గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2017, గురువారం

సత్యసాహితి ప్రథమ వార్షికోత్సవము.

 జైశ్రీరామ్.
ప్రథమ వార్షికోత్సవమును  ఆనందోత్సాహాలతో జరుపుకొనుచున్న 
నిర్వాహక్కులకు, కవులకు నా అభినందనలు.
కంద గర్భ చంపకమాల.
ప్రతమనునట్టులీ తెలుగు భాతిని పెంచెడి సత్య సాహితీ 
గతి నుతమౌన్ గదా! కవుల కాల్పనికత్వ వివర్ధనోద్ధతిన్.
క్షితి ఘనులీ నుతుల్ సుజన సేవ్య నయాక్షర దీక్ష నక్షయా
కృతి గరిమన్ వహించి పరికించి రచింపఁగఁ జేయు నేర్పునన్.
చంపకమాల గర్భస్థ కందము.
మనునట్టులీ తెలుగు భా
తిని పెంచెడి సత్య సాహితీ గతి నుతమౌన్ 
ఘనులీ నుతుల్ సుజన సే
వ్య నయాక్షర దీక్ష నక్షయాకృతి గరిమన్.
పునరభినందనలతో
మీ
చింతా రామకృష్ణా రావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సత్య సాహితీ ప్రధమ వార్షికోత్సవ సభను విజయ వంతముగా జరుపుకోవాలని కోరుతూ శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.