సమస్యా పూరణం చేయడంలో కించిత్ అలసత్వానికి కారణం బహుశా పనుల వొత్తిడై వుండ వచ్చు.
మన మేధస్సు చా లా తమాషా ఐనది. నిరంతరం సాధన చేస్తుంటేనే ఆ కవితా ధార కొనసాగుతుంటుంది.
ఇప్పుడు మరొక సమస్య పూరణ కొఱకు మీ ముందుంచుతున్నాను.
సమస్య:-
అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి.
మీకు నచ్చిన విధంగా పూరణ చేయండి. వెంటనే పంప గలందులకు మనవి.
జైహింద్.
Print this post
26, ఫిబ్రవరి 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 comments:
తేటగీతి :
మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడు
అన్న పెండ్లాము, అత్తను, గన్నతల్లి,
జనుమనిచ్చియు, పిల్లనిచ్చియును, తల్లి
యంతటి యొక తల్లియునయి, యొప్పిరిలను.
మూడవ పాదం యతి అనుమానంగా అనిపిస్తున్నది మాస్టారు గారు.చేతులెత్తేశాను. మీదే భారం. :-)
"అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి"
యెవరొ చెప్పాలి చెప్పాలి యిప్పుడనుచు
వరుసలను నేర్పు వేళను ప్రశ్ననడుగ
నపుడు పిల్లలు పలికి "రమ్మమ్మ" యనుచు :)
తేటగీతి :
మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడు
అన్న పెండ్లాము, అత్తను, గన్నతల్లి,
తనయునటు జూచు, యిచ్చును తనయనుకృప
కని తననుపెంచు క్రమమున గౌరవముగ.
క:-
వరుసలు తెలిపిరి రాఘవ.
సరిగా తమ పిల్లలకును చక్కగ తెలిపెన్
సరసుడు రవి చక్కగతన
వర గుణములు చాటి వ్రాసె. భవ్యాత్ముండై.
రాఘవ రవులకు అభినందనలు.
నా పూరణను కూడా మీ ముందుంచుతున్నాను.
త:-
అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి
నాకు అమ్మమ్మ యౌనంచు నందు ! వదిన
యన్న పెండ్లాము, అత్తను గన్న తల్లి
నాయనమ్మగ , చెప్పుట న్యాయమగును.
అన్న పెండ్లాము అత్తను కన్న తల్లి
అన్న, పెండ్లాము అత్తను కన్న తల్లి
అనియె! పెండ్లాము అత్తను కన్న తల్లి
కన్న మిన్నగా జూచుట కడు పసందు.
అన్న గారు తన పెండ్లాము అత్తను ( అనగా అమ్మను ) కన్న తల్లి అని పిలువగా, ఆ పెండ్లాము తన అత్తగారిని కన్నతల్లి అని పిలిచింది. పెండ్లాము తన అత్తగారిని అమ్మ కన్నా మిన్నగా చూడటం ముదావహం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.