గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

ఎందరికిది వచ్చును మన వందే మాతరము గీతి.

కందము:-
ఎందరికిది వచ్చును మన
వందే మాతరము గీతి
భారత భువిపై.
కొందరికిది రాదు. నిజము
నిందరిలో చెప్పుచుంటి నెఱుగుట కొఱకై .


సహోదర సహోదరీమణులారా! మన మాతృ దేవత భరత మాత ముద్దు బిడ్డలమైన మనమందరం భిన్నత్వంలో ఏకత్వమనే సిద్ధాంతానికి కట్టుబడి సహ జీవనం సాగిస్తున్నాం.
ఎవరిది ఏ కులమైనా ఏ మతమైనా అందరం యీ తల్లి బిడ్డలమే కదా! మనం దైవ ప్రార్థనలు చేసేటప్పుడు దైవారాధన చేసే టప్పుడు ఎవరి అభిమతానికి వారు కట్టుబడినా, మాతృదేవతైన భారతమాత విషయంలో మాత్రం అంతా ఒక్కటే కదా! అందరం కలిసికట్టుగా వందే మాతరాన్నే ఆలపిస్తాము కదా? మరి ఈనాడు మనలో ఎంతమంది లక్ష్యం కలిగి కార్యక్రమారంభ సమయంలో తప్పని సరిగా వందే మాతర గీతాన్నాలాపిస్తున్నారు? ఎందరికీ పూర్తి పాట పాడడం వచ్చు?

నేనీమధ్య రిపబ్లిక్ దినోత్సవం రోజునా సామాజిక సంస్థల ఉత్సవాలలోను యీ గీతాన్ని మరచిన సంఘటనలను చూచి చాలా మానసికవేదనకు గురయ్యాను.

అసలా పాటని మీరూ గమనించండి. పూర్తి పాఠం యిదేనా? లేక యింకా ఏమైనా ఉందా? అనే విషయాల్ని చెప్పడం విషయంలో నిర్లక్ష్యం చేయ వలదని మనవి.

వందే మాతరం-----గీతం.
వందే మాతరం---------వందే మాతరం.
సుజలాం- సుఫలాం----మలయజ సీతలాం
సస్య శ్యామలాం----మాతరం-------వందే మాతరం.-----వందే మాతరం.-------------------------1

శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినీం,
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీం,
సుహాసినీం,
సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం, మాతరం------వందే మాతరం----- వందే మాతరం.------------------------2

కోటీ కోటీ కంఠ కలకల నినాద కరాలే
కోటీ కోటీ భుజైధృత ఖర కరవాలే
అబలా కేనో మాం ఎతో బలే
బహు బల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం------వందే మాతరం------వందే మాతరం.---------------------------3

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే-----వందే మాతరం----వందే మాతరం.-----------------4

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యా దాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం-----వందే మాతరం-----వందే మాతరం.-----5

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం, భరణీం, మాతరం,------వందే మాతరం,------ --వందే మాతరం. -----------------------6

ప్రియ పాఠకులారా! మీరు తప్పక దేశభక్తి విషయంలో స్పందిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను..ఈ గీతాన్ని తప్పక సందర్భం వచ్చినప్పుడు అవకాశం జారవిడువక తప్పక పాడేలాగ మనం చేయగలగాలి.
క్రమశిక్షణ దేశ భక్తి ఎక్కడ లోపించదో దేశ రక్షణ అక్కడ ఉంచకనే ఉంటుంది. మనకి జన్మనిచ్చి, రక్షణ భారం వహిస్తున్న మన తల్లి భరత మాతకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ, దేశ భక్తిప్రపూర్ణులైన మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను.
జైహింద్. babai Print this post

4 comments:

చంద్ర మోహన్ చెప్పారు...

వందేమాతరం గీతం మొత్తం మన జాతీయ గీతం కాదండీ. అందులో పల్లవి, మొదటి చరణం మాత్రమే జాతీయ గీతం (National Song) గా మన రాజ్యాంగం గుర్తించింది. మిగిలిన పాటను నేర్చుకోవలసిన అవసరం గానీ, పాడవలసిన అవసరం గానీ లేదు.

ఒక చిన్న అచ్చు తప్పు... "దృమదళ" కు బదులుగా "ధృమదళ" అని వచ్చింది. సవరించగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చంద్ర మోహనా! వందనాలు.
మీరు స్పందించి వెంటనే కామెంటు పంపినందుకు సంతోషం.
వందే మాతర గీతం పూర్తి గీతం చాలా మందికి తెలియదని పూర్తి గీతాన్ని పాఠకులముందుంచాను.
గీతమంతా పాడితే అద్భుతంగా వుంటుంది.
ముఖ్యంగా మనద్రుష్టిలో పడ్డ ఏ కార్యక్రమంలోను, వందేమాతరం పాడకుండా ప్రరంభం కాకూడదు.
మనం కొంచెం శ్రద్ధ తీసుకొని అనువర్తింప జేయాలి. ఇదీ నా వుద్దేశం.
నమస్తే.

రాఘవ చెప్పారు...

చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవకుల పుణ్యమా అని నేర్చుకున్న వన్దే మాతరం పూర్తి పాటని మళ్లీ గుర్తుచేసారండీ.

సురేష్ బాబు చెప్పారు...

అత్యద్భుతముగా ఉందండి. ఇంతకు మునుపు ఒకసారు పూర్తి గీతం చదివాను గానీ,మళ్ళీ ఎక్కడా ఈ గీతం పూర్తిగా దొరకలేదు. ఇప్పుడు మీ దయ వలన దీనిని నకలు (copy) తీసుకొంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.