గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఆగస్టు 2013, శుక్రవారం

వరలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.

జైశ్రీరామ్.
ప్రియ మహనీయ భావ సంపన్నులారా!   ఈ పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారము సందర్భముగా మనోజ్ఞముగా అలంకరింప బడిన ప్రతీ మహనీయ గృహస్తుని ఇంటిలోను అనేక రూపములలో ఆ జగన్మాత శ్రీ మహావిష్ణువు యొక్క మనోహారిణి అయిన శ్రీమన్మహాలక్ష్మి అన్నందచంద్రికలను వెదజల్లుతూ, మీ కుటుంబమంతా నిరంతరం ఆనంద పారవశ్యంతో లోక కల్యాణకరంగా వర్ధిల్లేవిధంగా తన చిఱునవ్వులతో చేయాలని మనసారా  కోరుకొంటున్నాను.
మీ అందరికీ శ్రావణ శుక్రవారము సందర్భముగా శుభాకాంక్షలు.
నాది ఒక్కటే మనవి. ఈ సర్వ జగత్తుకు మూలమైన ఆ జగన్మాతకు ప్రతిరూపాలైన స్త్రీమూర్తులందరినీ కూడా ఆ జగన్మాతగానే భావించుతూ, సముచిత గౌరవమర్యాదలకు లోటు చేయకుండా చూచుకోవాలి. అనవసరమైన వివాదాస్పదులుగా స్త్రీలను చిత్రీకరించే ప్రయత్నం చేయవలదని నా మనవి.
తల్లిగ, చెల్లిగా నమృత ధారల పల్కుల పాలవెల్లిగా,
మల్లెల మానసోన్మహిత మంగళ  సద్గృహ భాగ్య లక్ష్మిగా,
కల్లలెఱుంగనట్టి పసి కందుగ వెల్గెడి మల్లెమొగ్గగా
నుల్లము పొంగ, మీ కిల సమున్నతి బెంచెడి దేవి లక్ష్మియే.

ఆ వరలక్ష్మీ దేవి మీ యింటనుండు స్త్రీల ముఖములలో పొంగిపొరలు ఆనంద స్వరూపిణి. ఈ విధముగా ఆ జగన్మాత మీయింట నిరంతరము స్థిరమై సిరులు కురిపించుచు, లోకకల్యాణ కారకులుగా మిమ్ములను వరలించు గాక.
శుభమస్తు.
జైహింద్.

Print this post

3 comments:

Ayyagari Surya Nagendra Kumar చెప్పారు...

పెద్దవారు, దొడ్డమాట చెప్పారు

Ayyagari Surya Nagendra Kumar చెప్పారు...

పెద్దవారు, దొడ్డమాట చెప్పారు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుట్టినింటి సోదరుల ప్రేమాభి మానములే మా సోదరీ మణులకు వరలక్ష్మీ కటాక్షములు .ధన్య వాదములు తమ్ముడూ ! మా మరదలు పిల్లలు మనవలు అందరినీ ఆశీర్వ దించి ప్రేమతో మీ అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.