గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2019, ఆదివారం

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
శ్రీ సీతారామ చరణారవిందాభ్యాం నమోనమః.
నేడు పరమ పవిత్రమైన శ్రీరామ నవమి. ఈ సందర్భముగా మీకందరికీ నా శుభాకాంక్షలు.
ఆసీతారామకల్యాణ వైభవాన్ని కనులారా తిలకించనున్న మహనీయ పునీత జన్ములకు ముందుగా పాదాభివందనమాచరించుచున్నాను.
అణువణువున్ పునీతమయెనద్భుతభారత దేశమెల్ల నా
ఘనులగు రామసీతమల ఖ్యాతిఁ గడించిన పాద ధూళిచే.
మునివరులెల్ల పూని, తమ ముచ్చట తీరగ పెండ్లిసేయు నా
ఘనులకు నేడు. కాంచుడది కామితముల్ నెరవేర మీకిలన్. 
ఆ సీతారాములు మిమ్ములను కటాక్షించుఁగాక.
జైశ్రీమన్నారాయణ.
వందే భారత మాతరమ్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

AMDARIKEE SUBHAAKAAMKSHALU

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.