గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2019, ఆదివారం

పఠిమా,పరిహరణా,నతయా,వినిర్మలా,భారజాశ్రీ,దొర్లాడు,నతయతా,నతోత్తేజ,వక్రయా,చిత్తోన్మాద,గర్భ"-చెడుచేతనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
పఠిమా,పరిహరణా,నతయా,వినిర్మలా,భారజాశ్రీ,దొర్లాడు,నతయతా,నతోత్తేజ,వక్రయా,చిత్తోన్మాద,గర్భ"-చెడుచేతనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                          
"-చెడుచేతనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.స.భ.ర.జ.స.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుశ్చేష్టిత చేతన క్రియల్!దుర్మదచిత్తమొప్పుచున్!దొరతనంబంచు!చరించన్!
నిశ్చేష్టితమేర్చుజనులన్!నిర్మలతంజెరంచుచున్!నిరుపమంబౌ!నటులెంచన్!
దుశ్చర్యలముంచదగునే?తర్మెద వేల నీతినిన్!దురహమున్మోహన భ్రాంతిన్!
దుశ్చాతురి!ముక్తిగనునే?దుర్మతి వీడుమానవా!దొరలి పోవును సిరు లెల్లన్?
1.గర్భగత"-పఠిమా"-వృత్తము.
బృహతీఛందము.త.జ.స.గణములు.వృ.సం.237.
ప్రాసనియమము కలదు.
దుశ్చేష్టిత చేతన క్రియల్?
నిశ్చేష్టిత మేర్చు జనులన్!
దుశ్చర్యల ముంచ దగునే!
దుశ్చాతురి ముక్తి గనునే?
2.గర్భగత"-పరిహరణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లగ.గణములు.వృ.సం.87,
ప్రాసనియమము కలదు.
దుర్మద చిత్త మొప్పుచున్!
నిర్మలతం జెరంచుచున్!
తుర్మెద వేల?నీతినిన్!
దుర్మతి వీడు మానవా!
3.గర్భగత"-నతయా"-వృత్తము.
బృహతీఛందము.న.త.య.గణములు.వృ.సం.104.
ప్రాసనియమము కలదు.
దొరతనంబంచు చరించన్!
నిరుపమం బౌనటు లెంచన్!
దురహమున్మోహన భ్రాంతిన్!
దొరలి పోవుం! సిరు లెల్లన్!
4.గర్భగత"-వినిర్మలా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.స.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుశ్చేష్టిత చేతన క్రియల్!దుర్మద చిత్త మొప్పుచున్!
నిశ్చేష్టిత మేర్చు జనులన్!నిర్మలతం జెరంచుచున్!
దుశ్చర్యల ముంచ దగునే?తుర్మెద వేల?నీతినిన్!
దుశ్చాతురి ముక్తి గనునే?దుర్మతి వీడు మానవా!
5.గర్భగత"-భారజాశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.స.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము!
ప్రాస నియమము కలదు.వృ.సం.
దుర్మద చిత్తమొప్పుచున్!దొరతనంబంచు చరించన్!
నిర్మలతం జెరచుచున్!నిరుపమంబౌనటు లెంచన్?
తర్మెదవేల?నీతినిన్!దురహమున్మోహన భ్రాంతినిన్!
దుర్మతివీడు మానవా!దొరలి పోవుం సిరులెల్లన్!
6.గర్భగత"-దొర్లాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.స.భ.మ.భ.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మదచిత్త మొప్పుచున్!దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!
నిర్మలతం జెరచుచున్!నిరుపమంబౌనటు లెంచన్?నిశ్చేష్టితమేర్చు జనులన్!
తుర్మెదవేల!నీతినిన్!దురహమున్మోహనభ్రాంతినిన్!దుశ్చర్యల ముంచదగునే!
దుర్మతి వీడు మానవా!దొరలి పోవుం సిరు లెల్లన్?దుశ్చాతురి ముక్తి గనునే?
7.గర్భగత"-నతయతా"-వృత్తము.
ధృతిఛందము.న.త.య.త.జ.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!
నిరుపమంబౌనటులెంచన్!నిశ్చేష్టిత మేర్చు జనులన్?
దురహమున్మోహన భ్రాంతినిన్!దుశ్చర్యల ముంచదగునే?
దొరలిపోవుం సిరులెల్లన్?దుశ్చాతురి ముక్తిగనునే?
8.గర్భగత"-నతోత్తేజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.య.త.జ.స.భ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!దుర్మద చిత్తమొప్పుచున్!
నిరుపమంబౌనటులెంచన్!నిశ్చేష్టిత మేర్చు జనులన్!నిర్మలతంజెరచుచున్!
దురహమున్మోహన భ్రాంతినిన్!దుశ్చర్యలముంచదగునే!తుర్మెదవేల నీతినిన్!
దొరలి పోవుం సిరు లెల్లన్?దుశ్చాతురి ముక్తి గనునే!దుర్మతి వీడు మానవా!
9.గర్భగత"-వక్రయా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.భ.భ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మద చిత్తమొప్పుచున్!దుశ్చేష్టిత చేతన క్రియల్?
నిర్మలతం జెరచుచున్!నిశ్చేష్టిత మేర్చు జనులన్!
తర్మెద వేల?నీతినిన్!దుశ్చర్యల ముంచ దగునే!
దుర్మతి వీడు మానవా!దుశ్చాతురి ముక్తి గనునే?
10,గర్భగత"-చిత్తోన్మాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.భ.భ.జ.స.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మదచిత్త మొప్పుచున్!దుశ్చేష్టిత చేతనక్రియల్!దొరతనంబంచు చరించన్!
నిర్మలతంజెరచుచున్!నిశ్చేష్టితమేర్చు జనులన్!నిరుపమంబౌనటు లెంచన్?
తుర్మెదవేల!నీతినిన్!దుశ్చర్యలముంచదగునే?దురహమున్మోహనభ్రాంతినిన్
దుర్మతివీడు మానవా!దుశ్చాతురి ముక్తి గనునే?దొరలిపోవుం!సిరులెల్లన్?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.