గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2009, గురువారం

కనుక్కోండి చూద్దాం 2.

ఆంధ్ర జ్యోతులు ప్రకాశింప చేస్తున్నది మన సహోదరి జ్యోతిగారు.

సమాధానం కనుక్కోండి చూద్దాం. అనే శీర్షికతో నేను ప్రచురించినది చూచి, చక్కని సమాధానం చెప్ప గలగడమే కాక ఒక చక్కని ప్రశ్నను కూడా మనముందుంచారు. మీరూ ఆ పద్య రూపంలో నున్న ప్రశ్నను చూచి, మీ సమాధామంతో పాఠకులకుల్లాసం కలిగించండి.

ఇక జ్యోతి గారు వ్రాసినది చూడండి.

అపారమైన తెలివితేటలుండి, పైకి అమాయకంగా ఉండే ఓ ఇల్లాలిని ఆమె భర్త పేరడిగితే ఏకంగా సవాలు విసిరింది..

సీ:-
విపులాక్షి ! "నీ విభు పేరేమి?" యన్నను
చాతుర్య మెసగ నా నాతిబలికె
నక్రంబు హేమంబు నగధాము పుప్పొడి
యబ్బురం బేనుగు యాజి పడవ
అన్నిటి మూడేసి అక్షరంబులు గల
మారు నామంబుల తీరు జూచి
నాధు పేరునకును నడిమ వర్ణంబులు
సరియని జెపితి నెరిగి కొనుము
యుచు నానాతి బల్కె, తా నతిశయముగ
ఇట్టి నామంబు గలవాడే యీతడనుచు
వంచనలులేక బుధులెరింగించిరేని
వారికే నాచరించెద వందనములు.

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???


మీ సమాధానలకై ఎదురుచూడనా?

జైహింద్.


Print this post

6 comments:

Telugu Velugu చెప్పారు...

మాకంత సీన్ లేదు కానీ , ఆన్సర్ చెప్పి పుణ్యం కట్టుకోండి సార్ !

sri చెప్పారు...

సమాధానం చెప్పి పుణ్యం కట్టుకోండి సార్ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సమాధానం కనుక్కోవడంలో నేనూ మీ కోవకు చెందిన వాడినే. కనుక్కుందామనే నేనూ ప్రయత్నిస్తున్నాను.

కంది శంకరయ్య చెప్పారు...

నక్రంబు - మ(క)రి
హేమంబు - క(డా)ని
నగధాముడు - హ(రు)డు
పుప్పొడి - ర(జ)స్సు / పూ(పొ)డి
అబ్బురము - వె(ర)గు / అ(రు)దు
ఏనుగు - ఇ(భ)ము / నా(గ)ము
ఆజి - క(య్య)ము
పడవ - క(ప్ప)లి

ఆవిడ భర్త పేరు "కడారు జ(శ)రభయ్యప్ప" లేదా "కడారు పొరుగయ్యప్ప" కావచ్చు. నా అల్ప బుద్ధికి తోచింది ఇంతే. ఇందులో కొంత భాగమైనా సరిపోతే ధన్యుణ్ణి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది శంకరయ్య కనుగొన్న పతి పేరు
కన్న సతియె యెఱుగు కల నిజంబు.
మదికి తోచినట్టి మధుర పదములవి
సరిరిగ తోచు నాకు సరస మతిరొ!

ఊకదంపుడు చెప్పారు...

కలదు గాధ యొకటి గతమందు ఇట్టిదే
వివరమడిగి నారు విజ్ఞులొకరు
కోరెదమిము సులువు గోరంతనివ్వగా
సతిమనమునెరుగ శంకరార్య !
http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.