గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2019, శనివారం

ప్రజ పద్య కుటుంబ సమావేశము సందర్భగా స్వాగతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! వందనములు.
ప్రజ పద్య వేదిక నిర్వాహకులలో అతి ప్రముఖులైన ఒక మహనీయులు 
"పెద్దలార జ్ఞానవృద్ధులార!" అను మకుటముతో నాచేత ఆ పరమాత్మ వ్రాయించిన 
బాలభావన శతకమును 
ముద్రింపించి యున్నారు. 
వారు ఈ శతకమును తే.14 - 4 - 2019. ని ఉదయం 10న్నర గంటలకు
(ఉస్మానియా విశ్వవిద్యాలయము లోనికి ప్రవేశించగానే కమానుంటుంది దానికి కుడివైపున ఉంటుంది). 
"సురభారతి సమితి" లో 
ప్రజ పద్య  కుటుంబ సమావేశము సందర్భగా 
ఆవిష్కరణ చేయుచున్నారు.
ఈ శతకమును బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ సహోదరులకు అంకితము చేయనున్నాను. 
ఇదే సందర్భములో మరొక ముగ్గురు మహనీయ కవులచే విరచింపఁబడిన  మూడు గ్రంథములను కూడా ఆవిష్కరింపనున్నారు.
సాహితీ ప్రియులు, ప్రజ పద్య కుటుంబ సభ్యులు అభిమానముతో విచ్చేసి ఈ సభనానందావహమగునట్లు చేయఁగలరని ఆశించుచున్నాను.. 
జైశ్రీమన్నారాయణ.
వందే భారతమాతరమ్...
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మహనీయులైన పండితులందరికీ అభినందన మందారములు
చాలా సంతోషముగా నున్నది " శుభమస్తు "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.