గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2014, సోమవారం

అమిత్రస్య కుతస్సుఖమ్ ? మేలిమి బంగారం మన సంస్కృతి 158.

జైశ్రీరాం.
శ్లో. అలసస్య కుతో విద్యా ? అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో మిత్రం ?అమిత్రస్య కుతస్సుఖమ్ ?
గీ. బద్ధకిష్టికి సద్విద్య పట్టువడదు.
విద్య లేకున్న ధనమెట్లు పెరుగు మనకు?
ధనము లేకున్న మిత్రులు దరికి రారు.
మిత్ర తతి లేక సుఖమెట్లు మిగులు మనకు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?

జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందుకే అంటారు " భద్ధకమో పరమ దరిద్రమొ " అని అన్నిటికీ మోలం బద్ధకం దాన్ని విడిచి పెడితే అన్నీ చక్కబడతాయి చక్కని మాట చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.