అని మీముందుంచిన పద్యానికి కొందరు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ప్రస్తుతం ఈ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పుతున్నాను.
పైది సీస పద్యము.
ఈ సీస పద్యంలో 1) మత్తేభము. 2) కందము. 3) గీతము. అనేవి గర్భితమై ఉన్నాయి.
వాటిని క్రింద విశదపరస్తున్నాను. గమనించండి. 1) మ:- వినయంబొప్పగజూచువారలకుసద్విజ్ఞానిగాదోచుచున్ గుణ సంపన్నుగశోభిలున్పరమతక్రోధంబులేదేలకో? మనసుం బెద్దయె సుమ్మ! యంచుబొగడన్మర్యాదయేరూపమౌన్ జనులేమెచ్చగచోద్యమొప్పమెలగున్. చైదంబులందౌష్ట్యముల్ 2) క:- సురుచిర సుహాసనంబుల ధరణి పయినతానె గొప్ప ధన్యాత్ముడుగా నిరతము.మెలుపున దురితము లరసి మెలగు కరటినరయ నగునే పృథివిన్? ౩) గీ:- సురుచిరసుహాసనంబులధరణిపయిన తానెగొప్పధన్యాత్ముడుగానిరతము. మెలుపునదురితములరసిమెలగుకరటి నరయనగునే? పృథివినదిభరముకాదె?
ఈ విధంగా చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే, పైకి మంచిగా కనిపిస్తూ ఎవ్వరికీ అనుమానమైనా రావడానికి వీలు కలిగించని విధంగా వంచన చేసే నయ వంచకుల విషయంలో జాగ్రత్త సుమండీ.
శ్రీ విరోధి ఉగాది వేడుకలు సాహితీ మిత్రులైన మీరందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొని ఉంటారనుకొంటున్నాను. అందరికీ అభినందనలు.
దీనికంటే మూందుటపాలో నూతన సంవత్సర ఫలాల్ని పద్యాల్లో ివరించాను. మీరంతా చూచే వుంటారనుకొంటాను. సంతోసోషం. సుమారు మూడు మాసాలుగా నిరవకాశం వలన విశ్వనాథ భావుకత మీకందించ లేకపోయినందుకు క్షంతవ్యుడను.
ఇదివరలో 10 భాగములు చెప్పుకొన్నాం. ఇప్పుడు 11 వ భాగం శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాస సారాన్నితెలుసుకొందాం.
రామాయణ కల్ప వృక్షంలో కిష్కంధ కాండలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తున్న సందర్భం. పంపా సరోవర పరిసర భూముల్లో శ్రీరాముడు తిరుగాడుతూ అచ్చటి ప్రకృతిని అణువణువు అన్వేషిస్తున్నాడు.
పంపా అరణ్యం ఒక్కొక్క అందాన్ని ప్రదర్శిస్తున్నది. పూల తీగలూ, ఫల వృక్షాలూ, చిన్నచిన్న పొదలూ, మహావృక్షాలూ, వేటికవే విలక్షణ సౌందర్యంతో ుతున్నాయి. అలాగే నేలలు కూడా కొన్ని చోట్ల ఇసుక భూములూ వున్నాయి. అక్కడంతా జీడి మామిడి పొదలు, పచ్చని స్వర్గం దిగి వచ్చిందా అన్నట్లుందా ప్రదేశంఅంతా. విశ్వనాథ కూర్పును అవధరించండి. శా:- పంపాకాననభిన్నదేశములసౌభాగ్యంబుచిత్రంబునై లింపశ్రీకముగాకనంబడెడి, వల్లీగల్మవృక్షాదులం దింపౌనీడిగచెట్లఱాగరపతానిచ్చోటునిచ్చోటుచొ క్కంపుంగుమ్ములజీడిమామిడిపొదల్గాసైకతశ్రేణులన్.
గరప నేలల్లో ఈడిగ చెట్ల గుంపులు, పోగా పోగా ఇసుక నేలల్లో జీడిమామిడి పొదలు నెలకొని వున్నాయి. భిన్న భిన్న మైన లతలు, పొదలు, వృక్షాలు, స్వర్గ సౌందర్యంతో వున్నాయి. ఇక్కడ విభిన్నమైన భూ భాగాల్ని వర్ణించడం ఎందుకంటే శ్రీరాముని ప్రస్తానం సాగుతున్నట్లు మనకు తెలియఁజేయడమే. సీత కనబడని క్షణం నుండి రాముని మనస్సుకే కాదు తనువుకూ కుదురు లేదు. నిర్విరామంగా ఆయన తిరుగుతూనే వున్నాడు సోదర సహితుడై. ఆ అన్వేషణలో ఆయన చూచిన ప్రదేశాలే ఇక్కడ వర్ణితమగుతున్నవి.
పై పద్యం మమూలుగా చూస్తే ఏ విశేషము లేనట్లు కేవలము పంపాపరిసర భూముల్ని యథా తథంగా వర్ణించినట్లు కనిపిస్తుంది. కాని మహాకవుల కావ్య రచనలో శిల్పం అనేది ఒక నైపుణి. కథను పాఠకుల మనస్సుకు హత్తుకొనేటట్లు చేయడంలో వర్ణనలదే ప్రథాన పాత్ర. ఈ వర్ణనలు మళ్ళీ బహు విధాలు. చలన వస్తువుల్ని వర్ణించే విధానం వేరు, నిశ్చల దృశ్యాల్ని వర్ణించే విధానం వేరు. ఇందుకు కవి లోకజ్ఞుడై ఉండాలి. అటవీ వర్ణనలో కవి కేవలం వృక్ష జాతుల పేర్లు గుదిగుచ్చిఆ జాబితా యివ్వడంతో సరిపోదు. పాఠకుడు ఆ వర్ణనలో రమించడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు రథాధిష్టుడై అడవికి వేటకు వెళ్ళిన సందర్భంలో రథం వేగంగా పోయేటప్పుడు ప్రకృతి ఆయనకు ఏవిధంగా కనిపిస్తోందో వర్ణించాడు. " యదాలోకేసూక్ష్మంవ్రజతిసహసాతద్విపులతాం " అంటూ అతి చిన్నదిగా కనిపించే వస్తువు మఱు క్షణంలో అతి పెద్దదిగా కనిపిస్తోంది అని అర్థం. అంటే ఏమిటి? రథం అంత వేగంగా పోతున్నదన్నమాట. మహా కవుల శిల్పమార్గంయిది. ప్రత్యేకం వర్ణనల్లో ఇది మరీ సూక్ష్మ భావుకత కలవారికే సాధ్యం. రస మార్గ ప్రస్తరణలో నిపుణుడైన విశ్వనాథ ఇక్కడ అడవిని వర్ణిస్తూ అక్కడ ఉన్న రకరకాల నేలలను ( భూములను ) చెప్పడం ద్వారా రాముని సీతాన్వేషణ సాగుతున్న సంగతిని శిల్ప మార్గంలో చెప్పడం జరిగింది. పైకి సామాన్యంగా కనిపించే పద్యాల్లో కూడా తరచి చూస్తే విశ్వనాథ భావుకత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
చూచారుకదా కవి వతంసుడు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వెలువరించిన విశ్వనాథ భావుకత. మరొక పర్యాయం మరో పద్యంలోని భావుకతను తెలుకొందాం. మీ అభిప్రాయాల్ని తెలియఁజేస్తారుకదూ? వారితో మీరు నేరుగా మాటాడాలనుకొంటే వారిసెల్ నెంబరు: 09949175899. అందరికీ శుభము కలుగును గాక. జైహింద్.
శ్రీ విరోధి నమ సంవత్సర నవ నాయకాది ఫలములు:- 1) రాజు శుక్రుడు. దాని ఫలము:-
తే.గీ:- శుక్ర రాజ్యాధిపత్యము శుభము మనకు. వర్షములు పడి నిండుగా పండు భూమి. పాడి సమృద్ధి కలుగును. పతులు మెచ్చ సతులు కామోపచారముల్ సలుపు భివిని.
2) మంత్రి చంద్రుడు. దానిఫలము:-
తే.గీ:- మంత్రి చంద్రుడభ్యుదయంబు మనుజులకును రాజులకునిచ్చు. వర్షముల్ లక్ష్యమొప్ప కురియ పంటలు పసువులు ధరను వెలుగు. యజ్ఞములు బ్రాహ్మణు లుచేయు నద్భుతముగ.
3) సేనాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:- చంద్ర సేనాధిపత్యము చక్కనొప్పు. వెలలు,వర్షములును హెచ్చు నిలను జనులు రోగ రహితులై సుఖులగు యోగమమరు. పాడి పంటలతో భువి పరవశించు.
4) సస్యాధిపతి శుక్రుడు. దాను ఫలము:-
తే.గీ:- పంట కధిపతి శుక్రుడు పరమ శుభుడు. ధాన్య జాతులు ఫలియించు మాన్యముగను. తెల్ల భూములు ఫలియించు తృప్తిగాను. అందరారోగ్య సంపద లందగలరు.
6) అర్ఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:- చంద్రు డర్ఘాధిపతికాన చక్కనైన వర్షములఁ జేసి బాగుగా పంట పండు. దేశమభివృద్ధి పొందుచు తేజరిలును. ధరలు మాత్రము హెచ్చును. తప్పదయ్య!
7) మేఘాధిపతి చంద్రుడు. దాని ఫలము:-
తే.గీ:- మేఘముల కధిపతి శశి. మేలు చేయు. పంటలంతట బాగుగా పండు. నిలను. పాడి పంటలచే భువి పరవశించు. ప్రజల యోగము బాగుండు సుజనులార!
8) రసాధిపతి శని. దాని ఫలితము:-
తే.గీ:- రసముల కధిపతి శని ధరలు తరుగును. నేయి, నూనె బెల్లము తేనె నేలపైన వెలలు లేనివగుచు నుండు వింతగాను. ప్రజల కందుచు, నందక పరుగు పెట్టు.
9) నీరసాధిపతి గురుడు. దాని ఫలము:-
తే.గీ:- నీరసాధిపు గురుడౌట నియతి నిజము. వక్కలును రత్నములు పైడి, ప్రత్తి, ధాన్య ములును, తేనెయు తోళ్ళును, పూలు, మంచి గంధమిటువంటి వాటికి కలుగు వృద్ధి. బ్రాహ్మణులు సుఖ జీవులై వరలు భువిని.
ఆఢక ప్రమాణము, ఆఢక స్థితి:- అష్ఠ యోజన విస్తీర్ణం శత యోజన మున్నతం. 9 భాగములు సముద్రములోను, 9 భాగములు పర్వతముల పైన, 2 భాగములు భూమి పైన వర్షించును. 16 వీసములకు 12 విసముల పంట పండును.
కుంచము 09 - 9 - 2009 వ తేదీ వరకు వృద్ధ వేశ్య చేతి యందుండును - ఆ పిదప - బ్రాహ్మణ బాలుడు చేతి యందుండును. కావున సస్యానుకూల వర్షములు పడును. పంటలు బాగుగా పండును. బ్రాహ్మణ చేతియందలి కుంచము దుర్భిక్షము, సస్య నాశనము కలిగించును.
వాయువు:-
సంవహ అను పేరుగల వాయువు. కావున అల్ప వృష్టి వుండును.
మెరుపు:- చంచల అనే మెరుపు. కావున సు వృష్టి.
ఉరుము:- నిర్ఘోష అను పేరుగల గర్జితము. కావున అల్ప వృష్టి.
సముద్రము:- క్షీర అను పేరుగల సముద్రము. కావున వాయు పీడన ఉన్నప్పటికీ సుభిక్షంగా వుంటుంది.
భూ వాహన శేష ఫలము:-
కర్కోటకుడనే సర్పము భూమిని వహించుచున్నది. దాని వలన వర్షములు తక్కువగా పడును. రాజుకు మరణము సంభవించును.
పశు నాయక ఫలము:- పశు నాయకుడు - దొడ్డి పెట్టువాడు - విడిపించు వాడు
శ్రీ కృష్ణుడు. అయినందున
పశు వృద్ధిః సుభిక్షంచ బహు సస్యార్ఘ సంపదః గోష్టే సార్వాధికారీచ శ్రీ కృష్ణః పశ్యాధిపే.
తే.గీ:- పశువులను పాలనముసేయు వాసుదేవు డందు వలన వృద్ధి యగును మందలుగను. దేశము సుభిక్షమై యుండు. దేశమందు పంటలధికము పండును భవ్యముగను.
బహు క్షీర ప్రదా గావః సర్వ వ్యాధి వివర్జితా. గోష్టార్బహః సదా నిత్యం శ్రీకృష్ణేన సంరక్షకం.
తే.గీ:- దొడ్డి పెట్టెడి వాడు మఱి దొడ్డినుండి విడిచి పెట్టెడి వాడునూ వేణుగోపు డగుటచే పాలనిచ్చెడు నవని యావు లరసి చూడ. నిరోగత పెరుగు భువిని.
ఆర్ద్రా ప్రవేశము:- తే. 21 - 6 - 2009 దీని జ్యేష్ట బహుళ చతుర్దశీ ఆదివారం తె.గం. 3-36. ని.లకు మృగశిర నక్షత్రం, శకుని కరణం, గండ యోగం, వ్షభ లగ్నం, లో అర్ద్రా నక్షత్రం లోకి రవి ప్రవేశించుచున్నందున ధరలు అధికంగా వుంటాయి. గాలుల వలన మేఘాలు తేలిపోవునప్పటికీ సస్యానుకూల వర్షాలు పడును. నీటికి కొరత ఉండదు. గండ యోగం కవున ప్రజలలూ భయాందోళనలు పెరుగుతాయి. వృషభ లగ్నం కావున పసు గణాభివృద్ధి జరుగును.
మొత్తముపై సంవత్సర ఫలం:- శ్రీ విరోధి నామ సంవత్సరం సుజనుల కవిరోధి. దుష్టులకు విరోధి. పాడి పంటలు బాగున్నప్పటికీ ధర వరలు మాత్రము హెచ్చుగానుండును. ఈశ్వరాభిషేకముము ఈ సంవత్సరం మేలు కూర్చును. దాని వలన గ్రహములు కూడ శాంతించును.
స్వస్తి.
సర్వాణిసన్మంగళానిభవంతు.
చింతా రామ కృష్ణా రావు.
శ్రీ పుల్లెల శ్యామ్ గారుదండక రచనా విధానము తెలిసినవారిని వివరించమని చక్కని కోరిక కోరారు. అందుకు డా. ఆచార్య ఫణీంద్రగారు కొంత వివరణ నద్భుతంగా యిచ్చారు. పిదప శ్రీముక్కు రాఘవ కిరణ్కుమార్ దండకములేయే గ్రంథాలలో లభ్యమైనాయో తెలియఁ జేశారు. పుష్యంగారి బలీయమైన వాఛ ఎందరినో మేలుకొలిపింది. వారికి నా అభినందనలు. నేను కూడా దానికి సంబంధించిన నిర్వచనాన్ని తెలుపుతున్నాను. సీ:- పుష్యముపేరుతోపుల్లెలశ్యాముతా దండకనియమముతనకుతెలుప మనిరి. ఫణీంద్రులువినిచెదండకము తగణములకుపైనతగునుగురుడ నుచు.రాఘవయుతెల్పెనుతనులభించిన లక్ష్యములసదృశలక్ష్యమొప్ప. తిమ్మకవియుతానుసమ్మోదమునదీని లక్షణమునుతెల్పెనక్షయముగ. గీ:- దానివివరింతునేనిట. తప్పులున్న ఒప్పులనుదెల్పివివరింపనొప్పుమీకు. మీరలెఱిగినలక్ష్యముమీరుతెలిపి జ్ఞానబోధనుచేయుడోజ్ఞానులార.
రాఘవవివరించినదండకఉదాహరణలు:- ౧ మనుచరిత్రలోనూ వసుచరిత్రలోనూ రగడలైతే ఉన్నాయి కానీ దండకాలు సున్నా. ౨ పారిజాతాపహరణంలో రగడలూ ఉన్నాయి, దండకమూ ఉంది. చిత్రగర్భబంధకవిత్వాలూ ఉన్నాయి. కానీ పంచకావ్యాలలో పారిజాతాపహరణాన్ని ఎందుకు చెప్పలేదా అనుకున్నాను. వెంటనే నాకే అనిపించిందండీ... కేవల ఛందస్సే కాదు కదా కావ్యాన్ని నిలబెట్టేదీ అని. ౩ హరవిలాసంలో ఏకంగా రెండు దండకాలు ఉన్నాయి. రగడలు అస్సలు లేవు. పాండురంగమాహాత్మ్యంలో కూడా ఇంతే. ౪ నేను చూసిన వాటిలో దండకాలు ఎక్కువ శాతం రెండు న గణాలతో ప్రారంభమయ్యాయి. అన్నీ గురువుతోనే ముగిసాయి. ౫ యగణాల దండకం నేను చూడలేదు. కానీ ఉండవచ్చునేమో అని ఊహిస్తున్నాను.
శ్రీసకల సద్గుణ పునాది, సకల దుర్గుణ సమాధి శ్రీ విరోధికి స్వాగతం పలుకుతూ అనేకమంది మహాకవులు తమ కవితాకోకిలగానం వినిపిస్తున్నారు.
అట్టి వారిలో ప్రముఖ కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు పంపిన కవితలో వారి హృదయాని చదువుదాం.
ఆకు పచ్చ సంతకము లొనర్చి క్రొత్తఅవతారముతోఅధికారముద్రతో.!! దీని లోని ఆంతర్యం మీకర్థమైందా? ఈ కవి వతంసునకు జిల్లా పరిషదున్నత పాఠశాలప్రథానోపాధ్యాయ పదవి వరించడం మూలంగా ఆకుపచ్చ సంతకం అధికారముద్ర లభించాయి.
సు కవుల రచనలలో సమకాలీన స్థితిగతులను, వారి పరిస్థితులను కూడా మనం గ్రహించ వచ్చనడానికిదొక నిదర్శనం.
మరొక పర్యాయం మరొక కవి కవితాగానాన్ని పరికిద్దాం.
జైహింద్.