గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2009, ఆదివారం

ఆదిభట్ల నారాయణ దాసు గారి పరమేశ్వర ప్రార్థన.మణిప్రవాళము

హరి కథా పితా మహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు చేసిన పరమ శివుని గూర్చిన ప్రార్థన.ఇది మణిప్రవాళంలో సాగింది. తమాషాగా వుందనిపించి, మీ ముందుంచుతున్నాను.

ఉ:-హెడ్డున మూను, స్కిన్నుపయి హెచ్చుగ డష్టును, ఫైరు నేత్రమున్,

గుడ్డగు గ్రేటు బుల్లు, వెరి గుడ్డగు గాంజెసు హెయ్ రు లోపలన్,

పడ్డది హాఫె యౌచు నల పార్వతి మేను నలంకరింప,

షుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్.

జైహింద్.

Print this post

5 comments:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

చింతా వారికి నమః
పద్యం చాలా గొప్పగా ఉంది _ ఆదిభట్ట వారా ... మజాకా ?
" నేత్రమున్ " బదులు " థర్డు ఐ " అంటే ఇంకా బాగుండేది కదూ !
మంచి పద్యాన్ని అందించినందుకు అభినందనలు !
ఇంతకీ ... రామకృష్ణారావు గారు !
హైదరాబాదుకు వచ్చారేమో ... ఏ సభలలో కనిపించడం లేదేమిటి ?
త్వరలో మీ దర్శనం లభిస్తుందని ఆశిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆచార్య ఫణీంద్రులవారికి అభివందనలు.
పద్యం నారాయణ దాసుగారు రచించారు కాబట్టి మనం మార్చ కూడదు. తరువాత మణి ప్రవాళంలో బహు భాషా సమ్మిశ్రిత సమాసాలుండడం కద్దు. ఆవిధంగా చూస్తే హరికథా పితామహులను అభినందించ వలసినదే ననిపిస్తోంది.
ఇక నేను భాగ్య నగరానికి మకాం మార్చినప్పటికీ అంతా అగమ్య గోచరంగా అనిపిస్తోంది. ఏదారీ అవగాహనకి రావకపోవడంతో ఏ సభలలోను పల్గొని ఆంధ్రామృతాన్ని గ్రోలే భాగ్యం పొందలేకపోతున్నందుకు బాధగానే ఉంది. అతి త్వరలో నా కోరిక నెరవేరక పోతుందా అని ప్రయత్నం చేస్తున్నాను.
మీ అభిమానానికి ధన్యవాదాలు.

రాఘవ చెప్పారు...

బాగు బాగు. మీరిది చెబితే గుర్తొచ్చింది, మణిప్రవాళంలో కర్ణాటక సంగీతపు కృతులు కూడ ఉన్నాయండీ. కాకపోతే మఱీ ఇంత ప్రస్ఫుటంగా ఉండవు. ఉదాహరణకు,

పల్లవి
కృపాలవాల కళాధరశేఖరకృతాభివందన శ్రీరామ

అనుపల్లవి
నృపోత్తమ శరణాగతజనాఘనివారణాద్భుతభాస్కరశరీర

చరణము
అపవర్గఫలకాములను జూచి యడ్డమై యణిమాదిసిద్ధుల మోసము జేసేరు
సుపవిత్రరూప సదా కరుణఁ జూడు సురపాలక త్యాగరాజనుత

Vasu చెప్పారు...

భలే భలే . ఔను మాష్టారూ, మనిప్రావళం ఏంటి అదొక పద్య రీతా ?? వృత్తమా??

సురేష్ బాబు చెప్పారు...

ఇలా కూడా వ్రాయవచ్చని ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుందండీ. చదవగానే నవ్వాగలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.