గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2014, గురువారం

అల్పాక్షరరమణీయం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో.  అల్పాక్షరరమణీయం
యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ
బహువచనమల్పసారం
యః కథయతి విప్రలాపీ సః
క. తక్కువ పలుకుచు భావము 
నెక్కువ కనఁజేయు మహితుఁడెచ్చటనైనన్.
ఎక్కువ పలుకుచు భావము
తక్కువ కనఁజేయు వదరు ధరణిని కనగా.
భావము. ఎవడైతే తక్కువ అక్షరాలలో, రమణీయంగా మాటలాడతాడో నిశ్చయంగా వాడే చక్కని వక్త. ఎవడైతే అల్పమైన సరుకున్న సారంలేని మాటలను చెబుతూ ఉంటాడో వాడు ఒక వదరుబోతు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.