గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

సంధిమిచ్ఛంతి పండితాః. మేలిమి బంగారం మన సంస్కృతి152

జైశ్రీరామ్.
శ్లో. మక్షికా వ్రణమిచ్ఛంతి , ధనమిచ్ఛంతి పార్థివాః
నీచాః కలహమిచ్ఛంతి , సంధిమిచ్ఛంతి పండితాః.  
గీ. చెడిన చోటు కోరి చేరుచుండును యీగ 
ధరణి పతులు కోరు ధనము భువిని..         
నీచ కలహ వాంఛ నీచులకుండును.  
వరలు సంధి కోరు పండితుండు.                                  
భావము. ఈగలు పుండ్లను , రాజులు ధనమును , నీచులు కలహమును ,పండితులు సంధిని కోరుకుంటారు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజంగా మనసంస్కృతి మేలిమి బంగారం ఇది గుర్తించక నేల విడిచిసాము జేసే వారి దురదృష్టం .చాలా బాగుంది అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.