గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఈనెల3నుండి14వరకు.ఉదయం6.5 నుండి6.10 వరకు ETV లో శ్రీ అనంత భాస్కర శతక ప్రాశస్త్యం. శ్రీ జొన్నవిత్తుల వివరణ

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి విరచిత శ్రీ అనంత భాస్కర శతకము
నందలి ఆణి ముత్యములను పన్నెండింటిని 
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
03-02-2014 వ తేదీ నుండి 15-02-2014 వ తేదీ వరకు 
12 రోజులపాటు
ఈటీవీ లో 
ఉదయం వేళలో 06 గంటల 05 నిమిషముల నుండి 06 గంటల10 నిమిషముల వరకు 
వివరించి చెప్పనున్నారు. 
అవకాశమున్నవారందరు  ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, 
అనంత భాస్కరశతక వైశిష్యన్ని గ్రహించ కలరని  ఆశిస్తున్నాను.    
జైహింద్
Print this post

3 comments:

anantha krishna n.v. చెప్పారు...

అయ్యా మీకు అనేకానేక కృతజ్ఞతలు.....

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి విషయాన్ని చెప్పారు మాకు ఇక్కడ అన్ని చానల్స్ వస్తాయి కాక పోతే కొంచం టైం ఎడ్జస్ట్ మెంటు చూసుకుని తప్పక చూడగలము ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమదనంత కృష్ణ సహోదరా!
పుత్తడికిన్ సుసౌరభము భూమిని పొల్పుఁగ కొల్పినట్లుఁగా
యత్తరు వాసనాలహరులాకసమంతట నింపినట్లుఁగా
నుత్తమ తత్వ తేజసముదారగతిన్ మము పొందునట్లుఁగా
విత్తిరి జొన్నవిత్తుల సవిస్తర వ్యాఖ్యను మీదు పద్యముల్.

అందుకోండి నా అభినందన మందారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.