గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2010, సోమవారం

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా పాఠకాళికి శుభాకాంక్షలు.

శ్రీరామ భక్తాళి క్షేమంబు నిత్యంబు చేకూర్చగా నున్న శ్రీ ఆంజనేయా!
నోరార నా రామ నామంబు నే పల్క నృత్యంబునే చేతువచ్చోట నీవున్.
ధీరాత్ముఁడా! భక్త వారాశి నీసేవ దీప్యంబుగా జేయు నీనాడు. ప్రేమన్
నీ రామ భక్తాళినేగావగా రమ్ము. నీజన్మ మీనాడు మాభాగ్యమేగా!
హనుమజ్జయంతి సందర్భంగా శ్రీవీర భక్త రామాంజనేయస్వామి వారికి సహస్రానేక వందనములర్పిస్తూ; తద్భక్తజనాళికి వారి ఆశీశ్శులనంతంగా ప్రాప్తించాలని మనసారా కోరుకొంటున్నాను.
జై వీర హనుమాన్.
జైహింద్.
Print this post

5 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పంచముఖ ఆంజనేయ చిత్రాన్ని చక్కని పద్యాన్ని భక్థ జనులకు అందించినందుకు ముందుగ తమ్మునికి శుభాశీస్సులు భగవంతునికి నమస్సులు

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

జై వీర హనుమాన్ ,జైజై వీర హనుమాన్

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ, నా శంకరాభరణం బ్లాగులో ఛురికాబంధం పెట్టాను. చూసి అభిప్రాయం చెప్పవలసిందిగా మనవి.

bhavani చెప్పారు...

chaala baaga raasaarandi

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భవానీగారూ!
మీరు చదివి సంతోషించినడుకు ధన్యవాదాలమ్మా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.