గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2012, శనివారం

మహా సంకట హర చతుర్థి 05 08 2012

జైశ్రీరామ్.
ప్రతి మాసము కృష్ణ  పక్ష చతుర్థి సంకర హర చతుర్థిగ పాటిస్తే శ్రావణ మాస కృష్ణ పక్ష చతుర్థి మహా సంకట హర చతుర్థిగ ఆచరించ వలెను. సంకట హర చతుర్థి వ్రతం అనుష్టించాలనుకునేవారు యీ దినమునుండి ప్రారంభించి ఒక సంవత్సర పర్యంతము దంపతిసహితముగా అనుష్టించ వలెను. ఈ దినమందు ప్రొద్దున ఉపవాసము అనుష్టించి సాయంకాలము గణపతి పూజ షొడశోపచార పూజలతొ చేసి ఆవు పాలతో లెక చందనము కలిపిన శుద్ద జలముతో అర్ఘ్యము ఇవ్వవలెను.
అర్ఘ్య ప్రదానము నకు శ్లోకములు.
1. క్షీరసాగర సంభూత సుధా రూప నిశాకర గ్రుహాణార్ఘ్యం మయా దత్తం గణేశ ప్రీతి వర్ధన!
2, గణేశాయ నమస్తుభ్యం సర్వ సిద్ది ప్రదాయక. సంకష్టం హరమే దేవ గ్రుహాణార్గ్యం నమోస్తుతే!
3 కృష్ణ పక్షే చతుర్త్యాంతు పుజిత స్త్వం విధూదయే క్షిప్రం ప్రసాదితో  దేవ గ్రుహాణార్ఘ్యం నమోస్తుతే!
4. తిథీనాం ఉత్తమే దేవి గణేశ ప్రియ వల్లభే. సర్వ సంకష్ట నాశాయ చతుర్థ్యర్ఘ్యం నమోస్తుతే!
తర్వాత దంపతులుగా క్రింది మంత్రముతొ గణపతిని 444 మార్లు జపించవలెను.
ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకటం నివారయ నివారయ హుం ఫట్ట్ స్వాహా. తరువాత చెసిన మోదకములలొ 5 ఒక చిన్న బిడ్డకు ఇచ్చి తినిపించ వలెను. వెనుక చంద్ర దర్సనము చేసుకొని భోజనాదులు చెసుకొనవలెను. ఇలా పూజ చేయడము వల్ల అన్ని విధములయిన సంకటములు తొలగిపొవునని గణేశ పురాణమునందు చెప్పబడి ఉన్నది.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

గౌరీసుతం ప్రసన్నాస్యం
జ్యేష్ఠరాజం దయానిధిం
సర్వవిఘ్న హరం దేవం
గణనాథ మహం భజే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.