ఓం శాంతిః.
ప్రముఖ నేపథ్య గాయిని జానకి గారు
తే. 11 - 7 - 2026న
దివంగతులైనారన్న విషయం తెలియఁజేయుటకు విచారిస్తున్నాను.
సీ. పసిపాపగొంతులో పారాడు స్వరముతో ముద్దుగా పాడెడి పూజ్యురాలు,
బాలబాలికలట్లు పరవశమ్మున పాడు ప్రఖ్యాత గాయిని పాటల గని,
యువతులు పాడెడి యుదయకోకిలగానమాధురుల్ వెలయించు మధుర గాత్ర,
వృద్ధులట్లుగ పాడి పేరును గన్నట్టి జానకి దివికేగె మౌనముగను,
గీ. గాన కోకిల జాతికే గర్వమరయ,
నట్టి యీ తల్లి యాత్మకునమరుగాగ
శాంతి, పరమాత్మ పాదాల చెంత చేరి
ముక్తి సామ్రాజ్యమేలుత పుణ్యగతిని.
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఓం శాంతిః శాంతిః శాంతిః.
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.