గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2016, శనివారం

సూక్ష్మజ్ఞానముఁ గొల్పి నన్నుఁ గనుమా!

జైశ్రీరామ్.
ఓం మహాదేవ్యైచ విద్యహే విష్ణు పత్న్యైచ ధీమహి
తన్నో లక్ష్మి : ప్రచోదయాత్
లక్ష్మీ! పాల సముద్ర రాజ తనయా! లక్ష్యార్థ సంధాయినీ!
శ్రీ క్ష్మాభాగ విశాఖ పట్టణమునన్ చెన్నొందుచున్, భక్తులన్
సూక్ష్మజ్ఞాన ప్రపూర్ణ చిత్తులవగా శోధించి కాపాడుదే!
సూక్ష్మజ్ఞానముఁ గొల్పి నన్నుఁ గనుమా! శుద్ధాంధ్ర భాషాకృతీ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా రక్షించి కాపాడుమా .ధన్యోస్మి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.