కైశ్రీరామ్.
ఆంధ్రామృత పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.
ఉ. శ్రీవరణీయ సత్య మది చేరిన యా నరకాసురాంతకున్
కావఁగ భక్తునిన్ మదిని కాచి వధించెను, తన్ మనోజ్ఞమౌ
భావననొప్పునా జనని భాసిలు రూపము చూడబోవ దీ
పావళిశోభకానగు,నా జనయిత్రి మిమున్ కృపన్ గనున్.
జైహింద్.
Print this post
వ్రాసినది



1 comments:
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి – ఆనంద రూపావళి
చ: నరకుడు దుష్టుడై కడు వినాశముఁ జేయుచు నుండి పృథ్విపై
సురవరులన్ నొగల్చుచును చొక్కగ చేయ, నగారి ప్రార్థనన్
హరి నిజపత్నిసాదిగ సహాయముఁ జేయ,వధించె దైత్యునిన్
నరకుని చావుఁ బండుగ దినమ్ముగఁ బ్రీతిఁ బ్రజాళి సల్పెడిన్
చ: చెడుపయి మంచి గెల్చెనని చేయుచుఁ బండుగ, భారతమ్ము కృ
ష్ణుడు పొనరించినట్టిదగు శోభను మెచ్చి నుతించి యిచ్చతో
గడు హరుసమ్ముతోఁ బ్రజలు కమ్రపు దీపము లుంచి క్రొత్త క
ప్పడములఁ దాల్చి రుచ్యమగు పాకములన్ భుజియింత్రు ప్రీతితో
ఉ: రావణు సంహరించి రఘురాముడయోధ్యకుఁ జేర వీరుడై
పావనుడైన రాఘవునిఁ బార్థివినిన్ గని మోదమొందుచున్
దేవత లందరున్ మురియ, తృప్తిఁ బ్రజాళులు దివ్వెలుంచి దీ
పావళి నన్నిప్రాంతముల పండుగగా బొనరించు చుండెడిన్
శా: దివ్యజ్యోతిని బ్రహ్మ రూపమనుచున్ దీపమ్ములన్ బెట్టుచున్
భవ్యమ్మున్ గొననెంచుచున్ బ్రజలు సాద్భావమ్ముతో నిష్ఠతో
దివ్యాత్ముండగు శ్రీ హరిన్ మనసు నుత్తేజమ్ముతో గొల్చుచున్
నవ్యమ్మౌ గతి వంట జేసి పరమానందమ్ముతో గ్రోలెడిన్
చ: కమల గృహమ్ములన్ దిరిగి కాసు లొసంగునటంచునెంచుచున్
అమల మనస్సుతో జనము లాశ్వయి జమ్మున దీపకాంతిలో
సుమధుర భావనమ్మునను సొంపుగ లక్ష్మికిఁ బూజ జేసి ధా
న్యములను సంపదల్ గొన సనాతన ధర్మము లాచరించెడిన్
అసనారె
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.