నరసిం హ మూర్తి గారి లఘు సీసములు షడ్ లఘు సీసము చదవడానికి " జలరుహములు,మధుమతిరమ .కలహ ప్రియతముడు ,నలువ సుతుడు ,ఇలా మంచిమం చి పదాలతొ హృద్యమం గా ఉంది. అవును ఒక చిన్న సందేహం. " గణము అనగా 5 అక్షరములు [ మొత్తం అన్ని గణాలు ] ఉండవచ్చునా ? దయచేసి తెలుప గలరు.
అక్కా! నమస్తే. సీసామునకు ప్రతి పాదమున ఆరింద్ర గణములు ఉండాలని, నియమం. ఐతే ఇంద్రగణానికైతే నాల్గక్షరాలే ఉండాలని నియమం కూడా ఉంది.
దీనిని అధిగమిస్తూ సర్వ లఘు సీసం ఐదక్షరాల నలల అనే సర్వ ల్ఘువులతో ఆరు గణాలను ప్రయోగించినది భాగవతంలో కనిపిస్తుంది.
అంతకంటే భిన్నంగా ఒక వినూతన ప్రయోజనకర ప్రయోగానికి తెరతీసారు మన కవిగారు శ్రీ నరసింహ మూర్తిగారు. అదీ కథ.
నమస్తే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.