గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2009, సోమవారం

ఎవరు గొప్ప? శివుడా? బసవడా?

సీ:-

ఆతడంబకు మగం డీత డమ్మకే మగం డెలమి నాతని కంటె నితడె ఘనుడు.

అతడు శూలము త్రిప్పు నితడు వాలము త్రిప్పు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

అతడు అమ్మున వ్రేయు నితడు కొమ్మున దూయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

అతడు సృష్టిని మోయు నితడతనినె మోయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

తే.గీ:-

శూలి యాతడు కాపుల కూలి ఇతడు. దేవూడాతడు కుడితంత దేవు నితడు

ఈశ్వరుని యన్నిటను మించు నెద్దు గాదె? - ఎద్దు లేకున్న కదలలే డీశ్వరుండు.

జైహింద్.

Print this post

6 comments:

Sanath Sripathi చెప్పారు...

రామకృష్ణ గారూ, పద్యం అద్భుతం గా ఉంది. కృతికర్త మీరేనా?

రవి చెప్పారు...

ఈ పద్యం తెనాలి రామకృష్ణయ్య, మొల్ల రాసిన ఓ పద్యాన్ని హేళన చేస్తూ వ్రాశాడు అని చదివాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అయ్యా! శ్రీపతి సనత్కుమార్ గారూ! ఈ పద్యం ఒక చాటువు. రచయిత ఎవరో తెలిదు కాని నాలుగవ పాదం మాత్రం నేనే కూర్చాను.
గంగిరెద్దుల వారు ఈ పద్యం చదివేవారని ప్రతీతి. రవిగారు ఈ పద్యం తెనాలి రామకృష్ణ, మొల్ల వ్రాసిన పద్యానికి హేళన పద్యమై యుంటుందని వ్రాసిరి. ఐయుండొచ్చు.

రవి చెప్పారు...

ఈ పద్యం వెనుక (నేను చదివిన) కథ ను వీలున్నప్పుడు నా బ్లాగులో రాస్తాను.

రవి చెప్పారు...

మాస్టారు గారు, ఇదుగో ఇక్కడ వ్రాసానండి.

Vasu చెప్పారు...

చాలా బావుంది రామకృష్ణ గారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.