ప్రియ సాహితీ బంధువులారా! అంతర్ జాల భువన విజయము నిర్వహణలో కృతకృత్యులయినందుకు మీ అందరికీ నా అభినందనలు.నిర్వహణ దీక్షా దక్షులయిన రాయల వారికి కూడా కృతకృత్యులయినందుకు నా హృదయ పూర్వక అభినందనలు. మీరంతా నాపద్యాలకు చక్కని వ్యాఖ్యానం చేసి ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.
సీ:-కృష్ణ రాయలు పద్య తృష్ణ తోడ కవుల - నష్టా దశా2ధిక మలర నుంచి,
భువన మంతయు సభా భవన మట్టుల జేసి - పెద్దనాదులు తమ ప్రతిభ జూప
పద్యము లెన్నియో హృద్యమౌ రీతిలో - పలుకు నట్టుల జేసి, వెలయ జేసి
భువన విజయమును కవన విజయమన - కవులకు సన్నుతి కలుగ జేసి.
గీ:-ఆంధ్ర సాహితీ వేత్తలు హర్ష మునను - పొంగ, భువన మంతర్జాల భువనవిజయ
కవుల కల్పనా పటిమను కాంక్ష తోడ - చూడ, జేసిరి . తానె మన తోడ నుండి.
చ:- కవులను కోరుచుంటి. తమ కమ్మని సత్ కవితా ప్రవాహమున్
భువిని ప్రశస్థమౌనటుల ముచ్చటతో ప్రవహింప జేయుచున్
భువనమె కృష్ణ రాయకవి పుణ్య ప్రదంబగు కొల్వుగా, సభా
భవనమునమునందు సత్ కవిగ పన్నుగ మీరు రహింప. నెల్లెడన్.
సజ్జన విధేయుడు
చింతా రామ కృష్ణా రావు.
{ ఆంధ్రామృతం బ్లాగ్}
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
2 comments:
పెద్దవారు, మంచి చెడు తెలిసినవారు, మా పిల్ల ఉత్సాహాన్ని మన్నించి మాతో కూడి ఆ నాలుగు గంటలు వినోదించినందుకు మీకున్నూ మా కృతజ్ఞతాంజలులు. సందర్భోచితంగా ఇతర కవులకి ప్రోత్సాహ ప్రశంసలు కూడా ఆశువుగా పద్యాల్లో చెప్పడం మాకందరికీ గొప్ప స్ఫూర్తి.
ఈ భువన విజయ విశేషాలు విజయదశమి నాడు పొద్దు పత్రికలో ప్రచురిస్తారు.
మీ ఆశీస్సులు మాకెప్పుడూ ఉండాలి! నమస్కృతులు.
చంద్ర మోహన్
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.