గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2012, మంగళవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు మన్య మహోదయ శ్రీ గంటా శ్రీనివాసరావుకు సమర్పించుకొను చున్న మందార మకరందాలు.

శ్రీరస్తు                       శుభమస్తు                  అవిఘ్నమస్తు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు మన్య మహోదయ శ్రీ గంటా శ్రీనివాసరావుకు
చోడవరం ప్రాంత ప్రజలు గౌరవ పురస్సరముగా సమర్పించుకొను చున్న
మందార మకరందాలు
రచన :- చింతా రామ కృష్ణా రావు.

:- శ్రీ కమనీయ భాషణుని, శ్రేయము గొల్పెడి సత్ వరేణ్యు, గం
టా కపురంపు వంశజుఁని, న్యాయ విధేయుని, శ్రీనివాసునిన్
ప్రాకట మొప్ప చోడవర ప్రాంత ప్రజావళి సత్కరించు నో
శ్రీకర! వేంకటేశ్వరుఁడ! ప్రీతిని గూర్చుమ సత్శుభావళిన్. 1.

శా :- గంటా వంశజ శ్రీనివాస! విలసత్ గాంభీర్య ! సన్మాన్య! మీ
కంటెన్ ప్రాజ్ఞులు కల్గిరే జనుల సౌఖ్యాదుల్ కనన్? నేడు మా
పంటై ప్రీతి రహించు చుండిరికదా!భవ్యా! అమాత్యత్వమే
వెంటన్ వచ్చెను మిమ్ము కోరి. సుమహద్విఖ్యాతినార్జింపగా ! 2.

:- పెట్టుబడుల్ , ప్రజావళికి పెంపున మౌలికమైన సంపదల్,
బిట్టుగ నౌక మార్గముల పెంచ రవాణ, విమాన యానమున్,
పట్టుగ నిర్వహించి మన భారత మాతకు కీర్తిఁ గొల్ప చే
పట్టిన మంత్రి వర్య! మిము వర్ధిలఁ జేయుత ! దైవమెన్నడున్. 3.

సీ:- ప్రజల సంక్షేమమై పథకాలు విరచించి, - నిజమైన కలవైన ప్రజల మనిషి!
నీటిబోరింగులన్ దీటుగా నెలగొల్పి - సాటియే లేనట్టి సత్య వర్తి!
వృక్షమ్ములను పెంచి, విఖ్యాతిగా నున్న - యువతకు సదుపాధి నొనరఁ గొల్పి,
నీటికటకటను నెనరు వాహనముల - నందించి తీర్చిన సుగుణ తేజ!
గీ:- ఆటవస్తువులనొసంగి, యంబులెన్సు
సేవలందించి, మండపాల్ సిద్ధ పరచి,
బస్సు షెల్టర్లు నిర్మించి, ప్రజల మదిని
పాదుకొనిపోయినావయా! భవ్య మూర్తి! 4.

గీ :- మంగళములయ్య ! శ్రీనివాస్! మంగళములు!
మంగళము లౌత ప్రజలకు మంగళములు.!
మంగళములౌత భారతీ! మంగళములు.
మంగళంబులు శ్రీ హరీ! మంగళములు. 5.

చోడవరం,
తేదీ: 14 – 8 – 2012.
మంగళం                           మహత్                         శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.