రేనాటి సూరీడు. ... ప్రథమాశ్వాసము.
-
రేనాటి సూరీడు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.చారిత్రక ప్రబంధము.
రచన ... చింతా రామకృష్ణారావు
*ప్రథమాశ్వాసము*.
*శ్రీ నృసింహ ప్రార్థన.*
*శా*. శ్రీమన్మ...
1 రోజు క్రితం
వ్రాసినది



చ:-
ముసిరిన కర్మదుష్ఫలము పూజలుచేయఁగ బుద్ధిఁ బాపగా,
కసురుకొనేటి కర్మమును కాంచుటకైనను లేకఁ జేయు నా
బిసరుహనేత్ర లక్ష్మి సుమపేశలమానస, కొల్చు వారికిన్.
పసుపునుకుంకుమన్ పరమభక్తినొసంగుడు పేరటాండ్రకున్.
ఉ:-
శ్రావణమాసమందు సువిశాలహృదంతరవాసి యౌచు పల్
ధీవరులింటనిల్చు"సిరి" తృప్తిగ సంపద లందఁ జేయుచున్.
సేవలు చేసి యామె కృప చేకొనుడందరు. స్త్రీ జనంబులన్
యా వరలక్ష్మిగా తలచి యాదరమొప్పగఁ గొల్చుటొప్పెడిన్.
శా:-
అమ్మా!శ్రీహరి రాణి!నీదు కృపతో అష్టస్వరూపాత్మవై
నెమ్మిన్ మా గృహమందు నుండ తగునో యమ్మా! కృపాంభోనిధీ!
మమ్మున్ గావగ నెవ్వరమ్మ కలుగున్ మాయమ్మనీకన్న?నిన్
సమ్మాన్యంబుగ నందరందు కనుటన్ సత్ కృత్యమున్ గొల్పుమా!
జైహింద్.