గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2016, ఆదివారం

వేంకటేశ్వరా! . . . శ్రీ రేగడమిల్లి కృష్ణ కిరణ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాని రేగడమిల్లి కృష్ణ కిరణ్ కవి విరచిత వేంకటేశ్వరా పద్యకృతి పఠన యోగ్యముగా ఇందుంచియున్నాను. మీరు సావధానముగా పఠించి మీ అభిప్రాయములను తెలియఁ జేయఁగలరు. 
సప్తవ్యసనములద్రులు
ప్రాప్తింతువు వానిఁ గడవ భక్తి నటంచున్
దీప్తంబొనరించె కిరణుఁ
డాప్తిని కరుణించి కావు మతనిని దేవా!
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

meeru maa allunni asirvadistu aviskarinchina 'venkateswara'prapanchavyaptamayye vidhamga avakasam kalginchinanduku maa &saroja kutumba sabhyulanta krutagnatabhivandanalu.
Dr`L.S.Y.V.Sarma.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సహోదరా!
కవియగు నల్లునిం గని ప్రకాశము చేయక యెట్టులుండుదున్?
ప్రవిమల కల్పనా చణ విభాసిత కృష్ణ జగత్ప్రసిద్ధుఁడై
జవన హయంబులం గెలుచు సత్కవనాశ్వ రయంబునొప్పుచున్
భువి వెలుగొందగా వలయు పూజ్య కవిత్వ పటుత్వ సంపదన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.