గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2019, సోమవారం

బాలభావన శతకావిష్కరణ

జైశ్రీరామ్
🙏🏼ఓంనమోనారాయణాయ🙏🏼
సాహితీబంధువులకు శుభోదయమ్.💐

ఆ జగన్మాయ అనుగ్రహంతో నిన్నను ప్రజ పద్యం కూటమిలో నాచే విరచింపఁబడిన బాలభావన శతకము శ్రీ అనుమాండ్ల భూమయ్యగారి చేతుల మీదుగా ఆవిష్కరింపఁబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను.

తదనంతరం బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణగారు దయతో ఈ కృతీని అంకితము తీసుకొని నాకు ఆనందంకలుగజేసారు.

ఎందరో మహనీయులు వచ్చి నన్నభినందించిరి. అందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనములు.

ఈ శతకము పెద్దవారికి పిల్లలయెడ సానుకూలమైన మార్పు తప్పక ఆ పరమేశ్వరి తీసుకు రాగలదని నమ్ముతున్నాను.

జైశ్రీమన్నారాయణ🙏🏼
వందే భారతమాతరమ్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషముగా నున్నది . మరిన్నిశతకములను రచించి అందించ వలెనని ఆశీర్వదించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.