గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2013, బుధవారం

కృషితో నాస్తి దుర్భిక్షం . . . మేలిమి బంగారం మన సంస్కృతి143.

జైశ్రీరామ్.
శ్లో: కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః.
మౌనేనకలహంనాస్తి, నాస్తి జాగరుతో భయమ్.
గీ: కఱవు లుండవు కృషి చేయ కమల నయను
జపముతో పాప హరమగు. సహన మతిని
మౌనముగనున్న కలహంబు కానమెపుడు
జాగరూకున కభయంబు జగతిలోన.
భావము:
వ్యవసాయము చేసినచో కఱవుండదు. జపమొనర్చిన పాతకములు తొల్సగిపోవును. మౌనముగా నుండినచో పోట్లాటలు రావు. జాగరూకులమై ఉండినచీ భయముండదు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే వీటిలో కొన్నైనా పాటించ గలిగితే మేలిమి బంగారం వంటి మన సస్కృతికి కొంతైనా న్యాయం చేసిన వార మౌతాము అందుకు అందరు తమవంతు కృషి చేయాలి

Pandita Nemani చెప్పారు...

మాదొక చిన్న ప్రయత్నము:

కరవు లుండవు, పాపముల్ కరగిపోవు
కలహములు చెల్లు, భయములు తొలగిపోవు
మంచి కృషిచేత జపముచే మౌన ముద్ర
చేత జాగరూకతచేత క్షితితలమున

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.