గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2012, శుక్రవారం

పాఠక జన పాళికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

నమో భగవతే వాసుదేవాయ,
పాఠక జన పాళికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
చూడండి మన కృష్ణయ్య తాను చేసిన యీ  సృష్టి రహస్యాన్ని, అది గ్రహించ గల వారిని, అట్టి వారిని తాను కాపాడే విధానాన్నీ ఎలా చెప్పుతున్నాడో .
నా తలపుల్ మహా ప్రణవ నాద లసజ్ఝరి వార్ధి యయ్యె తద్
భాతిజ మీ మహా చలిత బ్రహ్మశుభాండము సద్భవంబు యీ
భూ తల మెన్నగా. కలిత పుణ్యులు కొందరు గాంతురిద్ది యు
ద్భూతముఁగా. శుభాచరణ పూజలు చేసిన చక్క గాతు నే.
ఎంత దయామయుడో చూచారా మన కృష్ణయ్య? గీతా సారాన్ని, అలకందాన్ని  ఒక్క పద్యంలో ఎంత అద్భుతంగా వివరించి మన కన్నులు తెరిపించాడో చూచారా! 
నిజంగా మనం అదృష్టవంతులం. ఆ పరమాత్మ దయాపాత్రులమయ్యాము. ఈ సందర్భంగా మరొక్క పర్యాయం అందరికీ నా అభినందనలు తెలియ జేస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

వందేహం దేవకీసూనుం
వందే సజ్జన రక్షకం
వందే గోపాలకం కృష్ణం
వందేహం నందనందనం

వందే నీలాంబుద శ్యామం
వందే వారిజలోచనం
వందే చక్రధరం దేవం
వందేహం నందనందనం

వందే రాధా హృదబ్జార్కం
వందే కంసాంతకం హరిం
వందే రామానుజం శౌరిం
వందేహం నందనందనం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.