గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2012, బుధవారం

అష్టావధానానికి తప్పక తప్పక తప్పక వస్తారు కదూ?

జైశ్రీరామ్
తెలుగును మాటలాడు గుణ దీపిత సజ్జనవర్యులార! నే
తెలిపిన యట్లు సత్కవన తేజము నింపెడి సద్వధానమున్
సలుపుట కిచ్చగించిరి ప్రశస్త కవీంద్రులు కట్టమూరి. మీ
చెలువము చూపి నాపయిని శ్రేయము గొల్పగ రండు సమ్మతిన్.
జేపీ నగర్, సభాస్థలి
దీపిత శ్రీ వేంకటేశు దేవళ మందున్
శ్రీ పండితవరు లెన్నగ
రూపొందు వధానమిద్ది శ్రుతి పేయమునౌన్.
తప్పక రావలె, కనవలె.
తప్పక వినవలె కవిత్వ ధారణ విధమున్.
తప్పక యోచింపగ వలె
నిప్పద్ధతి కొలుపు మేలు నెల్లరు కృపతో.
మేధాశక్తిని పెంచెడు
నీధాత్రి వధాన విద్య హృద్యాద్భుతమై.
బాధలు మరిపించును. స
ద్బోధను కలిగించు నిజము పుణ్య ఫలమనన్.
బద్ధకము వీడి రావలె.
నిద్దురపోవుటయు మాని, నిండు మనముతో
నొద్దికతో రావలయును.
శుద్ధాత్ముల కవుల తీరు చూడగ వలయున్.
తప్పక మీ రొత్తురుగా?
ఇప్పట్టున మానిరేని ఇట్టి సభికులన్
గొప్పగు నవధానిని, పెం
పొప్పగ గన నవదు తెలియ నురు గుణ శోభన్.
గుర్తుంచుకోండి.
అష్టావధానం జరుపు తేదీ:- 12 - 02 - 2012. ఆదివారం
సమయము:- మధ్యాహ్నం  3 గంటలకు.
స్థలము:- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణము. జయప్రకాశ్ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరాబాదు.
అవధాని పేరు:- డా.కట్టమూరి చంద్రశేఖరం.
తప్పక రండి.
వివరములకు సెల్ నెంబర్. 9247238537.
జైహింద్.
Print this post

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పండితుల వారికి అనేక నమస్కారములు.
ఇది నా విధి.(నా బ్లాగ్లో ప్రచురించుట.)
కానీ భాగ్యనగరవాసి ని కాను. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగిన తర్వాతే వీటి గురించి వింటుంటాను.ఈ సారి ముందే తెలిసినా రాలేక పోతున్నాను.
నెట్ సమస్యల వల్ల వెంటనే స్పందించలేకపోయినందుకు క్షంతవ్యురాలను.
ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా!శారద దరహాసం చిందిస్తూ అవధాన సభలో నడయాడాలని మా ఆకాంక్ష. భవదీయుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.