గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2016, శుక్రవారం

నమో వేంకటేశా! దండక, - భుజంగ ప్రయాత స్రగ్విణి గర్భ సీసము

జైశ్రీరామ్

నమో వేంకటేశా!
దండక, - భుజంగ ప్రయాత  స్రగ్విణి గర్భ సీసము
హే మారమానాథ! ప్రేమార రమ్మన్న - రా వే వేగంబు రార దేవ!
నా నేరమా వల్లభా! నేర్పరా! నా వి - ధిన్ శ్రీ పరంధామ! దీప్తిఁ గొలుప,
ధీరా! రమోద్ధాముఁడా! రార! రక్షింప - రా రా! కృపా సాంద్ర రక్షనీవె!
నే నా రమన్ గొల్చెదన్ నమ్మరా! గాంచు -  మాతేను. నిత్యాత్మ! మమ్మునింక.
నీదు హృదయాన వసియించు నీరజాక్షి
నన్నుఁ గరుణించి నిన్ జూపె మన్ననమున 
నీవె నన్ జూచి నాలోనె నిలిచి యున్న 
మాత సంతోషమును చెంది మహిని కాచు.
                   జైహింద్.              
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వేంకటేశా దండకము సులభ శైలిలో సులభ గ్రాహ్యముగా అనునిత్యము పఠించుటకు వీలుగా నున్నది. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.