గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2010, గురువారం

నర్కుటక; కోకిలక; చంపక వృత్తాలు.(బంధ కవిత్వము)

Sarasvati with a peackock

1)నర్కుటకము:- న - జ - భ - జ - జ - వ.   
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి)
నకజ భర్తనే సతము క్కగ సమ్మతితో; 
నమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్
నుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై 
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా!    
2)కోకిలకము:- న - జ - భ - జ - జ - వ. 
(1వ అక్షరంతో - 8వ అక్షరానికి - 14వ అక్షరానికి యతి)
నకజ భర్తనే తము చక్కగ మ్మతితో; 
నమున నిల్పుచున్ నుజ మాన్యులు న్ననలన్
నుటది సత్యమే! రుణఁ గాంచుచు; కామ్యదుడై 
ప్రణుతులనందు యీ ప్రభువు రాముడె మ్యుఁడుగా!    
3)చంపకము:- న - జ - భ - జ - జ - జ - ర.  
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి
నకజ భర్తనే సతము క్కగ సమ్మతితో; ముదాత్ములై
నమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్ సతంబు తా
నుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై మనంబులన్
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా!   ధరాస్థలిన్. 
ప్రాస నియమన్నింటికీ ఉంటుంది.
జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

చాలా బాగుందండి.

rākeśvara చెప్పారు...

చంపకము అందరికీ తెలిసినదే అయినా, దానికి సామీప్యం వున్న ఆ రెండు వృత్తాలనూ పరిచయం చేసినందులకు ధన్యుడను।

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది " బంధ కవిత్వము " ఛందస్సు చక్కగా నేర్పు తున్నందుకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.