సర స్వతీ నమస్తుభ్యం.
సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు పెక్కురున్నారు. ఆంద్ర భాషామతల్లి సేవలోపునీతులవుతున్నారు.
వారిని చుసి మనం ఉప్పంగిపోతాం. మనకీ అనిపిస్తుంది వారిలాగా మాతాదాలనీ, వారిలాగా పద్యాలు వ్రాయాలని. .
" సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్న వేమన పలుకు మనకి తెలియంది కాదు.ఐతే ప్రయత్నం చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనమూ ప్రయత్నిద్దాం.
ముందుగా కొన్ని అనుసరణీయాంశాలు. :-మనకి గద్యనయినా పద్యాన్నయినా అర్థస్ఫురణ కలిగేటట్టు చదువ గలగాలి.
ఆతరువాత సాధ్యమయినన్ని ఎక్కువ పద్యాలు చదవాలి. ఏ ఛందస్సులో వ్రాయాలనుకుంటే ఆ ఛందస్సులో గల పద్యాలు చదివినట్లయితే ఆ ఛందస్సులో సులభంగా వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.
నేటి మీ ప్రయత్నానికి నాన్డి పలుకుతారా ! ఐతే వినాయక నవరాత్రులు సందర్భంగా మనం వినాయకుని వర్ణిస్తూ మీకు వచ్చిన ఛందంలో వ్రాసి పోస్టు చేయండి.. ఎదురుచూడనామరి?
నేటి విషయం వినాయక వర్ణన నిర్విఘ్నమస్తు.
చింతా రామ కృష్ణా రావు. .
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది



1 comments:
శ్రీ గణనాయక ప్రార్థన:-
ఉ:-అంబకు ముద్దు బిడ్డడవు.అంకము జేర్చి సుఖింపజేయు నా
సాంబుడు నిన్ను, తమ్ముడగు షణ్ముఖుడున్ నిను గొల్చు నిత్యమున్.
సంబర మొప్ప నిన్ గనును సమ్మతి శ్రీ హరి మేనమామ . సౌ
ఖ్యంబుగ నుంటివీవు. మము గావగ నీకు నుపేక్ష యేలనో ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.